HMPVకి భయపడాల్సిన అవసరంలేదు: జేపీ నడ్డా

భారత్‌లో హెచ్‌ఎంపీవీ కేసుల సంఖ్య 6కి చేరింది. తాజాగా కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా కూడా దీనిపై స్పందించారు. హెచ్‌ఎంపీ కొత్త వైరస్ కాదని, దీనికి భయపడాల్సిన అవసరం లేదని చెప్పారు. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.

New Update
JP Nadda

JP Nadda

భారత్‌లో హెచ్‌ఎంపీవీ కేసుల సంఖ్య 6కి చేరింది. బెంగళూరులో ఇద్దరు చిన్నారులు, గుజరాత్‌ 1, కోల్‌కతాలో 1, చెన్నైలో మరో ఇద్దరు చిన్నారుల్లో ఈ కేసులు వెలుగుచూశాయి. అయితే హెచ్‌ఎంపీ కొత్త వైరస్ కాదని, దీని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్య నిపుణులు చెబుతున్నారు. తాజాగా కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా కూడా దీనిపై స్పందించారు. వైరస్‌కు భయపడాల్సిన అవసరం లేదని చెప్పారు. వైరస్‌ పరిస్థితిని ఆరోగ్యశాఖతో పాటు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్‌ మెడికల్ రీసెర్చ్ ICMR, నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ (NCDC) పరిశీలిస్తున్నాయని తెలిపారు. ఈ మేరకు ఓ ప్రత్యేక వీడియోను విడుదల చేశారు.   

Also Read : భారత్‌లో చైనా కొత్త వైరస్ టెన్షన్ .. లాక్ డౌన్ పక్కానా?

నడ్డా మాట్లాడుతూ..'' HMPV కొత్త వైరస్ కాదని ఆరోగ్య రంగ నిపుణులు తెలిపారు. 2001లో ఈ వైరస్‌ బయటపడింది. చాలా ఏళ్లుగా ప్రపంచవ్యాప్తంగా ఇది వ్యాప్తిలోనే ఉంది. గాలి, శ్వాసక్రియ ద్వారా వ్యాపించే ఈ వైరస్ అన్ని వయసుల వాళ్లను ప్రభావితం చేయగలదు. చలికాలం, వేసవికాలం ప్రారంభంలో ఈ వైరస్ ఎక్కువగా వ్యాపిస్తుంటుంది. ఇటీవల వచ్చిన రిపోర్ట్స్‌ ప్రకారం చూసుకుంటే చైనాలో ఈ వైరస్ కేసులు పెరుగుతున్నాయి.   

Also Read: HMPV వైరస్ కరోనా కంటే ప్రమాదకరమా?.. వైద్యులు ఏం చెబుతున్నారు?

ICMR, NCDC, ఆరోగ్యశాఖ.. చైనాతో సహా ఇతర దేశాల్లో పరిస్థితిని పరిశీలిస్తున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా దీన్ని పరిశీలించి.. త్వరలో రిపోర్టును మనకు పంపిస్తుంది. ICMR, ఇంటిగ్రేటెడ్‌ డిసీజ్‌ సర్వైలెన్స్‌ ప్రోగ్రామ్‌తో భారత్‌లో శ్వాసకోశ వైరస్‌లకు సంబంధించిన డేటాను సమీక్షించాయి. సాధారణ వ్యాధికారిక వైరస్‌లో ఎలాంటి పెరుగుదల లేదు. పరిస్థితులను గమనిస్తూ.. ఆరోగ్యపరమైన సవాళ్లు ఎదుర్కునేందుకు సిద్ధంగా ఉన్నామని'' జేపీ నడ్డా అన్నారు .  

Also Read: ఆర్మీ కాన్వాయ్‌ పై ఆత్మాహుతి దాడి..47 మంది సైనికులు మృతి

 

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు