IIT baba: ఐఐటీ బాబాను బహిష్కరించిన సొంత అఖాడా.. అసలు కారణం ఏంటంటే!

మహా కుంభమేళాలో అందరి దృష్టిని ఆకర్షించిన ‘ఐఐటీ బాబా’ పేరు అభయ్‌ సింగ్‌. అయితే అతన్ని సొంత అఖాడా నుంచి బహిష్కరించారు. అసలు సొంత అఖాడా వారే ఎందుకు బహిష్కరించారు..దానికి కారణాలు ఏంటి అనేది ఈ స్టోరీలో!

New Update
iit BABA

iit BABA Photograph: (iit BABA)

ప్రయాగ్‌ రాజ్‌ లో జరుగుతున్న మహా కుంభమేళాలకు కోట్లాది మంది భక్తుల తరలి వచ్చి స్నానాలు ఆచరిస్తున్నారు.  ఇప్పటికే అనేక మంది పుణ్య స్నానాలు ఆచరించారు. వీరిలో సామాన్యులతో పాటు బాబాలు, గురువులు, సాధువులు, సన్యాసులు, అఘోరీలు, పీఠాధిపతులు, ఆధ్యాత్మికవేత్తలు ఉన్నారు. 

Also Read: IRAN: మహమ్మద్ ప్రవక్తను అవమానించాడని పాప్ సింగర్‌కు మరణ శిక్ష...ఎక్కడో తెలుసా!

అయితే కొందరు బాబాలు, సాధువులు పాపులర్ వచ్చారు. అంబాసిడర్‌ బాబా, కంప్యూటర్‌ బాబా, రుద్రాక్ష బాబా, చాయ్‌వాలే బాబా.. ఇలా చాలా మంది అక్కడికి వస్తున్న భక్తులను ఆకర్షిస్తున్నారు. వీరిలో ఐఐటీ బాబా ఒకరు. అయితే ఆయన్ని సొంత అఖాడా నుంచి బహిష్కరించారు.

Also Read: Crime: మనిషివా..పశువువా..నిండు చూలాలి కడుపు మీద కూర్చుని హత్య చేసిన దుర్మార్గుడు!

మహా కుంభమేళాలో అందరి దృష్టిని తన వైపున తిప్పుకున్న ‘ఐఐటీ బాబా’ అసలు పేరు అభయ్‌ సింగ్‌. ఆయన IIT బాంబే నుంచి ఏరోస్పేస్‌ ఇంజినీరింగ్‌లో గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశారు. 2008 IIT JEE ఎగ్జామ్‌లో 731వ ర్యాంకు సాధించినట్లు సమాచారం. తర్వాత ఆయన ఐఐటీ బాంబేలో చేరినట్లు మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. అనంతరం కెనడాలో రూ.36 లక్షల యాన్యువల్‌ ప్యాకేజీతో పనిచేశారు. బంగారం లాంటి భవిష్యత్తును కాదనుకొని ఆధ్యాత్మికత వైపు అడుగులు వేశారు.

హర్యానాకు చెందిన అభయ్, జీవితాన్ని మరింత లోతుగా అధ్యయనం చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో సంస్కృతం, తత్వశాస్త్రం సహా ఆధ్యాత్మిక అంశాలను అధ్యయనం చేశారు. ఈ దారిలో ఉండగానే లౌకిక ప్రపంచాన్ని వదిలి పూర్తి స్థాయిలో భక్తిమార్గంలో పయనించాలని నిర్ణయించుకున్నారు. నాగసాధువు సాధనలో ఉన్న ఈ ఐఐటీ బాబా , మహా కుంభమేళాలో ఓ టీవీ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూతో ప్రాచుర్యంలోకి వచ్చారు. ఆయనకు ఇన్‌స్ట్రాగ్రామ్‌లో లక్షకు పైగా ఫాలోవర్లు ఉండడం గమనార్హం. 

