ఆ ఊళ్లో కరెంట్ లేదు, సిగ్నల్ రాదు, యువకులకు పెళ్లి కాట్లే.. ఎందుకంటే?

ఓ గ్రామంలో కరెంట్, ఇంటర్‌నెట్ లేవు. రాజస్థాన్ కోటా జిల్లా కొలిపురాలో విద్యుత్ సౌకర్యం ఉండదు. సిగ్నల్స్ రావు. దీంతో ఆ ఊరిలో యువకులకు పెళ్లి కూడా కాట్లే. కొలిపురా గ్రామం ముకుంద్రా టైగర్ రిజర్వ్ పరిధిలో ఉంది. ఫారెస్ట్ అధికారులు అభివృద్ధి అడ్డుకుంటున్నారు.

New Update
kolipura

kolipura Photograph: (kolipura)

ప్రపంచమంతా 5జీ టెక్నాలజీలో పోటీ పడుతుంటే ఆ ఊళ్లో మాత్రం సెల్‌ఫోన్ సిగ్నల్లే రావట్లే. దేశానికి స్వాతంత్యం వచ్చి 75 ఏళ్లు గడుస్తున్నా ఆ గ్రామంలో కరెంటు సదుపాయం లేదు. మరొక వింత ఏంటంటే..ఆ గ్రామంలోని అబ్బాయిలు పెళ్లే చేసుకోరు. కరెంటు, ఫోన్, భార్యా పిల్లలు ఇవేవి లేకుండా ఎందుకు గడుపుతున్నారో తెలిస్తే షాక్ అవుతారు. ఫ్యాన్, టీవీ, ఏసీ, ఫ్రిడ్జ్ ఇలాంటి వస్తువులు మన జీవతంలో లేకుంటే.. ఏం చేసేవాళ్లం. అన్నింటికంటే ఎక్కువ మొబైల్ ఫోన్. కరెంట్, ఇంటర్‌నెట్ ఉంటే ప్రపంచంలో ఎక్కడ ఉన్నా ప్రపంచమే మీ చేతిలో ఉన్నట్లే. అలాంటిది ఆ గ్రామంలో రెండు సదుపాయాలు లేవు.

Also Read: తల్లికి అక్రమ సంబంధం.. తండ్రి ఎవరో తెలుసుకోవడానికి కోర్టుకెక్కిన కొడుకు

ఈ ఊరు ఇండియాలోనే ఉన్నా.. ఆ గ్రామ ప్రజలు మాత్రం ప్రపంచానికి దూరంగా ఉన్నారు. రాజస్థాన్ లాంటి ఎడారి రాష్ట్రంలో కరెంట్, ఇంటర్‌నెట్ లేకుండానే గడిపేస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. దీంతో ఆగ్రామంలో యువకులకు పెళ్లిలు కూడా కావడం లేదు. ఏ సదుపాయాలు లేని గ్రామానికి ఆడపిల్లని ఎలా ఇస్తామని అమ్మాయిల తల్లిదండ్రులు వెనుకడుగు వేస్తున్నారు. ఆ గ్రామానికి కరెంట్, మొబైల్ సిగ్నల్ ఎందుకు రావట్లేదంటే..

Also Read:Delhi Burari: ఢిల్లీలో కుప్పకూలిన నాలుగంతస్తుల భవనం.. శిథిలాల కింద చిక్కుకుని!

