2025 బడ్జెట్‌లో పొరుగుదేశాలకు ఇండియా ఆర్థిక సాయం.. ఏ దేశానికి ఎంతంటే?

2025 బడ్జెట్ కేటాయింపులో విదేశాంగ మంత్రిత్వ శాఖకు రూ.20,516 కోట్లు కేటాయించారు. విదేశీ దేశాలకు ఆర్థిక సహాయంగా రూ.5,483 కోట్లు ప్రకటించారు. భూటాన్, మాల్దీవులు, ఆఫ్గనిస్తాన్, నేపాల్, బంగ్లాదేశ్, ఇరాన్, మయన్మార్‌, శ్రీలంక దేశాలకు ఇండియా సాయం చేస్తోంది.

New Update
india helping

india helping Photograph: (india helping )

కేంద్ర బడ్జెట్ 2025 కేటాయింపులో విదేశాంగ మంత్రిత్వ శాఖకు రూ.20,516 కోట్లు కేటాయించారు. ఇందులో విదేశీ దేశాలకు ఆర్థిక సహాయం కింద రూ.5,483 కోట్లు అందజేయనున్నారు. గతేడాది ఇందుకోసం రూ.5,806 కోట్లు కేటాయించారు. గత కొన్నేళ్లుగా దాయాది దేశాలకు ఇండియా ఆర్థిక సాయం చేస్తోంది. ఆయా దేశాల అభివృద్ధిలో భారత్ కీలక పాత్ర పోషిస్తోంది. ప్రతి ఆర్థిక సంవత్సరంలో వీటి గురించి బడ్జెట్ కేటాయింపుల్లో ప్రకటిస్తారు. భూటాన్, మాల్దీవులు, ఆఫ్గనిస్తాన్, నేపాల్, బంగ్లాదేశ్, ఇరాన్, మయన్మార్‌, శ్రీలంక దేశాలు ఇండియా ఆర్థిక సాయాన్ని అందుకుంటున్నాయి. ఈ దేశాల్లో అత్యధికంగా భూటాన్ దేశానికి ఇండియా ఎక్కువగా ఫైనాన్షియల్ ఫండింగ్ చేస్తోంది. 2025-26 బడ్జెట్‌లో ఆ దేశానికి రూ.2,150 కోట్లు కేటాయించారు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో రూ.2,543 కోట్లుగా ఉండే. 

Read also :Fatima Sana Shaikh: ఆ తెలుగు నిర్మాతలు నన్ను వేధించారు.. ప్రముఖ నటి క్యాస్టింగ్ కౌచ్ ఆరోపణలు!

పొరుగు దేశమైన భూటాన్ ఇండియా నుంచి నిధులు అందుకుంటున్న దేశాల్లో మరోసారి అగ్రస్థానంలో నిలిచింది. రూ.700 కోట్ల ఆర్థిక సహాయం అందుకుంటున్న దేశంగా నేపాల్‌ రెండో స్థానంలో ఉండగా, రూ.600 కోట్లతో మాల్దీవులు 3వ స్థానంలో ఉంది. ఆ దేశంలో మౌలిక సదుపాయాలు, జలవిద్యుత్ ప్రాజెక్టులు, ఆర్థిక సహకారం కోసం ఈ నిధులు ఖర్చు చేయనున్నారు. గత బడ్జెట్‌లో మాల్దీవ్ దేశానికి రూ.470 కోట్లు సహాయాన్ని అందజేయగా ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.600 కోట్లకు ఇది పెరిగింది. 28 శాతం అధిక నిధులను ఈ బడ్జెట్‌లో కేటాయించారు. గత ఆరు నెలల క్రితం మాల్దీవ్, భారత్ మధ్య దౌత్య సంబంధాలు కొంచె గాడి పత్పాయి. ఆదేశ అధ్యక్షుడు మొహమ్మద్ ముయిజ్జూ విధానాలన వల్ల ఇరు దేశాల మధ్య గ్యాప్ వచ్చింది. భారత్, మాల్దీవ్ దౌత్య సంబంధాల పునరుద్ధరణ బడ్జెట్‌ కేటాయింపులు పెరిగాయి. 

Read also : UNION BUDGET 2025: నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో రికార్డ్.. నాన్‌స్టాప్ గంటా 14 నిమిషాల స్పీచ్

తాలిబాన్‌ పాలనలో ఉన్న ఆఫ్ఘనిస్థాన్‌కు గత సంవత్సరం రూ.50 కోట్ల ఆర్థిక సహాయాన్ని అందిస్తే.. ఈసారి రూ.100 కోట్లు కేటాయించారు. ఆఫ్రికన్ దేశాలకు రూ.225 కోట్లు, ఇరాన్‌లోని చాబహార్ నౌకాశ్రయానికి రూ.100 కోట్ల నిధులు ఫండింగ్ చేస్తోంది ఇండియా. మారిషస్‌కు రూ.500 కోట్లు, మయన్మార్‌కు రూ.400 కోట్లు, శ్రీలంకకు రూ.300 కోట్లు, బంగ్లాదేశ్‌కు రూ.120 కోట్లు భారత్ ఆర్థిక సాయంగా ప్రకటించింది. 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు