కుంభమేళా వెళ్తున్నారా.. అయితే ఇవి తెలుసుకోండి, లేదంటే కష్టాలే..

కుంభమేళా ప్రపంచంలోనే అత్యధిక ట్రాపిక్‌ జామ్ ఎదుర్కొంది. ఉత్తరప్రదేశ్‌లో 300కి.మీ మేరా ట్రాఫిక్ జామ్. మరో 15 రోజులు మాత్రమే కుంభమేళా ఉండటంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మీరు కూడా కుంభమేళా వెళ్తాలనుకుంటున్నారా? అయితే ఆర్టికల్ పూర్తిగా చదవండి.

author-image
By K Mohan
New Update
kumbhamela traffic jam

kumbhamela traffic jam Photograph: (kumbhamela traffic jam)

144 సంవత్సరాలకు ఓసారి వచ్చే మహాకుంభమేళా.. అంటే జన్మకు ఒక్కసారే ఈ మహాత్తర కార్యక్రమాన్ని కల్లారా చూడగలము. కుంభమేళా సమయంలో త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరిస్తే ఎంతో ముక్తి లభిస్తోందని, పాపాలు వైదొలుగుతాయని హిందువులు భావిస్తారు. అందుకే భక్తులు ప్రయాగ్‌రాజ్‌కు బారులుతీరుతున్నారు. జనవరి 13కి ప్రారంభమైన మహాకుంభమేళా.. మరో 15రోజులు మాత్రమే మిగిలిఉంది. ప్రపంచవ్యాప్తంగా రోజుకి కోట్లమంది ఉత్తరప్రదేశ్‌లో గంగా, యమునా, సరస్వతి నదులు కలిసే త్రివేణి సంగమానికి చేరుకుంటున్నారు. ఈ త్రివేణి సంగమానికి దగ్గరగా ఉన్న టౌన్ ప్రయాగ్‌రాజ్.

15 రోజుల్లో కుంభమేళా క్లోస్

మహాకుంభమేళా భక్తులతో ప్రయాగ్‌రాజ్ పరిసర ప్రాంతాలు రద్దీగా మారాయి. ఫిబ్రవరి 11న 300 కిలో మీటర్ల మేరా ట్రాఫిక్ జామ్ అయ్యింది. వాహనాలు 48 గంటలపాటు రోడ్లపైనే నిలిచిపోయాయి. మహాకుంభమేళా ప్రారంభమైనప్పటినుంచి ఇప్పటి వరకు 44 కోట్లమంది ఘాట్‌లో పుణ్యస్నానాలు చేశారని అధికారులు చెబుతున్నారు. ఫిబ్రవరి 10న 44 లక్షల మంది ప్రవిత్ర స్నానాలు ఆచరించారని తెలిపారు. బసంత్ పంచమి (ఫిబ్రవరి 3) నాడే 4 నుంచి 6కోట్ల మంది మహాకుంభమేళాకు తరలివచ్చారని నిర్వాహకులు చెబుతున్నారు. అయితే బసంత్ పంచమి తర్వాత భక్తుల రద్దీ తగ్గుతుందని అధికారులు అనుకున్నారు. కానీ.. మహాకుంభమేళాకు వచ్చే భక్తుల సంఖ్య ఇంకా తగ్గడం లేదు. వీఐపీలు కూడా ఇదే సమయంలో ప్రయాగ్‌రాజ్ వెళ్తున్నారు. మరో 15 రోజుల్లో కుంభమేళా ముగుస్తోందని భక్తులు భారీ సంఖలో చేరుకుంటున్నారు. బసంత పంచమి తర్వాత రద్దీ తగ్గుతుందని అందరూ... దాని తర్వాతే రావడంతో ట్రాఫిక్ మరింత పెరుగుతోంది. 

