/rtv/media/media_files/2025/04/13/XRMaPECPluf9IBJa7pvu.jpg)
Laser Weapon
భారత దేశానికి చెందిన డీఆర్డీవో మరో కొత్త ప్రయోగం చేసింది. భారతదేశానికి కొత్త అస్త్రాన్ని అందించింది. అధిక శక్తి కలిగిన లేజర్ ఆధారిత ఆయుధాన్ని డీఆర్డీవో మొదటిసారి పరీక్షించింది. ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలులో నిర్వహించిన ట్రయల్స్‌లో భాగంగా గాల్లో ఎగురుతున్న యూఏవీ, డ్రోన్లను నేలకూల్చడంలో సఫలమైంది. దీనికి సంబంధించిన వీడియోను ‘ఎక్స్’లో పోస్ట్ చేసింది. ఒక వాహనంలో ఈ లేజర్ ఎనర్జీని వెపన్ ను అమర్చారు. దీనికి ఎంకే 2(ఏ) ల్యాండ్ వెర్షన్ అని పేరు పెట్టారు. ఇది యూఏవీ, డ్రోన్‌లను విజయవంతంగా అడ్డుకుంది. వాటిని కూల్చడంతో పాటు నిఘా సెన్సార్‌లను పనిచేయకుండా చేసింది. దీనిద్వారా.. లేజర్ డీఈడబ్ల్యూ వ్యవస్థను కలిగి ఉన్న దేశాల సరసన భారత్ చేరిందని డీఆర్డీవో తన ట్వీట్ లో రాసింది. అయితే ఇది కేవలం ప్రారంభమైనని..ఇలాంటివి మరిన్ని డీఆర్డీవో తయరాు చేసేందుకు సిద్ధంగా ఉందని డీఆర్డీవో ఛైర్మన్ సమీర్ వి.కామత్ చెప్పారు. ఇప్పటి వరకు అమెరికా, రష్యా, చైనాలు మాత్రమే ఇలాంటి ఆయుధాలను ప్రదర్శించాయి. ఇజ్రాయెల్ కూడా పని చేస్తోందని..మనది నాలుగో దేశమని ఆయన అన్నారు.
CHESS DRDO conducted a successful field demonstration of the Land version of Vehicle mounted Laser Directed Weapon(DEW) MK-II(A) at Kurnool today. It defeated the fixed wing UAV and Swarm Drones successfully causing structural damage and disable the surveillance sensors. With… pic.twitter.com/U1jaIurZco
— DRDO (@DRDO_India) April 13, 2025
today-latest-news-in-telugu | army
Also Read: సన్‌రైజర్స్ Vs కింగ్స్ మ్యాచ్.. ఈ అద్భుతాలు చూశారా..? అస్సలు ఊహించలేరు!