కాళేశ్వరంపై రాజ్యసభలో రగడ.. కిషన్ రెడ్డి VS ఎంపీ సురేశ్‌ రెడ్డి

కాళేశ్వరం అంశంపై బుధవారం రాజ్యసభలో చర్చ జరిగింది. ఈ సందర్భంగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, బీఆర్‌ఎస్ ఎంపీ సురేశ్ రెడ్డి మధ్య వాగ్వాదం జరిగింది.

New Update
ishan Reddy Slams KCR on Kaleshwaram Project Misuse

kishan Reddy Slams KCR on Kaleshwaram Project Misuse

కాళేశ్వరం అంశంపై బుధవారం రాజ్యసభలో చర్చ జరిగింది. ఈ సందర్భంగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, బీఆర్‌ఎస్ ఎంపీ సురేశ్ రెడ్డి మధ్య వాగ్వాదం జరిగింది. కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్‌ పాటిల్ చేసిన వ్యాఖ్యలపై సురేశ్‌రెడ్డి తీవ్రంగా ఖండించారు. ఆయన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలంటూ హెచ్చరించారు. ఈ క్రమంలోనే సురేశ్‌రెడ్డి వ్యాఖ్యలపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం వల్లే మేడిగడ్డ పనికిరాకుండా పోయిందని విమర్శించారు. ఈ విషయాన్ని నిపుణుల కమిటీ చెప్పినట్లు పేర్కొన్నారు. 

Also Read: ఢిల్లీలో లక్షకు పైగా సీసీ కెమెరాలు తొలగింపు.. ఎందుకో తెలుసా ?

కేసీఆర్‌ కుటుంబం కాళేశ్వరం ప్రాజెక్టును ATMల వాడుకుందని విమర్శించారు. ఇంజినీర్లను కూడా సంప్రదించకుండానే ఈ ప్రాజెక్టును ప్రారంభించారని సెటైర్లు వేశారు. రూ.లక్ష కోట్ల ప్రజాధనాన్ని కేసీఆర్‌ దుర్వినియోగం చేశారంటూ మండిపడ్డారు. సీఎం రేవంత్.. కేసీఆర్‌ను జైల్లో పెడతానని చెప్పి ఇప్పటిదాకా ఏం చేయలేదని నిలదీశారు. గతంలో 7 మండలాల విలీనానికి కేసీఆర్‌ ఒప్పుకున్నారని.. విలీనం తర్వాత కూడా సోనియాగాంధీ నివాసానికి ఆయన వెళ్లినట్లు వ్యాఖ్యానించారు. 

Also read: తెలంగాణ విద్యార్థులకు అదిరిపోయే న్యూస్‌..సమ్మర్ హాలిడేస్ ఎన్ని రోజులంటే?

మరోవైపు సురేశ్ రెడ్డి మాట్లాడుతూ కేసీఆర్‌ పోరాటం వల్లే తెలంగాణ రాష్ట్రం వచ్చిందన్నారు. ప్రాంతాలుగా వేరైనా అన్నదమ్ముల్లా కలిసి ఉందామని అప్పట్లో కేసీఆర్‌ అన్నట్లు పేర్కొన్నారు. తెలంగాణ నుంచి పర్మిషన్ లేకుండానే పలు మండలాలను ఏపీలో కలిపారని తెలిపారు. 7 మండలాలను ఏపీలో విలీనం చేసేటప్పుడు దీనిపై చర్చించలేదని.. తల్లిని చంపి బిడ్డను బతికించారంటూ మోదీ అనేకసార్లు అన్నారంటూ విమర్శించారు. 12 ఏళ్లుగా కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు ఎలాంటి సాయం చేయలేదని మండిపడ్డారు. కేంద్రం నుంచి ఎలాంటి సహకారం అందకపోయినా తెలంగాణ అభివృద్ధి చెందుతోందని అన్నారు. విభజన చట్టం ప్రకారం తెలంగాణకు ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలంటూ డిమాండ్ చేశారు.  

Advertisment
తాజా కథనాలు