/rtv/media/media_files/2026/03/12/hcltech-gives-wfh-option-till-march-13-as-gas-crunch-disrupts-office-canteen-2026-03-12-21-42-03.jpg)
HCLTech gives WFH option till March 13 as gas crunch disrupts office canteen
పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధం ప్రభావం భారత ఐటీ కంపెనీలపై కూడా చూపిస్తున్నాయి. దేశంలో గ్యాస్ సిలిండర్ల కొరత వల్ల ఉద్యోగుల భోజన సదుపాయాలకు తీవ్ర ఆటంకం కలుగుతోంది. దీంతో ప్రముఖ ఐటీ సంస్థలైన HCL టెక్, ఇన్ఫోసిస్ కంపెనీలకు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకుంటున్నాయి.
LPG కొరత వల్ల HCL టెక్ కంపెనీల్లో నిర్వహణ కష్టతరంగా మారింది. దీంతో చెన్నై కార్యాలయంలో తమ ఉద్యోగులకు మార్చి 12-13 తేదీల్లో వర్క్ ఫ్రమ్ హోం ఆఫర్‌ను ఇచ్చింది. గ్యాస్ సరఫరా ఆగిపోవడంతో క్యాంటీన్ వెండర్లు ఆహారం వండలేకపోతున్నారని సంస్థ ఎగ్జిక్యూటివ్‌లు తెలిపారు. అందుకే వర్క్ ఫ్రమ్ హోం నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు.
Also Read: LPG ధరల పెరుగుదలపై రాజకీయ దుమారం.. కేంద్రం క్లారిటీ
మరోవైపు దేశంలో రెండో అతిపెద్ద ఐటీ సంస్థ అయిన ఇన్ఫోసిస్ కూడా బెంగళూరు, చెన్నై, పూణే కంపెనీల్లో ఆహార సరఫరా ఆంక్షలు విధించింది. గ్యాస్ వినియోగం ఎక్కువగా అవసరమయ్యే దోశలు, ఆమ్లెట్లు వంటి వాటిని తాత్కాలికంగా నిలిపివేసింది. గ్యాస్‌కు బదులు ఎలక్ట్రికల్ ఉపకరణాలు, బయోఫ్యూయల్ వినియోగాన్ని పెంచాలని నిర్ణయించింది. అంతేకాదు సెంట్రల్ కిచెన్ల నుంచి వండిన ఆహారాన్ని ఉద్యోగుల కోసం తెప్పిస్తోంది. ఈ సంక్షోభంపై కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్ స్పందించారు. గతంలో కోవిడ్ మహమ్మారినే ఎదుర్కొన్నామని.. ఈ గ్యాస్ కొరతను కూడా త్వరలో అధిగమిస్తామని తెలిపారు. విపక్షాలు అసత్యాలు ప్రచారం చేస్తున్నాయంటూ మండిపడ్డారు.
మరోవైపు యుద్ధ ప్రభావం వల్ల గ్యాస్ సరఫరా దెబ్బతినకుండా ఉండేందుకు కేంద్రం పలు చర్యలు చేపట్టింది. ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ (ECA) చట్టాన్ని ప్రయోగించి ఇళ్లు, ఆసుపత్రులు, విద్యా సంస్థలకు LPG సరఫరా చేయడంలో అధికారులు మొదటి ప్రాధాన్యత ఇచ్చారు. వాణిజ్య అవసరాలపై పలు ఆంక్షలు విధించారు. అంతేకాదు రిఫైనరీల ద్వారా LPG ఉత్పత్తిని 8 నుంచి 25 శాతానికి పెంచారు. డొమెస్టిక్ సిలిండర్ల బుకింగ్ గ్యా్స్ గ్యాప్‌ను గ్రామీణ ప్రాంతాల్లో 45 రోజులకు పెంచారు. పట్టణాలు, నగరాల్లో 25 రోజులే పొడిగించారు. అలాగే బ్లాక్ మార్కెట్ జరగకుండా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేశారు.
Also Read: రక్తానికి ప్రతీకారం తీర్చుకుంటాం.. మొజ్తబా ఖమేనీ సంచలన ప్రకటన !
Follow Us