/rtv/media/media_files/2026/05/04/vijay-and-jagan-2026-05-04-13-24-13.jpg)
Vijay and Jagan
తమిళనాడు ఎన్నికల్లో టీవీకే చీఫ్ విజయ్ విజిల్ మోగిస్తున్నారు. ఇప్పటికే 108 స్థానాల్లో టీవీకే పార్టీ లీడ్‌లో కొనసాగుతోంది. AIADMK కూటమి 64, DMK కూటమి 62 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నాయి. టీవీకే పార్టీకి ఎక్కువ సీట్లు రానుండటంతో ఎవరితో పొత్తు పెట్టుకున్నా విజయ్ సీఎం అయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి. అయితే విజయ్ గెలుపుపై ఏపీలోని వైసీపీ శ్రేణులు కూడా సంబరాలు చేసుకుంటున్నారు.
Also Read: విజయ్ ఇంటికి త్రిష..VIDEO VIRAL
తమిళనాడులో ఎన్నికల ప్రచారంలో విజయ్.. వైసీపీ చీఫ్ జగన్‌తో దిగిన ఫొటో పట్టుకొని చూపించిన సంగతి తెలిసిందే. ప్రచారంలో భాగంగా ఓ అభిమాని విజయ్‌కు ఈ ఫొటో అందించగా.. ఆయన జనాలకు ఆ ఫొటో పట్టుకుని చూపించారు. దీనికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అలాగే చెన్నైలో జరిగిన ఓ వివాహ వేడుకలో కూడా విజయ్, జగన్ కలుసుకున్నారు. అప్పట్లో ఈ ఫొటోలు కూడా వైరల్ అయ్యాయి. ప్రసుతం తమిళనాడు ఎన్నికల్లో విజయ్ దూసుకుపోతుండటంతో ఆయన గెలుపు వెనుక జగన్ ఉన్నారంటూ ప్రచారం చేస్తున్నారు. తమ నాయకుడి స్నేహితుడు గెలిచాడంటూ సంబరాలు చేసుకుంటున్నారు.
Also Read: కౌంటింగ్ కేంద్రాల నుంచి బయటకు వెళ్లకండి.. TMC శ్రేణులకు మమత సంచలన పిలుపు!
Follow Us