అంతరిక్షంలో మరో అద్భుతం సృష్టించిన ISRO.. ఇండియా ఘనత

ఉపగ్రహాలను డాకింగ్ చేసిన 4వ దేశంగా ఇండియా అవతరించింది. జనవరి 12న రెండు శాటిలైట్లను ఒకే కక్ష్యలో 3 మీటర్ల దూరానికి తీసుకొచ్చి డాకింగ్ ప్రక్రియ విజయవంతం చేసింది ఇస్రో సైంటిస్టుల బృందం. ఇప్పటివరకు అమెరికా, చైనా, రష్యాలు మాత్రమే డాకింగ్ నిర్వహించాయి.

author-image
By K Mohan
New Update
dacking

dacking Photograph: (dacking)

ఇండియన్ స్పేస్ రిసెర్చ్ ఆర్గనైజేషన్ అంతరిక్షంలో చేస్తున్న ప్రయోగాల్లో వరుస విజయాలతో దూసుకుపోతుంది. ఇప్పటివరకు ఈ ఘనత అమెరికా, చైనా, రష్యా దేశాలు మాత్రమే సాధించాయి. ప్రస్తుతం 4వ దేశంగా భారత్ అవతరించింది. అంతరిక్షంలో రెండు లేదా అంతకంటే ఉపగ్రహాలను లింక్ చేయడాన్ని డాకింగ్ అంటారు. శాటిలైట్స్ ఒకే కక్ష్యలోకి తీసుకొచ్చి అత్యంత దగ్గరగా ఉపగ్రహాలను తీసుకువస్తారు.

భారత అంతరిక్ష సంస్థ ISRO జనవరి 12 (ఆదివారం) డాకింగ్ ప్రక్రియను విజయవంతం చేసింది. ఛేజర్ మరియు టార్గెట్ అనే రెండు చిన్న ఉపగ్రహాలను 3 మీటర్ల దగ్గరకు తీసుకువచ్చారు ఇస్రో శాస్త్రవేత్తులు. తర్వాత మళ్లీ వాటి స్థానాల్లోకి పంపించారు. దీంతో శాటిలైట్లకు డాకింగ్ నిర్వహించిన నాల్గవ దేశంగా ఇండియా నిలిచింది. 

Also Read : ట్రంప్ ప్రమాణస్వీకారానికి భారత విదేశాంగ శాఖ మంత్రి

ఫస్ట్ ఈ ప్రయోగాన్ని జనవరి 7, 9లలో నిర్వహించాలని అనుకున్నారు. కానీ.. టెక్నికల్ కారణాలతో ఈ ప్రయోగం వాయిదా పడింది. చివరికి ఆదివారం విజయవంతంమైంది. శ్రీహరికోటలోని స్పేస్ సెంటర్ నుంచి డిసెంబర్ 30న 220 కిలోల రెండు చిన్న ఉపగ్రహాలను 450 కి.మీ కక్ష్యలోకి ప్రయోగించారు. తర్వాత వాటిని జనవరి 12న మూడు మీటర్ల దగ్గరకి తీసుకొచ్చారు.

ఇది కూడా చదవండి: తిరుమల టికెట్ల డబ్బులతో రోజాకు బెంజ్ కారు.. జేసీ సంచలన ఆరోపణలు!

భారీ అంతరిక్ష నౌకలు అవసరమయ్యే మిషన్లను నిర్వహించడానికి ఈ సామర్ధ్యం అవసరం. ఒక స్పేస్ స్టేషన్‌ను ఏర్పాటు చేయడానికి మాత్రమే కాకుండా దాని కోసం ప్రత్యేక మాడ్యూల్స్ అంతరిక్షంలో కలిపేందుకు కానీ సిబ్బంది, మెషనరీని తీసుకెళ్లడానికి కూడా డాకింగ్ సామర్థ్యం అవసరం. చంద్రయాన్ -4 కోసం కూడా డాకింగ్ ప్రక్రియ నిర్వహించడం తెలిసి ఉండాలి.

Advertisment
Advertisment
Advertisment