ఇటీవల ఆయన చేసిన కొన్ని వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. సొంత గురువు మహంత్‌ సోమేశ్వర్‌ను ఉద్దేశించి ఆయన కొన్ని అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తుంది. అలాగే సొంత తండ్రిపైనా విమర్శలు చేశారు. దీన్ని ఆయన సభ్యునిగా ఉన్న జునా అఖాడా తీవ్రంగా పరిగణించింది. ఆయన్ను తమ క్యాంపు నుంచి బహిష్కరిస్తున్నట్లు ప్రకటించి అందర్ని షాక్‌ కి గురి చేసింది.

అభయ్‌ సింగ్‌ చేసిన వ్యాఖ్యలు తమ నియమాలకు విరుద్ధమని జునా అఖాడా చీఫ్‌ హరి గిరి వెల్లడించారు. సన్యాసానికి గురు, శిష్యుల మధ్య బంధం, క్రమశిక్షణ చాలా కీలకమని తెలిపారు. వీటిని అభయ్‌ సింగ్‌ ఉల్లంఘించారని, గురువుపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సనాతన ధర్మాన్ని అగౌరవపరచినట్లేనని చెప్పారు. తోటి సాధువులపైనా ఆయన అభ్యంతర వ్యాఖ్యలు చేసినట్లు వెల్లడించారు. 

ఆయన వ్యవహార శైలిపై విచారించిన డిసిప్లినరీ కమిటీ.. బహిష్కరించాలని నిర్ణయించినట్లు ప్రకటించారు. సాధన పట్ల గౌరవాన్ని, క్రమశిక్షణను ప్రదర్శించే వరకు ఆయనపై నిషేధం కొనసాగుతుందని తేల్చి చెప్పారు. అభయ్‌ సింగ్‌ తండ్రి కరణ్‌ ఓ లాయర్‌. కుమారుడి జర్నీపై ఆయన మిశ్రమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. అభయ్‌ అకడమిక్స్‌పై సంతోషం వ్యక్తం చేస్తూనే.. మంచి భవిష్యత్తును వదులుకొని సన్యాసిగా మారడం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. 

కోవిడ్‌-19 సంక్షోభ సమయంలో అభయ్‌ కెనడా నుంచి తిరిగొచ్చారని తెలిపారు. అనంతరం భివాణిలోని న్యూరోపతి సెంటర్‌కు వెళ్లారు, అప్పటి నుంచే ఆయన దృష్టి ఆధ్యాత్మిక మార్గం వైపు మళ్లినట్లు  తెలిపారు. మెడిటేషన్‌, ఫిలాసఫీ పట్ల ఆయన ఆసక్తి చూపిస్తున్నట్లు డాక్టర్లు గుర్తించినట్లు వెల్లడించారు.

ప్రస్తుతానికి అభయ్‌కు తన కుటుంబంతో ఎలాంటి కమ్యూనికేషన్‌ లేదని తండ్రి కరణ్ చెప్పారు. సోషల్‌ మీడియా ద్వారానే ఆయన గురించి తెలుసుకుంటున్నట్లు చెప్పారు. కొన్నాళ్ల క్రితం వరకు టెక్ట్స్‌ మెసేజ్‌ల ద్వారా కాంటాక్ట్‌లో ఉండేవాడని..ఆ సమయంలో పెళ్లి విషయం అడగడంతో అది కూడా మానేశారని ఆయన చెప్పుకొచ్చారు.

ఏదో ఒక రోజు తన కుమారుడు ఇంటికి తిరిగొస్తాడని కరణ్‌ ధీమా వ్యక్తం చేశారు. తమ నుంచి ఆయనపై ఎలాంటి ఒత్తిడి ఉండదని చెప్పారు.

Also Read: Fire Accident: విశాఖ పరవాడ ఫార్మాసిటీలో మరో భారీ అగ్నిప్రమాదం!

Also Read: Kiran Abbavaram: తండ్రి కాబోతున్న మరో టాలీవుడ్ హీరో.. సోషల్ మీడియాలో పోస్ట్ !

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు