![jeeth adani](https://img-cdn.thepublive.com/fit-in/1280x960/filters:format(webp)/rtv/media/media_files/2025/02/08/fcEIXWNrv6x0zcaN4hxr.jpg)
jeeth adani
ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ అదానీ చిన్న కుమారుడు జీత్ అదాని- ప్రముఖ వజ్రాల వ్యాపారి కుమార్తె దివా జైమిన్ షా ల పెళ్లి వేడుక చాలా ఘనంగా జరిగింది.గుజరాతీ సంప్రదాయంలో వీరి వివాహం జరిగింది. అహ్మదాబాద్‌లో కొంతమంది బంధుమిత్రుల సమక్షంలో మాత్రమే వీరి పెళ్లి జరిగింది. జీత్ అదానీ- దివా షాల పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ గా మారాయి.ఆత్మీయుల నడుమ సంప్రదాయ పద్ధతిలో పెళ్లి వేడుక జరిగినట్లు అదానీ వెల్లడించారు.
Also Read: Delhi Assembly Results: ఢిల్లీ పీఠం ఎక్కేదెవరు..నేడే అసెంబ్లీ ఫలితాలు!
![jeeth](https://img-cdn.thepublive.com/filters:format(webp)/rtv/media/media_files/2025/02/08/YlkbE3mDQ0wubjZ0aSjj.png)
జైన్, గుజరాతీ సంప్రదాయంలో..
అతి తక్కువ మంది సమక్షంలో జరిగిన ఈ వేడుకకు శ్రేయోభిలాషులను ఆహ్వానించలేకపోయానని, అందుకు తనను క్షమించాలన్నారు. నూతన వధూవరులను ఆశీర్వదించాలని గౌతమ్ అదానీ కోరారు. అహ్మదాబాద్‌లోని అదానీ టౌన్‌షిప్ వేదికగా శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు వివాహ కార్యక్రమాలు మొదలయ్యాయి. జైన్, గుజరాతీ సంప్రదాయంలో పెళ్లి వేడుకలు జరిపించారు. ఎలాన్ మస్క్, బిల్ గేట్స్, టేలర్ స్విఫ్ట్ వంటి ఇంటర్నేషనల్ సెలబ్రిటీలను అదానీ ఆహ్వానిస్తున్నారంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది.
Also Read: Horoscope Today:నేడు ఈ రాశి వారికి ఆదాయం పదింతలు అవుతుంది...మీ రాశేనేమో చూసుకోండి మరి!
परमपिता परमेश्वर के आशीर्वाद से जीत और दिवा आज विवाह के पवित्र बंधन में बंध गए।
— Gautam Adani (@gautam_adani) February 7, 2025
यह विवाह आज अहमदाबाद में प्रियजनों के बीच पारंपरिक रीति रिवाजों और शुभ मंगल भाव के साथ संपन्न हुआ।
यह एक छोटा और अत्यंत निजी समारोह था, इसलिए हम चाह कर भी सभी शुभचिंतकों को आमंत्रित नहीं कर सके,… pic.twitter.com/RKxpE5zUvs
అయితే, కుంభమేళాలో పాల్గొన్న సమయంలో ఆ ప్రచారాన్ని గౌతమ్ అదానీ తోసిపుచ్చారు. జీత్ అదానీ గౌతమ్ అదానీ చిన్న కొడుకు. అదానీ ఎయిర్‌పోర్ట్స్‌లో డైరెక్టర్‌గా ఉన్నాడు. 2019లో గ్రూప్ CFO కార్యాలయంలో తన కెరీర్‌ను ప్రారంభించాడు. అదానీ గ్రూప్‌లోని వ్యూహాత్మక ఫైనాన్స్, క్యాపిటల్ మార్కెట్, రిస్క్ మేనేజ్‌మెంట్, గవర్నెన్స్ విధానాలపై జీత్ దృష్టి సారించాడు.
యూనివర్శిటీ ఆఫ్ పెన్సిల్వేనియా స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ అప్లైడ్ సైన్సెస్‌లో గ్రాడ్యుయేట్ అయిన జీత్ శిక్షణ పొందిన పైలట్ కూడా. అతని తల్లి, ప్రీతి అదానీ ప్రేరణతో, అతను దాతృత్వ కార్యక్రమాలలో చురుకుగా పాల్గొన్నాడు. ఆమె వారసత్వాన్ని అనుసరించి అదానీ ఫౌండేషన్‌ను ఒక ప్రధాన సామాజిక ప్రభావ సంస్థగా మార్చారు.
ప్రముఖ వజ్రాల వ్యాపారి జైమిన్ షా కూతురే దివా జైమిన్ షా. ప్రముఖ వజ్రాల తయారీ సంస్థగా గుర్తింపు పొందిన ఈ కంపెనీ ముంబై, సూరత్‌లలో గణనీయమైన కార్యకలాపాలను కలిగి ఉంది. దివా షా హయ్యర్ ఎడ్యుకేషన్ పూర్తి చేసినా.. లో ప్రొఫైల్ మెయింటేన్ చేస్తుంటారు. సోషల్ మీడియాకు దూరంగా ఉంటారు. ఫైనాన్స్, వ్యాపార రంగాల్లో దివా టాలెంట్ అదానీ ఫ్యామిలీని ఆకర్షించడంతో కోడలిగా చేసుకున్నారు.
Also Read: Trump-America: అమెరికాలోని భారతీయులకు బిగ్ రిలీఫ్.. ఆ ఉత్తర్వులను కొట్టిపారేసిన కోర్టు
Also Read: AP: ముఖ్యమంత్రి చంద్రబాబు- నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ సుమన్ బేరీ మధ్య ఆసక్తికర చర్చ ..