HMPV: 6కి చేరిన హెచ్‌ఎంపీవీ కేసులు.. ICMR కీలక ప్రకటన

భారత్‌లో HMPV కేసుల సంఖ్య 6కి చేరింది. కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ICMR కీలక ప్రకటన చేసింది. భారత్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే ఈ వైరస్ వ్యాప్తిలో ఉందని తెలిపింది. కేసులు పెరిగిన ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పింది.

New Update
HMPV

HMPV

భారత్‌లో HMPV కేసులు వేగంగా పెరుగుతున్నాయి. తాజాగా చెన్నైలో మరో ఇద్దరు చిన్నారుల్లో ఈ వైరస్‌ను గుర్తించారు. దీంతో దేశంలో మొత్తం హెచ్‌ఎంపీవీ కేసుల సంఖ్య 6కి చేరింది. బెంగళూరులో వైరస్ సోకిన మూడు నెలల చిన్నారి కోలుకుంది. ఆస్పత్రి నుంచి కూడా డిశ్చార్జి చేశారు. మరో 9 నెలల చిన్నారికి ప్రస్తుతం చికిత్స అందిస్తున్నారు. అలాగే గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో 2 నెలల చిన్నారి, కోల్‌కతాలో 5 నెలల చిన్నారిలో కూడా ఈ వైరస్‌ను గుర్తించారు. తాజాగా చెన్నైలో ఇద్దరు చిన్నారులకు ఈ  వైరస్‌ సోకినట్లు వైద్యులు ప్రకటించారు. ప్రస్తుతం వీళ్లకు చికిత్స జరుగుతోంది. 

Also Read: HMPV వైరస్ కరోనా కంటే ప్రమాదకరమా?.. వైద్యులు ఏం చెబుతున్నారు?

ఇలా హెచ్‌ఎంపీవీ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్‌ మెడికల్ రిసెర్చ్ (ICMR) కీలక ప్రకటన చేసింది. ఈ వైరస్‌ భారత్‌తో సహా ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే వ్యాప్తిలో ఉందని తెలిపింది. వివిధ దేశాల్లో హెచ్‌ఎంపీవీతో సంబంధం కలిగిన శ్వాసకోస వ్యాధుల కేసులు నమోదైనట్లు చెప్పింది. ఇలాంటి కేసులు భారత్‌లో పెరిగినా ఎదుర్కునేందుకు సిద్ధంగా ఉన్నామని పేర్కొంది. కేంద్ర ఆరోగ్యశాఖ కూడా ఈ పరిస్థితిని పర్యవేక్షిస్తోందని స్పష్టం చేసింది . 

Also Read: మావోయిస్టులను చంపేందుకు రూ.5,601 కోట్లు.. మరింత పెంచే ఛాన్స్!

మరోవైపు హెచ్‌ఎంపీ వైరస్ పట్ల ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ వైరస్‌ కొత్తదేమి కాదని గతంలో కూడా ఇలాంటి హెచ్‌ఎంపీవీ కేసులు నమోదయ్యాయని తెలిపారు. జులై లేదా ఆగస్టు నుంచి డిసెంబర్ లేదా జనవరి వరకు ప్రతీ ఏడాది ఈ కేసులు వస్తాయన్నారు. దగ్గు, జలుబు, జ్వరం లాంటి సాధారణ లక్షణాలే ఉంటాయని.. చాలా అరుదైన సందర్భాల్లో మాత్రమే దీని తీవ్రత పెరిగినప్పుడు ఆక్సిజన్ అందించాల్సి ఉంటుందని తెలిపారు .

Also Read: ఆర్మీ కాన్వాయ్‌ పై ఆత్మాహుతి దాడి..47 మంది సైనికులు మృతి

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు