భారతీయ వ్యోమగాములను 2040 నాటికి చంద్రుడిపైకి పంపాలనే లక్ష్యంతో పరిశోధనలు చేసున్నట్లు ఇస్రో చీఫ్ సోమనాథ్ ఇటీవల తెలిపారు. భారత అంతరిక్ష రంగంలో ఎన్నో అద్భుతమైన విజయాలు సాధించిందని.. ఇంకా మున్ముందు ఎన్నో అద్భుతాలు సృష్టిస్తుందన్నారు. ఇది కూడా చూడండి: అశ్విన్ స్థానంలో మరో యంగ్ స్పిన్నర్‌కు చోటు.. అతడెవరంటే! రాబోయే 15 ఏళ్లలో చంద్రుడిపైకి.. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం ఇస్రోకు రికార్డు స్థాయిలో రూ.31,000 కోట్ల నిధులను మంజూరు చేసిందన్నారు. రాబోయే 15 సంవత్సరాలలో చంద్రుడిపై మానవుడు అడుగులు పడటానికి కేంద్ర ప్రభుత్వం సహకరిస్తోందన్నారు. మిషన్‌ల పరంగా ఈ ఏడాది అద్భుతమైన విజయాలు సాధించామని, చాలా ముఖ్యమైన సంవత్సరమని ఇస్రో చీఫ్ సోమనాథ్ తెలిపారు. ఇది కూడా చూడండి: Jani Master: అల్లు అర్జున్ అరెస్ట్ పై ప్రశ్న.. జానీ మాస్టర్ రియాక్షన్ వైరల్ భవిష్యత్తులో చేయాల్సిన ప్రయోగాలకు ముందుగానే 25 సంవత్సరాలకు సంబంధించిన రోడ్‌మ్యాప్ సిద్ధం చేసుకున్నామని సోమనాథ్ అన్నారు. ఈ రోడ్‌మ్యాప్‌లో భాగంగా భారతదేశం 2035 నాటికి తన సొంత అంతరిక్ష కేంద్రం, ఇండియన్ స్పేస్ స్టేషన్‌ను ఏర్పాటు చేయాలని భావిస్తోందనన్నారు. ఇది కూడా చూడండి: Allu arjun: అల్లు అర్జున్ విచారణ పూర్తి.. కీలక ప్రశ్నలకు సమాధానాలివే! ఇందులో భాగంగా 2028లో స్పేస్ స్టేషన్ మాడ్యూల్‌ను ప్రారంభించడం, 2035 నాటికి స్పేష్ స్టేషన్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. భారత్ 100వ స్వాత్రంత్య దినోత్సవం జరుపుకునే సమయానికి చంద్రునిపై భారత్ జెండా రెపరెపలాడుతుందని ఇస్రో చీఫ్ సోమనాథ్ పేర్కొన్నారు. మన వ్యోమగాములు చంద్రుడిపైకి వెళ్లి తిరిగి వస్తారన్నారు. అలాగే చంద్రయాన్-4, చంద్ర నమూనా రిటర్న్ మిషన్‌తో మరికొన్ని మిషన్లు నిర్వహిస్తామని తెలిపారు. ఇది కూడా చూడండి: AP: ఏపీలో దారుణం.. సిబ్బంది నిర్లక్ష్యానికి గర్భిణి మృతి..!