/rtv/media/media_files/2025/03/15/gRpkkl7IUO0ZHxRhlb6j.jpg)
Karnataka Congress government approves 4% reservation for Muslims in government contracts
ముస్లిం రిజర్వేషన్లకు సంబంధించి కర్ణాటక సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ముస్లింలకు ప్రభుత్వ కాంట్రాక్టుల్లో 4 శాతం రిజర్వేషన్లు కేటాయిస్తూ చట్ట సవరణ చేసింది. అయితే సీఎం సిద్ధరామయ్య ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై బీజేపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తీసుకున్న ఏకపక్ష నిర్ణయాన్ని ఖండిస్తున్నామని తెలిపారు. త్వరలోనే దీనిపై కోర్టుకు కూడా వెళ్తామని స్పష్టం చేశారు. ఇది రాజ్యాంగంపై దాడి అంటూ విమర్శించారు.
Also Read: మహిళా ఎస్ఐపై కానిస్టేబుల్ అత్యాచారం.. బ్లాక్‌మెయిల్ చేస్తూ.. చివరికి!
అయితే ప్రభుత్వ నిర్ణయంతో కేటీపీపీ చట్టం ప్రకారం కేబగిరీ 2బీ కింద ఉన్న ముస్లిం కాంట్రాక్టర్లు దాదాపు రెండు కోట్ల వరకు ప్రభుత్వ పనులు చేసేందుకు అర్హులు కానున్నారు. ప్రస్తుత అసెంబ్లీ సమావేశంలో సవరణ బిల్లును ప్రవేశపెట్టాక.. ముస్లిం కాంట్రాక్టర్ల కోటాను అమలు చేస్తామని సీఎం సిద్ధరామయ్య అన్నారు. ఈ క్రమంలోనే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై బీజేపీ మండిపడుతోంది. దీనిపై కోర్టులో పిటిషన్ వేస్తామని చెప్పింది.
Also Read: హిందీ భాష రుద్దడంపై పవన్ వ్యాఖ్యలు దుమారం.. స్పందించిన డీఎంకే
ఇదిలాఉండగా కర్ణాటక ప్రభుత్వాన్ని కేంద్రం అభినందించింది. ఇ-పాలనలో 2024 ఏడాదికి కేంద్ర ప్రభుత్వం నుంచి కర్ణాటకకు బంగారు పథకం వచ్చింది. దీనిపై సిద్ధరామయ్య కూడా స్పందించారు. ఇ-పాలనలో ప్రతీసారి కర్ణాటక సర్కార్ మంచి పనితీరు చూపిస్తోందని అన్నారు. బంగారు పతకాన్ని దక్కించుకునేలా మెరుగైన మెరుగైన పనితీరును చూపిస్తున్న అధికారులు, సిబ్బందిని ఆయన ప్రశంసించారు.
Also Read: హోలీ రోజు ఆకతాయిలు చేసిన పనికి.. 8 మంది అమ్మాయిలు హాస్పిటల్ పాలైయ్యారు
Also Read: డీలిమిటేషన్ వల్ల సీట్లు తగ్గుతాయా ? కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు