![kumbamela](https://img-cdn.thepublive.com/fit-in/1280x960/filters:format(webp)/rtv/media/media_files/2025/01/28/rPSr76wXyb4VgHxU9mQp.jpg)
KumbhMela effect Flight ticket prices increased
Kumbhamela: మహాకుంభమేళాకు ప్రపంచ నలుమూలలనుంచి యాత్రికులు తరలివస్తున్నారు. భారీ జన సందోహంతో త్రివేణి కలకలలాడుతోంది. ఇప్పటికే దాదాపు 14 కోట్ల మందికిపైగా భక్తులు కుంభమేళాలో పుణ్యస్నానం చేశారని సనాతన బోర్డు ప్రకటించింది. అయితే బుధవారం మౌని అమావాస్య కావడంతో మూడో అమృత్ స్నానం కోసం భారీ సంఖ్యలో భక్తులు వస్తున్నారు. ఇదే అదనుగా ఫ్లైట్ ట్రావెల్ ఏజెన్సీలు దండిగా దోచుకుంటున్నాయి. ఒక్కటో టికెట్ ధర డబుల్ చేసి సొమ్ముచేసుకుంటున్నాయి.
Also Read: వాళ్లకి రుణమాఫీ చేయొద్దు.. కేజ్రీవాల్ సంచలన డిమాండ్
@RamMNK sir the flight prices to Prayagraj have become astronomical. Airlines seem to be looting citizens of the country who just want to attend the spiritual festival. Please help pic.twitter.com/WUMOHFwqMi
— Pallav Jhawar (@pallavjhawar) January 26, 2025
Also Read: అరుణాచల్‌ప్రదేశ్‌పై అడిగిన ప్రశ్నకు డీప్‌సీక్ షాకింగ్ ఆన్సర్..
5 వేల టికెట్ 32 వేలు..
సాధారణ సమయాల్లో ఢిల్లీ- ప్రయాగ్‌రాజ్(Delhi To Prayagraj) ఫ్లైట్ టికెట్ రూ.5 వేలలోపే. కానీ కుంభమేళా ఎఫెక్టుతో ప్రయాణికుల నుంచి ఏకంగా వేలకు వేలు దోచేస్తున్నారు. ఢిల్లీ-ప్రయాగ్‌రాజ్ విమాన టిక్కెట్ ధర రూ.32 వేలుగా నిర్ణయించి షాక్ ఇచ్చారు. తాజాగా పియూష్ రాజ్ అనే జర్నలిస్ట్ ఇందుకు సంబంధించిన టికెట్ ధరలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. 'ఢిల్లీ నుంచి ప్రయాగ్‌రాజ్ కంటే లండన్ జర్నీ చాలా చీప్. లండన్‌కు టికెట్ కేవలం రూ.24 వేలే. ప్రయాగ్ రాజ్ మాత్రం రూ.32 వేలు' అంటూ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. విమానయాన సంస్థలపై మండిపడుతున్నారు.
Also Read: Arvind Kejriwal: వాళ్లకి రుణమాఫీ చేయొద్దు.. కేజ్రీవాల్ సంచలన డిమాండ్
మౌని అమావాస్య రోజు 10 కోట్ల మంది భక్తులు..
ఇక మౌని అమావాస్య రోజు కుంభమేళాకు సుమారు 10 కోట్ల మందికిపైగా వచ్చే భక్తులు వచ్చే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఇందుకోసం భారీ ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. మౌని అమావాస్య రోజున సూర్యోదయానికి ముందు గంగానదిలో స్నానం చేసే సంప్రదాయం ఉంది. మౌని అమావాస్య నాడు పవిత్ర స్నానం ఆచరించడం వల్ల మోక్షం లభిస్తుంది. పితృదేవతలకు నైవేద్యాలు, పిండ ప్రదానం చేస్తారు. అలాగే వారి పేరున నీళ్లు, నువ్వులు, తర్పణాలు వదిలితే ఉత్తమలోకాలకు చేరుకుంటారని పండితులంటున్నారు. ఈ మహా కుంభమేళా జనవరి 13న ప్రారంభమగగా ఫిబ్రవరి 26 వరకు కొనసాగనుంది.
Also Read: Aghori in Komuravelli: కొమురవెల్లిలో అఘోరి హల్ చల్.. భక్తులపై కత్తితో దాడి!