/rtv/media/media_files/2025/02/08/pKCZGCut17gifwX9OEzA.jpg)
maha kumbha mela 2025 viral videos
ఉత్తర ప్రదేశ్‌లోని ప్రయాగ్ రాజ్‌లో జరుగుతోన్న మహా కుంభమేళాకు కోట్లాదిమంది భక్తులు వెళ్లి పుణ్య స్నానాలు చేస్తున్నారు. అక్కడున్న ఆలయాలను సందర్శిస్తూ ప్రత్యేక పూజలతో భక్తి పారవశ్యంలో మునిగితేలుతున్నారు. అందుకు సంబంధించిన వీడియోలు సైతం సోషల్ మీడియాలో తరచూ వైరల్ అవుతున్నాయి. ఇక ఈ ఆధ్యాత్మిక ఉత్సవం ఈ నెల అంటే ఫిబ్రవరి 26 వరకు ఉండటంతో భక్తులు తండోపతండాలుగా తరలివెళుతున్నారు. ఇక ఈ ఉత్సవం ఎంతోమందికి ఉపాధినిచ్చిందనే చెప్పాలి. ఈ కుంభమేళాలో కొందరు రాత్రికి రాత్రే ఫేమస్ అయ్యారు. మరికొందరు రోజుకు వేలల్లో సంపాదిస్తున్నారు. అవును మీరు విన్నది నిజమే. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం.
రుద్రాక్షలు అమ్మి సినిమా ఛాన్స్
కుంభమేళాలో రుద్రాక్షలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్న మొనాలిసా ఫుల్ ఫేమస్ అయింది. ఆమె అందం.. మరీ ముఖ్యంగా ఆమె కళ్లకు నెటిజన్లు అట్రాక్ట్ అయిపోయారు. దీంతో ఆమెను రాత్రికి రాత్రే ఫేమస్ చేసేశారు. ఈ కుంభమేళా పుణ్యమా అని ఆమెకు బాలీవుడ్ నుంచి ఒక సినిమా ఆఫర్ కూడా వచ్చింది. ఒక దర్శకుడు స్వయంగా వెళ్లి తన సినిమాకు సంతకం పెట్టించుకున్నాడు.
Also Read: ముఖ్యమంత్రి చంద్రబాబు- నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ సుమన్ బేరీ మధ్య ఆసక్తికర చర్చ ..
వేప పుల్లలు అమ్ముతూ
ఈ మహా కుంభమేళా మరో వ్యక్తి జీవితాన్ని మార్చేసింది. ఎలాంటి పెట్టుబడి లేకుండా ఓ యువకుడు కేవలం వేప చెట్ల పుల్లలను అమ్ముకుంటూ రోజుకు వేలల్లో సంపాదిస్తున్నాడు. దీని ద్వారా అతడు కేవలం 4రోజుల్లో రూ.40వేలు సంపాదించినట్లు చెప్పాడు. అయితే తాను వేప పుల్లలు అమ్మడానికి గల కారణాన్ని ఆ యువకుడు తెలిపాడు. ఈ ఐడియా తనకు తన ప్రేయసి ఇచ్చిందని అన్నాడు. కుంభమేళా జరిగినన్ని రోజులూ ఇవే అమ్ముతానని అతడు చెప్పాడు. అందుకు సంబంధించిన వీడియో వైరల్ అయింది.
నాణేలు బయటకు తీసి
కుంభమేళాకు వచ్చిన భక్తులు పుణ్యస్నానం చేసే సమయంలో నదిలో చిల్లర డబ్బులు విసురుతారు. దీంతో వాటిని సేకరించే పనిగా కొందరు పెట్టుకున్నారు. ఎలాంటి ఖర్చు లేకుండా అయస్కాంతంతో నాణేలను బయటకు తీస్తూ రోజుకు వేలల్లో సంపాదిస్తున్నారు. దీని ద్వారా రోజుకు రూ.4వేలు సంపాదిస్తున్నట్లు కొందరు తెలిపారు.
Also Read: విజయసాయికి కేతిరెడ్డి కౌంటర్.. ఆ విషయం అందరికీ తెలుసంటూ సంచలన ట్వీట్!
టీ అమ్ముతూ
ఇక కుంభమేళాలో మరో వ్యక్తి టీ అమ్ముతూ రోజుకు రూ.15 వేలు సంపాదిస్తున్నాడు. ఈ విషయం తెలిసి అంతా షాక్ అవుతున్నారు. ఏంటి బ్రో నిజమా అంటూ కామెంట్లు పెడుతున్నారు. అక్కడ ఒక టీ స్టాల్ ఏర్పాటు చేశాడు. టీతో పాటు భేల్ పూరి అమ్ముతున్నాడు. ఈ రెండింటి ద్వారా రోజుకు దాదాపు రూ.15వేలు సంపాదిస్తున్నట్లు ఆ యువకుడు తెలిపాడు.
కెటిల్‌తో టీ
మరో వ్యక్తి కెటిల్‌తో కుంభమేళా మొత్తం తిరుగుతూ టీ అమ్ముతున్నాడు. అలా టీ విక్రయిస్తూ రోజుకు రూ.8 వేల నుంచి రూ.10 వేలు సంపాదిస్తున్నట్లు అతడు తెలిపాడు.
బొట్టు పెడుతూ
మహా కుంభమేళాలో మరో వ్యక్తి వినూత్న ప్రయత్నం చేసి సక్సెస్ అయ్యాడు. అక్కడకు వచ్చిన భక్తులకు తిలకం (బొట్టు) దిద్దుతూ బాగా సంపాదించాడు. ఇలా చేయడం ద్వారా అతడు రోజుకు రూ.10 వేల నుంచి రూ.20 వేల వరకు సంపాదిస్తున్నాడు. ఒక్కో వ్యక్తికి బొట్టు పెట్టడం ద్వారా రూ.10 తీసుకుంటున్నాడు. ఇలా రోజుకు వేలమందికి తిలకం దిద్దుతానని అతడు తెలిపాడు. ఇది పూర్తయ్యేవరకు సుమారు రూ.8 లక్షలు సంపాదిస్తానని అతడు అన్నాడు.