/rtv/media/media_files/2024/12/02/JwQIwbYLavMcIU3Egati.jpg)
Kerala: కేరళ రాష్ట్ర ప్రభుత్వం మొదటిసారి ఓ పులిని మ్యాన్ ఈటర్‌గా ప్రకటించి సంచలనం సృష్టించింది. అది కనపడితే కాల్చేయమని ఆదేశాలు జారీ చేసింది. అసలేం జరిగిందంటే? ఇటీవల వయనాడ్ జిల్లాలో ఓ పులి మహిళపై దాడి చేసి అత్యంత దారుణంగా చంపేసింది. ఈ ఘటన కేరళలో సంచలనం రేపింది. దీనిపై స్థానికంగానూ పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమవుతున్నాయి.
Also Read: 'నా ఉద్యోగం పోయింది, పెళ్లి క్యాన్సిల్ అయ్యింది'.. సైఫ్ కేసులో అరెస్టయిన బాధితుడి ఆవేదన
దీనితో కేరళ ప్రభుత్వం ఈ సంచలన నిర్ణయం తీసుకుంది. మహిళపై దాడి చేసిన పులిని మ్యాన్ ఈటర్‌గా ప్రకటించిన ప్రభుత్వం, అది కంటపడితే వెంటనే చంపేయాలని ఆదేశాలు జారీ చేసింది. జిల్లా ఉన్నతాధికారులతో చర్చించిన అనంతరం రాష్ట్ర మంత్రి శశీంద్రన్ ఈ ప్రకటన చేశారు.వయనాడ్‌లోని మనంతవాడి సమీపంలోని కాఫీ తోటలో పనిచేస్తున్న రాధ (45) అనే మహిళలపై ఇటీవల ఓ పెద్దపులి దాడి చేసి చంపేసింది.ఆ తరువాత ఆమె మృతదేహంలో కొంత భాగాన్ని తినేసినట్లు సమాచారం.
Also Read: Delhi Elections: మా స్కీమ్స్‌తో ప్రతి ఇంటికి నెలకు రూ.25 వేల ప్రయోజనం: కేజ్రీవాల్
అంతేకాదు ఆ పులి జయసూర్య అనే అటవీ శాఖ అధికారి పైనా దాడి చేసింది. ఇలా వరుస దాడులకు పాల్పడుతుండటం వల్ల ప్రజల్లో భయాందోళనలు పెరిగాయి. దీంతో వారు ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం ఉన్నతస్థాయి సమావేశం ఏర్పాటు చేసింది.
ఇదే మొదటి సారి...
ముఖ్యమంత్రి సూచన మేరకు అడ్వకేట్ జనరల్, ఇతర న్యాయ నిపుణుల సలహా అనంతరం ఆ పెద్దపులిని చంపేయాలని నిర్ణయానికి వచ్చినట్లు మంత్రి శశీంద్రన్ వెల్లడించారు. అయితే, ఓ పులిని మ్యాన్‌ఈటర్‌గా ప్రకటించడం కేరళ రాష్ట్రంలో ఇదే మొదటి సారిని ఆయన పేర్కొన్నారు.
Also Read: Trump: ఆ 90 వేల మంది ఉద్యోగుల్ని సరిహద్దుకు పంపిస్తా.. ట్రంప్ మరో బాంబ్
Also Read: Corpse flower: 150 కేజీల పువ్వు.. దీని దుర్వాసన అస్సలు భరించలేం: వీడియోలు చూశారా!