/rtv/media/media_files/2025/03/20/ksmNVIk503ejREeGJAsA.jpg)
Karnataka Assembly
కర్ణాటకలో అసెంబ్లీలో హనీ ట్రాప్ వ్యవహారం తీవ్ర సంచలనం రేపింది. కర్ణాటక సహకార మంత్రి కేఎన్ రాజన్న చేసిన వ్యాఖ్యలతో దీని గురించి బట్టబయలు అయింది. కర్ణాటక లో రాజకీయ నేతలు, మంత్రులే టార్గెట్ గా హనీ ట్రాప్ నడుస్తోందని.. ఇందులో జాతీయ స్థాయి నేతల సహా 48 మంది చిక్కుకున్నారని ఓ మంత్రి చెప్పడం తీవ్ర దుమారానికి దారి తీసింది. దీనిపై వెంటనే విచారణ జరపాలని అధికార, ప్రతిపక్ష నేతలు డిమాండ్ చేస్తున్నారు. దీనికి ప్రభుత్వం కూడా సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించింది. ఇందులో 48 మంది రాజకీయ నేతలు ఉన్నారని..సీడీలు, పెన్ డ్రైవ్ లలో వారి అసభ్య వీడియోలు ఉన్నాయన్నారు. దీంట్లో అన్ని పార్టీ వారు ఉన్నారని చెప్పారు. దీనిపై ఉన్నత స్థాయి దర్యాప్తు అవసరమని రాజన్న చెప్పారు. అందుకే హోంశాఖకు ఫిర్యాదు చేయాలనుకుంటున్నానని...అప్పుడు ఈ హనీ ట్రాప్ వ్యవహారం వెనుక ఎవరున్నారేది బయటపడుతుందని చెప్పారు.
రాజకీయ ప్రయోజనాల కోసమే..
ఈ హనీ ట్రాప్ వ్యవహారం నిజమేనని కర్ణాటక మరో మంత్రి జార్కి హోళీ కూడా అన్నారు. ఒక మంత్రిపై ఇలా రెండుసార్లు జరిగిందని..కర్ణాటకలో ఇది ఎప్పటి నుంచో జరుగుతోందని చెప్పారు. కొంతమంది దీనిని రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారని అన్నారు. ఈ వ్యవహారంపై డిప్యూటీ సీఎం డీ.కె.శివకుమార్ స్పందించారు. హనీ ట్రాప్ వ్యవహారంపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పారు. ఇప్పటి వరకు ఎవరినైనా అరెస్ట్ చేశారో లేదో తనకు తెలియదని..ప్రభుత్వం దర్యాప్తుకు ఇంతకు ముందే ఆదేశించిందని తెలిపారు. దర్యాప్తు పూర్తయితే అన్ని విషయాలు బయకు వస్తాయని చెప్పారు.
Also Read: TS: రేపటి నుంచి టెన్త్ ఎగ్జామ్స్...ఏర్పాట్లు పూర్తి