/rtv/media/media_files/2025/01/24/ikenDuI8cM6rpqPEngjG.jpg)
mohan yadav Photograph: (mohan yadav)
మధ్య ప్రదేశ్ రాష్ట్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. మతపరమైన ప్రదేశాల్లో మద్యంపై నిషేధం విధిస్తూ మధ్యప్రదేశ్ మంత్రివర్గం శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. మహేశ్వర్‌లో జరిగిన మంత్రివర్గ సమావేశం అనంతరం ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ క్యాబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని ప్రకటించారు. కొత్త ఎక్సైజ్ పాలసీ అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఈ నిర్ణయం అమలు కానుంది.
राज्य शराबबंदी की दिशा में आगे बढ़े, इसके लिए हमने प्रथम चरण में 17 धार्मिक नगरों में शराब बिक्री पर प्रतिबंध लगाने का निर्णय लिया है।#महेश्वर_में_एमपी_कैबिनेट pic.twitter.com/oGWtuXiPe3
— Dr Mohan Yadav (@DrMohanYadav51) January 24, 2025
ఉజ్జయిని, ఓంకారేశ్వర్‌లు జ్యోతిర్లింగాలుగా ప్రసిద్ధి చెందగా, మైహర్ ప్రముఖ శక్తిపీఠంగా ఉంది. నర్మదా నది పుట్టుక ప్రాంతం అమర్‌కంటక్. మధ్యప్రదేశ్‌లో కృష్ణ భగవానుడు, శ్రీరాముడు ఎక్కడెక్కడ అడుగుపెట్టారో అక్కడ ఈ మద్యం అమ్మకాలపై నిషేధం విధించినట్టు ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ తెలిపారు.
ఒక నగర నిగమ్, 6 నగర్ పాలిక, 5 నగర్ పరిషత్, రూరల్ పంచాయతీల్లో మద్యంపై నిషేధం విధించారు. వీటిలో ఉజ్జయిని, ఓంకారేశ్వర్, బాందక్పూర్, మైహర్, సల్కాన్‌పూర్, లింగ, దితియా, మండలేశ్వర్, మహేశ్వర్, మాండసౌర్, అమర్‌కంటక్, మాండ్లా (నర్మదా ఘాట్), ముల్తాయ్, కుండల్‌పూర్, చిత్రకూట్, బర్మన్, పన్నా ఉన్నాయి. వీటికి మత ప్రాధాన్యత కలిగిన ప్రదేశాలుగా మంచి పేరుంది. మధ్యప్రదేశ్‌లో సంపూర్ణ మద్యపాన నిషేద అమలు దిశగా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుంది.