CEC: రాజీవ్ కుమార్‌ పదవీ విరమణ.. కొత్త సీఈసీ ఎవరో తెలుసా ?

సీఈసీ రాజీవ్‌ కుమార్‌ ఫిబ్రవరి 18న తన పదవీ విరమణ చేయనున్నారు.దీంతో కొత్త సీఈసీని ఎన్నుకునేందుకు ఫిబ్రవరి 17న ప్రధాని మోదీ అధ్యక్షతన ఎంపిక కమిటీ భేటీ కానుంది. నూతన సీఈసీగా జ్ఞానేశ్‌ కుమార్‌ను ఎంపిక చేసే ఛాన్స్‌ ఉన్నట్లు తెలుస్తోంది.

New Update
CEC Rajeev Kumar

CEC Rajeev Kumar

కేంద్ర ఎన్నికల ప్రధానాధికారి (CEC) రాజీవ్‌ కుమార్‌ ఫిబ్రవరి 18న తన పదవీ విరమణ చేయనున్నారు. దీంతో కొత్త సీఈసీని ఎన్నుకునేందుకు ఫిబ్రవరి 17న ప్రధాని మోదీ అధ్యక్షతన ఎంపిక కమిటీ భేటీ కానుంది. అయితే నూతన సీఈసీగా జ్ఞానేశ్‌ కుమార్‌ను ఎంపిక చేసే ఛాన్స్‌  ఉన్నట్లు తెలుస్తోంది. ఈ కమిటీలో ప్రధాని మోదీ, కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్‌ మేఘవాల్‌, విపక్ష నేత రాహుల్‌ గాంధీ సైతం సభ్యులుగా ఉండనున్నారు.  

Also Read: తెలంగాణ కాంగ్రెస్ లో కీలక మార్పులు.. మున్షీ ఔట్.. కొత్త ఇన్‌ఛార్జ్ ఎవరంటే? 

అయితే జ్ఞానేశ్‌ కుమార్‌ కేరళ కేడర్‌కు చెందిన 1988 బ్యాచ్‌ ఐఏఎస్‌ అధికారి. ప్రస్తుతం ఆయన కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్‌గా పని చేస్తున్నారు. అలాగే అంతకుముందు కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా ఆధ్వర్యంలో సహకార మంత్రిత్వ శాఖ, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వ శాఖల కార్యదర్శిగా పనిచేశారు. ఆ తర్వాత రిటైర్ కూడా అయ్యారు. అనంతరం శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌ ఏర్పాటు చేయడంతో పాటు అయోధ్య కేసుపై సుప్రీం కోర్టు తీర్పునకు సంబంధించి అన్ని అంశాలు చూసుకునేందుకు హోం మంత్రిత్వశాఖ ఏర్పాటు చేసిన ప్రత్యేక విభాగానికి నాయకత్వం వహించారు. 

Also Read: పుల్వామా అటాక్ చేసినవాళ్లను ఇండియన్ ఆర్మీ ఏం చేసిందో తెలుసా?

ఇదిలాఉండగా రాజీవ్‌ కుమార్‌ మే 15, 2022న 25వ సీఈసీగా బాధ్యతలు చేపట్టారు. ఆయన బీహార్‌/జార్ఖండ్‌ కేడర్‌కు చెందిన 1984 బ్యాచ్‌ ఐఏఎస్ అధికారి. రాజీవ్‌ కుమార్ తన పదవి కాలంలో 2022లో 16వ రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి ఎన్నికలతో సహా మొత్తం 11 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించారు. ఎన్నికల కమిషనర్‌ పదవి చేపట్టకముందు.. ఫైనాన్స్ సెక్రటరీ, పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్ సెలక్షన్ బోర్డ్ ఛైర్మన్‌తో సహా పలు కీలక పదవులు చేపట్టారు. 

Also Read: కేరళలో ఏనుగుల బీభత్సం.. ముగ్గురు స్పాట్ డెడ్.. మరో 36 మంది: వీడియో చూశారా!

Also Read: కేరళలో ఏనుగుల బీభత్సం.. ముగ్గురు స్పాట్ డెడ్.. మరో 36 మంది: వీడియో చూశారా!

 

Advertisment
Advertisment
Advertisment