Kerala CS: నల్లగా ఉంటే అవమానమా.. వర్ణ వివక్షపై శారదా సంచలన కామెంట్స్!
నల్లటి ఛాయ కలిగిన మనుషులు ఎదుర్కొంటున్న వివక్షపై కేరళ సీఎస్ శారదా మురళీధరన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 'నేను బాధితురాలినే. నిజానికి నలుపు లేనిదెక్కడ. విశ్వమంతా వ్యాపించి ఉన్న సత్యం. అవమానం అవసరం లేదు. వర్ణ వివక్ష చర్చించాల్సిన అంశమే' అన్నారు.
Kerala CS: కేరళ చీఫ్ సెక్రటరీ శారదా మురళీధరన్ నలుపు రంగు కలిగిన చర్మాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 1990 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారిణి శారదా.. ఇటీవలే కేరళ చీఫ్ సెక్రటరీగా నియమితులైన విషయం తెలిసిందే. తన భర్త తర్వాత ఆ స్థానంలో ఆమె చేరగా ఈ దంపతుల చర్మ రంగులపై సోషల్ మీడియాలో భిన్నమైన కామెంట్స్ వెలువడ్డాయి. దీంతో నెటిజన్ల అభిప్రాయాలపై స్పందించిన శారదా.. తాను నలుపు రంగు కలిగివున్న విషయాన్ని అంగీకరిస్తానని చెప్పారు.
సిగ్గుపడాల్సిన విషయం కాదు..
ఈ మేరకు 'నేను మొదట్లో నా కలర్ గురించి కామెంట్స్ చూసి కాస్త కంగారుపడ్డాను. కానీ ఈ అంశం చర్చించాల్సిందేనని పోస్ట్ పెట్టాను. నిజానికి ఇదేదో సిగ్గుపడాల్సిన విషయం కాదు. కొందరు ఈ రంగు మంచిది కాదన్నట్టు మాట్లాడుతున్నారు. నిజానికి నలుపును ఎందుకు అవమానించాలి. ఇది విశ్వమంతా వ్యాపించి ఉన్న సత్యం. వర్షానికి ముందు కనిపించే వాగ్దానం. సాయంత్రానికి సూచిక.. అసలు నలుపు లేనిదెక్కడ. అయినా ఆ రంగు ప్రభావం నాపై 50 ఏళ్లపాటు కొనసాగింది' అని చెప్పారు.
ఇక తన చిన్నప్పుడు కూడా రంగుపై వివక్ష ఎదుర్కొన్నానని, 4 ఏళ్ల వయసులో తనను గర్భంలోకి తీసుకెళ్లి తెల్లగా, అందంగా మళ్లీ తీసుకురాగలవా అని తన తల్లిని అడిగినట్లు గుర్తు చేసుకున్నారు. నలుపుకు విలువ లేదనే భావనలోనే తాను తెలుపు రంగుపట్ల ఆకర్షితురాలైనట్లు చెప్పారు. కానీ తన పిల్లలు నలుపు వర్ణం అద్భుతమని, అందమైనదని తాను గుర్తించేలా చేశారంటూ సంతోషంగా చెప్పాకొచ్చారు. శారదా మాటలపై స్పందించిన కేరళ ప్రతిపక్ష నేత వీడీ సతీశన్.. ‘ఆమె చెప్పిన ప్రతిమాట నా హృదయాన్ని తాకింది. నా తల్లి కూడా నల్లటి ఛాయను కలిగి ఉండేది. నిజంగా ఇది చర్చించాల్సిన అంశమే' అన్నారు.

Kerala CS Saradha Muralitharan interesting comments on black color discrimination

Also Read: Court Movie Collections: ‘కోర్టు’ కిక్కే కిక్కు.. రూ.10 కోట్ల బడ్జెట్- రూ.50 కోట్ల కలెక్షన్- USలో రచ్చ రచ్చే
తల్లిని అడిగాను..
ఇక తన చిన్నప్పుడు కూడా రంగుపై వివక్ష ఎదుర్కొన్నానని, 4 ఏళ్ల వయసులో తనను గర్భంలోకి తీసుకెళ్లి తెల్లగా, అందంగా మళ్లీ తీసుకురాగలవా అని తన తల్లిని అడిగినట్లు గుర్తు చేసుకున్నారు. నలుపుకు విలువ లేదనే భావనలోనే తాను తెలుపు రంగుపట్ల ఆకర్షితురాలైనట్లు చెప్పారు. కానీ తన పిల్లలు నలుపు వర్ణం అద్భుతమని, అందమైనదని తాను గుర్తించేలా చేశారంటూ సంతోషంగా చెప్పాకొచ్చారు. శారదా మాటలపై స్పందించిన కేరళ ప్రతిపక్ష నేత వీడీ సతీశన్.. ‘ఆమె చెప్పిన ప్రతిమాట నా హృదయాన్ని తాకింది. నా తల్లి కూడా నల్లటి ఛాయను కలిగి ఉండేది. నిజంగా ఇది చర్చించాల్సిన అంశమే' అన్నారు.
Also Read: Mangalavaaram: ఇది అస్సలు ఊహించలేదు.. 'మంగళవారం' సీక్వెల్ లో హీరోయిన్ గా ఎవరంటే!
black | telugu-news | today telugu news
TGPSC: గ్రూప్-1 జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ రిలీజ్.. లింక్ ఇదే!
Khammam accident ఉగాది రోజే విషాదం.. ఆర్టీసీ బస్సుకు ఘోర రోడ్డు ప్రమాదం
ఆరు రుచులతో అరవై రోగాలు నయం.. ఉగాది పచ్చడితో ఇన్ని లాభాలా?
Telangana: ఉగాది వేళ విద్యార్ధులకు రేవంత్ సర్కార్ శుభవార్త!
Devara Japan Collections: జపాన్‌లో దేవర 'ఫెయిల్'..!! అందరి ముందు పరువు పోయిందిగా..