IIT Madras: గోమూత్రం తాగితే.. జ్వరం పరార్

గోమూత్రం తాగితే జ్వరం నయమవుతుందని ఐఐటీ మద్రాస్‌ సంచాలకుడు కామకోటి తెలిపారు. గోమూత్రం అప్పుడపుడు అయిన తీసుకోవడం వల్ల శరీరంలో బ్యాక్టీరియా బయటకు వెళ్తుందన్నారు. తన తండ్రి జ్వరం వస్తే గోమూత్రం తాగేవారని, తగ్గేదని తెలిపారు.

New Update
IIT Kamakoti

IIT Kamakoti Photograph: (IIT Kamakoti)

గోమూత్రం తాగితే జ్వరం (Fever) పూర్తిగా నయమవుతుందని ఐఐటీ మద్రాస్‌ (IIT Madras) సంచాలకుడు కామకోటి తెలిపారు. అప్పుడప్పుడు అయిన గోమూత్రం తీసుకోవాలని అతను తెలిపారు. సంక్రాంతి సమయంలో చెన్నై వెస్ట్‌ మాంబళంలోని గోశాలలో జరిగిన గోపూజలో ఆయన పాల్గొన్నారు. ఆ సందర్భంగా కామకోటి మాట్లాడిన వ్యాఖ్యలు తాజాగా వెలుగులోకి వచ్చాయి.

Also Read :  డ్రాగన్ ఫ్రూట్‌తో మొటిమలు మాయం..ఎన్నో లాభాలు

Also Read :  నేడు ఈ రాశి వారు వారికి చాలా దూరంగా ఉండాలి..లేకపోతే ఇక అంతే సంగతులు

అన్ని అనారోగ్య సమస్యల నుంచి..

కామకోటి తండ్రికి ఓ సారి జ్వరం వచ్చింది. అప్పుడు వైద్యుని వద్దకు వెళ్లమంటారా అని ఓ సన్యాసిని అడిగితే.. గోమూత్రం (Cow Urine) తాగితే తగ్గిపోతుందని ఆ సన్యాసి తెలిపినట్లు చెప్పారు. ఆయన తండ్రి గోమూత్రం తీసుకున్న 15 నిమిషాల్లోనే పూర్తిగా జ్వరం తగ్గిపోయిందని కామకోటి తెలిపారు. గోమూత్రం కేవలం జ్వరానికే కాదు ఎన్నో అనారోగ్య సమస్యల నుంచి విముక్తి చేస్తుందని, అతిపెద్ద ఔషధమని తెలిపారు. శరీరంలో ఉన్న హానికర బ్యాక్టీరియాలకు వ్యతిరేకంగా పోరాడే శక్తి గోమూత్రానికి ఉందని తెలిపారు.

Also Read :  డెలివరీ తర్వాత ఆడవారి ప్రైవేట్ భాగంలో ఆవిరి పట్టడం కరెక్టేనా?

Also Read :  దాడి కేసులో కీలక మలుపు.. అసలైన నిందితుడు అరెస్టు

 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Breaking: ఇస్రో మాజీ ఛైర్మన్‌ కన్నుమూత!

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ మాజీ ఛైర్మన్‌ డా.కృష్ణస్వామి కస్తూరి రంగన్ కన్నుమూశారు.ఆయన హయంలో ఇస్రో తొలి లూనార్‌ మిషన్‌కు అడుగులు పడ్డాయి. 9 సంవత్సరాల పాటు ఇస్రో ఛైర్మన్‌ గా బాధ్యతలు నిర్వహించారు.

New Update
kasthuri

kasthuri

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ మాజీ ఛైర్మన్‌ డా.కృష్ణస్వామి కస్తూరి రంగన్ కన్నుమూశారు. బెంగళూరులో ఆయన తుది శ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.కస్తూరి రంగన్‌ 1990-1994  వరకు యూఆర్ఎసీ డైరెక్టర్‌ గా పని చేశారు.అనంతరం ఆయన 9 సంవత్సరాల పాటు ఇస్రో ఛైర్మన్‌ గా బాధ్యతలు నిర్వహించారు.

Also Read:Indian Air Force: కమ్ముకొస్తున్న యుద్ధ మేఘాలు.. LOC దగ్గర రాఫెల్ యుద్ధ విమానాలతో ఎక్స్‌ర్‌సైజ్ ఆక్రమన్

ఆయన హయంలో ఇస్రో తొలి లూనార్‌ మిషన్‌కు అడుగులు పడిన సంగతి తెలిసిందే.జేఎన్‌యూ ఛాన్సలర్‌ గా,కర్ణాటక నాలెడ్జ్‌ కమిషన్‌ ఛైర్మన్‌ గా కస్తూరి రంగన్‌ పని చేశారు.2003- 09 మధ్య రాజ్యసభ సభ్యుడిగానూ వ్యవహరించారు.

అంతేకాకుండా ప్రస్తుతం రద్దయిన ప్రణాళిక సంఘం సభ్యుడిగానూ సేవలందించారు. అలాగే 2004 నుంచి 2009 మధ్య కాలంలో బెంగళూరులోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్‌ అడ్వాన్స్‌డ్‌ స్టడీస్‌ కు డైరెక్టర్‌ గా పని చేశారు. మోడీ సర్కార్‌ తీసుకొచ్చిన నూతన జాతీయ విద్యా విధానం ముసాయిదా కమిటీకి అధ్యక్షుడిగా పని చేశారు.

Also Read:Pahalgam Terror Attack: టార్గెట్ హైదరాబాద్‌..  ఆ ప్రాంతాలపైనే ఉగ్రవాదుల ఫోకస్!

Also Read:Telangana: నిప్పుల కుంపటిల రాష్ట్రం.. రోజురోజుకూ పెరుగుతున్న ఉష్ణోగ్రతలు

isro | former-chairman | passed-away | latest-news | telugu-news 

Advertisment
Advertisment
Advertisment