/rtv/media/media_files/2025/03/28/8fkg5Kzj6okw1pMtRkdp.jpg)
Kunal Kamra Gets Pre-Arrest Bail Till April 7th
స్టాండప్ కమెడియన్ కుణాల్ కామ్రాకు మద్రాస్ హైకోర్టులో ఊరట దక్కింది. ఆయనకు న్యాయస్థానం ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ఇటీవల మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్ షిండేపై కుణాల్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపిన సంగతి తెలిసిందే. దీంతో ఆయనపై పలు కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలోనే తనను అరెస్టు చేయకూడదని కోరుతూ కుణాల్ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు.
దీంతో కోర్టు ఏప్రిల్ 7వ తేదీ వరకు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.
Also Read: నేపాల్‌లో మరోసారి ఘర్షణలు..హిందూ దేశం, రాచరిక పాలన కావాలని డిమాండ్
అయితే కుణాల్ కామ్రా తన షోలో ప్రత్యేకంగా ఎవరినీ కూడా ప్రస్తావించలేదని ఆయన తరఫు న్యాయవాది కోర్టులో వాదించారు. ఈ కేసులు మహారాష్ట్రలో నమోదయ్యాయి. కానీ కుణాల్ తమిళనాడులోని విల్లుపురానికి చెందిన వ్యక్తి కావడంతో మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. ఇటీవలే ముంబయిలో కుణాల్ కామ్రా ఓ స్టాండప్ కామెడీ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా ఏక్‌నాథ్ షిండేపై ఓ పేరడీ పాటను పాడారు.
Also Read: మందు బాబుల గుండెలు పిండేసే వార్త.. ఏమిటో తెలిస్తే తట్టుకోలేరు!
అయితే ఈ పాట రాజకీయంగా వివాదం రేపింది. డిప్యూటీ సీఎంపై అవమానకర వ్యాఖ్యలు చేశారని పలువురు పోలీసులను ఆశ్రయించారు. కుణాల్ కామ్రాపై కేసు పెట్టారు. అనంతరం ఈ వ్యాఖ్యలకు నిరసనగా శివసేన కార్యకర్తలు ఆ స్టాండప్ కామెడీ నిర్వహించిన వేదికను ధ్వంసం చేశారు. మరోవైపు దీనిపై ఏక్‌నాథ్ షిండే కూడా స్పందించారు. కామ్రా చేసిన వ్యాఖ్యలు ఓ వ్యక్తికి వ్యతిరేకంగా మాట్లాడటం కోసం సుపారీ తీసుకున్నట్లు ఉందని అన్నారు. వాక్ స్వాతంత్ర్యానికి, వ్యంగ్యానికి ఓ హద్దు ఉంటుందని హితువు పలికారు.
Also Read: కాపాడండి ప్లీజ్ అంటూ కార్మికుల ఆర్తనాదాలు.. కన్నీరు పెట్టిస్తున్న వీడియోలు
Also Read: భూకంపం ఎఫెక్ట్.. 100 దాటిన మృతుల సంఖ్య
Kunal Kamra | maharashtra | eknath-shinde | telugu-news | rtv-news