కుంభమేళా వెళ్లొస్తూ రోడ్డుప్రమాదంలో తెలుగువారు మృతి

కుంభమేళా నుంచి తిరిగి వస్తుండగా రోడ్డు ప్రమాదంలో ఏడుగురు ఏపీ వాసులు మృతిచెందారు. మంగళవారం ఉదయం జబల్‌పుర్‌ జిల్లా పరిధిలోని షిహోరా ప్రాంతంలో మినీ బస్‌ ను ట్రక్‌ ఢీకొంది. మధ్యప్రదేశ్‌లోని జబల్‌పుర్‌ జిల్లాలోఈ ఘటన జరిగింది. . ఏడుగురు ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు.  మృతుల్లో ఇద్దరిని మంజు శర్మ (32), మనోజ్ విశ్వకర్మ (42) గా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు గాయపడిన వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజ్‌లను పరిశీలిస్తున్నారు.  

జనదిగ్బంధనంలో ప్రయాగ్‌రాజ్

వివిధ రాష్ట్రాల వెళ్లే ప్రయాణికులు ఉత్తరప్రదేశ్‌లో చాలా ఇబ్బందులు పడుతున్నారు. గంటలకొద్దీ ట్రాఫిక్ జామ్, నిత్యవసర వస్తువులు దొరకకపోవడంలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు. ప్రయాగ్‌రాజ్‌లో ఎయిర్‌పోర్ట్, రైల్వే స్టేషన్, పెద్ద బస్‌స్టాండ్ ఉన్నాయి. సో.. భక్తులందరూ కుంభమేళాకు ఇదే మార్గా్న్ని ఎంచుకుంటున్నారు. ప్రయాగ్‌రాజ్ నుంచి త్రివేణి సంగమం 10కిలో మీటర్ల దూరం ఉంటుంది. అక్కడ నుంచి ప్రైవేట్ ట్రావెల్స్ అనుమతించకుండా పబ్లిక్‌ట్రాన్స్ ద్వారానే పర్యటకులను ప్రధాన ఘాట్ల దగ్గరకు చేర్చుతున్నారు. దీంతో ప్రయాగ్‌రాజ్‌లో ఇసుకవేస్తే రాలనంత జనసమూహం గ్యాదర్ అయ్యింది. వీకెండ్‌ రోజుల్లో ఈ రద్దీ ఇంకా ఎక్కువగా ఉంది. జనవరి 29న సంగ్ ఘాట్‌లో జరిగిన తొక్కిసలాట కారణంగా ఫిబ్రవరి 4న వరకు కుంభమేళా ప్రాంతంలో నో వెహికల్ జోన్ అమలు చేశారు పోలీసులు. అంటే ఆయా ప్రాంతంలో వాహనాలు నిషేదించారు. పర్యటకుల రద్దీ తగ్గకపోవడం వల్ల ఆ రూల్ ఇప్పటికీ కొనసాగుతుంది.

రాజకీయ నాయకులు, సినీ తారలు

తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు హరీశ్ రావు, సినీ హీరో విజయ్ దేవరకొండ, బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్, హీరోయిన్ సంముక్తా మీనన్, రాజ్యసభ సభ్యురాలు సుధాముర్తి, రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము లు కూడా ఇటీవల కుంభమేళాకు వెళ్లారు. వీఐపీ పాస్‌లు రద్దు చేయడం వల్ల వారు సాధరణంగా సంగం ఘాట్‌కు వెళ్లారు.

మహా కుంభమేళాను దృష్టిలో ఉంచుకుని భారత రైల్వే దేశంలోని వివిధ ప్రాంతాల నుండి ప్రయాగ్‌రాజ్‌కు ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. దేశవ్యాప్తంగా 13,000 కి పైగా రైళ్లు నడుపుతున్నారు. 10,000 రెగ్యులర్ మరియు 3,000 కంటే ఎక్కువ ప్రత్యేక రైళ్లు ఉన్నాయి. ఈ రైళ్లు మహా కుంభమేళాకు వస్తున్న భక్తుల కోసం ఏర్పాటు చేశారు.  