రాజస్థాన్‌లోని కోటా ప్రాంతానికి చెందని కొలిపురా గ్రామం ముకుంద్రా టైగర్ రిజర్వ్ పరిధిలో ఉంది. దీంతో అటవీ శాఖ కూడా ఈ ప్రాంతంలో ఎలాంటి అభివృద్ధి పనులకు అనుమతించడం లేదు. ఈ కారణంగా గ్రామస్థులు తమ ఇష్టానుసారంగా మౌలిక వసతులను అభివృద్ధి చేసుకోలేకపోతున్నారు. స్వాతంత్ర్యం వచ్చి ఇన్ని సంవత్సరాలు గడిచినా ఈ గ్రామానికి కరెంటు రాలేదు, మొబైల్ నెట్‌వర్క్ కూడా లేదు. పులుల పునరావాసం కోసం గ్రామం ఉద్దేశించడం వల్ల ఇక్కడి ప్రజలు ఇళ్లను నిర్మించలేరు. ముకుంద్రా టైగర్ రిజర్వ్‌లో ఉన్న కొలిపురా గ్రామంలో 500 కుటుంబాలకు పైనే నివసిస్తున్నారు.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Muda case: ముడా స్కామ్ కేసులో సిద్దరామయ్యకు కోర్టు షాక్..!

ముడా కేసులో కర్ణాటక సీఎం సిద్దరామయ్యకు ఎదురుదెబ్బ తగిలింది. విచారణను కొనసాగించేందుకు లోకాయుక్త పోలీసులకు ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టు అనుమతించింది. లోకాయుక్త పోలీసులు దాఖలు చేసిన బిరిపోర్ట్ విభేదిస్తూ ఈడీ దాఖలు చేసిన పిటిషన్‌పై తీర్పును వాయిదా వేసింది.

New Update
MUDA Scam: కర్ణాటకలో ముడా స్కామ్ కలకలం.. సిద్ధరామయ్య భార్యపై కేసు

కర్ణాటక సీఎం సిద్ధరామయ్యను ముడా స్కామ్ కేసు వేంటాడుతోంది. మైసూరు అర్బన్ డవలప్‌మెంట్ అథారిటీ కేసులో ఆయనకు మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. ముడా కేసులో విచారణను కొనసాగించేందుకు లోకాయుక్త పోలీసులకు బెంగళూరు ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టు మంగళవారం అనుమతించింది. కర్ణాటక లోకాయుక్త పోలీసులు దాఖలు చేసిన బి రిపోర్ట్ తో విభేదిస్తూ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దాఖలు చేసిన పిటిషన్‌పై తీర్పును ప్రత్యేక కోర్టు వాయిదా వేసింది.

Also read: ఖమ్మం వరదల్లో చనిపోయిన అగ్రికల్చర్ సైంటిస్ట్‌కు అరుదైన గౌరవం

ముడా భూముల కేటాయింపులో సిద్ధరామయ్య అవినీతికి పాల్పడలేదని లోకాయుక్త పోలీసులు ఇటీవల క్లీన్‌చిట్ ఇచ్చారు. అయితే దీనిని ఈడీ, హక్కుల కార్యకర్త స్నేహమయి కృష్ణ సవాలు చేశారు. ఈ కేసులో కొన్ని కీలక కోణాల్లో విచారణ జరగలేదని ఈడీ, స్నేహమయి కృష్ణ వాదించారు. మరింత లోతుగా దర్యాప్తు జరపాలని డిమాండ్ చేశారు. దీనిపై న్యాయమూర్తి సంతోష్ గజానన్ భట్‌ విచారణ చేపట్టారు. లోకాయుక్త పోలీసులు పూర్తి దర్యాప్తు నివేదిక సమర్పించిన తర్వాతే బి రిపోర్ట్ పై నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేస్తూ, తదుపరి విచారణను మే 7న తేదీకి వాయిదా వేశారు. దీనికి ముందు, సిద్ధరామయ్య, మరో ముగ్గురిపై వచ్చిన ఆరోపణలకు సంబంధించి మైసూరు డివిజన్ లోకాయుక్త పోలీసులు ప్రాథమిక నివేదకను సమర్పించారు. అయితే విచారణ కేవలం నలుగురు వ్యక్తులకే పరిమితం కాదని, ఇందులో ప్రమేయమున్న అందరికీ దర్యాప్తు జరపాలని, సమగ్ర నివేదిక సమర్పించాలని కోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది.

Also read: Mirabhai Chanu: ఒలంపిక్స్ విజేత మీరాభాయ్ చానుకు కీలక పదవి

Advertisment
Advertisment
Advertisment