Karnataka : ఘోర విషాదం..  ఒకే కుటుంబానికి చెందిన నలుగురు సూసైడ్!

బీహార్‌లోని నలంద జిల్లాలో ఘోర విషాదం చోటుచేసుకుంది. కర్ణాటకకు చెందిన ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు ఒక ధర్మశాలలో ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్నారు.

New Update
crime

బీహార్‌లోని నలంద జిల్లాలో ఘోర విషాదం చోటుచేసుకుంది. కర్ణాటకకు చెందిన ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు ఒక ధర్మశాలలో ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్నారు. మృతుల్లో ముగ్గురు మహిళలు, ఒక పురుషుడు ఉన్నారు. పర్యాటక ప్రాంతమైన రాజ్‌గిర్‌లోని ఒక గదిలో ఈ ఘటన జరిగింది.

మృతులను కర్ణాటకలోని తుమకూరు జిల్లా గుబ్బి గ్రామానికి చెందిన జి.ఆర్. సుమంగళ (78), ఆమె కుమార్తెలు శిల్ప (48), శ్రుత (43), కుమారుడు నాగ ప్రసాద్ (50)గా పోలీసులు గుర్తించారు. వీరంతా గత మూడు రోజులుగా గదిలోనే ఉంటున్నారు. అయితే, ఆ గది నుండి విపరీతమైన దుర్వాసన రావడంతో అనుమానం వచ్చిన ధర్మశాల మేనేజర్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వచ్చి తలుపులు పగులగొట్టి చూడగా, నలుగురూ ఫ్యాన్లకు వేలాడుతూ కనిపించారు.

పాన్ కార్డులు, మొబైల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం

ఘటనా స్థలంలో పోలీసులు తనిఖీ చేయగా విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. వారి బ్యాగుల్లో దాదాపు 25 నిద్రమాత్రల స్ట్రిప్పులు ఖాళీగా పడి ఉన్నాయి. బహుశా వారు ముందుగా నిద్రమాత్రలు మింగి, ఆ తర్వాత ఉరివేసుకుని ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. అలాగే వారి వద్ద నుంచి రూ. 1,18,000 నగదు, ఆధార్ కార్డులు, పాన్ కార్డులు, మొబైల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారనే

ఈ ఘటనపై నలంద ఎస్పీ ప్రత్యేక విచారణ బృందాన్ని (SIT) ఏర్పాటు చేశారు. మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించేందుకు మెడికల్ బోర్డును ఏర్పాటు చేసి, పూర్తి ప్రక్రియను వీడియో తీయిస్తున్నారు. కర్ణాటక పోలీసుల సహాయంతో మృతుల కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. వారు అంత దూరం వచ్చి ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. విచారణ కోసం ఒక బృందాన్ని కర్ణాటకకు కూడా పంపారు.

Advertisment
తాజా కథనాలు