ప్రయాగ్‌రాజ్ రూట్‌లో 25 కి.మీ మేరా నిలిచిపోయిన వెహికిల్స్

ప్రయాగ్‌రాజ్‌ టౌన్‌లో దారులన్నీ వన్ వే రూట్ చేశారు. త్రివేణి సంగమంకు వెళ్లే వారికి, తిరిగి వచ్చే వచ్చేవారికి వేర్వేరు రూట్లు ఏర్పాటు చేశారు ఉత్తరప్రదేశ్ ట్రాఫిక్ పోలీసులు. జనవరి 30 నుంచి వీఐపీ పాస్‌లు కూడా రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. సెలబ్రెటీలు, పొలిటికల్ లీడర్లు, ప్రభుత్వ అధికారులు ఎవ్వరైనా సరే కుంభమేళాలో అందరిలో ఒకరిలాగానే సామాన్యుడిలా ట్రీట్‌చేస్తున్నారు. అయినప్పటికీ వారి సెక్యురిటి రీజన్స్ వల్ల సామాన్య భక్తులు కొంత అసౌకర్యానికి గురవుతున్నారు. ట్రాఫిక్ తగ్గించడానికి ప్రయాగ్‌రాజ్‌లో ఇతర రాష్ట్రాల వాహనాలకు అనుమతి ఇవ్వడం లేదు. మొక్కులు తీర్చుకోడానికి వచ్చే భక్తులకు పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ సేవలే మెరుగుపరిచారు.

ఫిబ్రవరి 11న ఉన్న ట్రాఫిక్ జామ్‌లో 50 కిలో మీటర్లు ప్రయాణించాలంటే 10- 12 గంటల టైం పడుతుందని ఓ యాత్రికుడు చెప్పాడు. ప్రయాగ్‌రాజ్‌లో 7 కిలో మీటర్ల మేరా హెవీ ట్రాఫిక్ జామ్ ఉందని భక్తులు వాపోతున్నారు. వారణాసి, లక్నో, కాన్నూర్ నుంచి ప్రయాగ్‌రాజ్ వెళ్లే మార్గంలో 25 కిలో మీటర్ల దూరం వెహికిల్స్ నిలిచిపోయాయి. గూగుల్ మ్యాప్ వాడుతూ చాలామంది ప్రయాగ్‌రాజ్‌కు చేరుకుంటున్నారని, అందరూ ఒకే రూట్‌లో రావడం వల్ల ట్రాఫిక్ పెరిగిపోతుందని తెలిపారు. ప్రయా‌గ్‌రాజ్‌ నుంచి రిటర్న్ వచ్చే భక్తుల పరిస్థితి ఇలానే ఉంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు సంగమం దగ్గరున్న రైల్వే స్టేషన్‌ను తాత్కాలికంగా మూసివేశారు. 

2 రోజుల వరకు వెళ్లొందని ముఖ్యమంత్రి సూచన

ప్రయాగ్‌రాజ్ వెళ్లిన భక్తుల్లో చాలామంది వారణాసి, కాశీ, అయోధ్య కూడా దర్శించుకుంటున్నారు. దీంతో ఆయా ప్రదేశాల్లో కూడా రద్దీ పెరిగిపోయింది. జబల్‌పుర్‌ నుంచి ప్రయాగ్‌రాజ్‌ వెళ్లే రూట్‌లో వాహనాలు నిలిచిపోయాయి. కాశీ, అయోధ్యలకు భక్తులు పోటెత్తుతున్నారు. కాశీలో పలు ప్రాంతాల్లో వాహనాల రాకపోకలపై ఆంక్షలు విధించారు పోలీసులు. 2 రోజుల పాటు ప్రయాగ్‌రాజ్‌కు వెళ్లొద్దని భక్తులకు మధ్యప్రదేశ్‌ సీఎం మోహన్‌యాదవ్ సూచించారు. జనవరి 26తో మహాకుంభమేళా ముగియనుంది. మరో 15 రోజులు మాత్రమే ఉండటంతో ప్రపంచవ్యాప్తంగా హిందులు త్రివేణి సంగమానికి పోటెత్తున్నారు.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు