/rtv/media/media_files/2026/04/02/kerala-assembly-polls-2026-04-02-17-39-04.jpg)
Kerala Assembly polls, LDF’s manifesto released
కేరళ లో అసెంబ్లీ ఎన్నికలు(Kerala Assembly Elections 2026) సమీపిస్తున్నాయి. అధికార, విపక్ష పార్టీలు హోరాహోరీగా ప్రచారాలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా అధికార లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ (LDF) పార్టీ గురువారం తమ మేనిఫెస్టోను ప్రకటించింది. సీఎం పినరయి విజయన్ దీన్ని రిలీజ్ చేశారు. సంక్షేమం, అభివృద్ధి, మహిళా సాధికారత లక్ష్యంగా ఈ మెనిఫెస్టోను రూపొందించారు. కేరళలో 140 స్థానాలకు ఏప్రిల్ 9న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే.
Also Read : ప్రొఫెసర్‌తో అక్రమ సంబంధం ఆరోపణలు.. విద్యార్థిని సూసైడ్
మేనిఫెస్టోలోని కీలక హామీలు
1.50 శాతం ఉద్యోగాలు మహిళలకు కేటాయింపు
2.నెలవారీ పింఛన్ రూ.3 వేలకు పెంపు
3. ఐదు లక్షల పేద కుటుంబాలను ఆదుకోవడం
4.వృద్ధులకు, మంచానపడిన రోగులకు మెరుగైన సంరక్షణ
5.చదువు పూర్తి చేసుకున్న స్టూడెంట్స్‌కు క్యాంపస్ ప్లేస్‌మెంట్లు ఇప్పించడం
6. ‘బ్యాక్ టూ క్యాంపస్’ పేరుతో ఉద్యోగం లేని వారికి నైపుణ్యాలు అందించడం
7.మహిళలు ఉద్యోగాలు చేసేందుకు సురక్షిత ప్రయాణం, శిశు సంరక్షణ, నైపుణ్యాల్లో ట్రైనింగ్ ఇప్పించడం
8.విద్యావంతులు చేపట్టే వ్యాపారాలకు వడ్డీ లేని రుణాలు అందించడం
ఇదిలాఉండగా విపక్ష పార్టీ యూడీఎఫ్ కూడా తమ ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసింది.
1.మహిళలకు ఫ్రీ బస్సు
2.సంక్షేమ పింఛను రూ.3,000కు పెంపు
3.కళాశాల విద్యార్థినులకు రూ.1,000
4.ప్రతి కుటుంబానికి రూ.25 లక్షల బీమా సదుపాయం
Also Read : కేజ్రీవాల్‌కు షాక్.. ఎక్సైజ్ పాలసీపై ఢిల్లీ హైకోర్టు నోటీసులు
Follow Us