/rtv/media/media_files/2025/03/05/XkvAqBZbF54WnazYL9Yi.jpg)
Gurugram Teen Blackmailed Rs.80 Lakh Scam
‘‘మా అమ్మమ్మ భూమి అమ్మింది. దాంతో ఏకంగా రూ.80 లక్షలు వచ్చాయి. వాటిని మా అమ్మమ్మ అకౌంట్లోనే ఉన్నాయి.’’ ఈ మాటలను 9వ తరగతి చదువుతున్న ఓ బాలిక తన స్నేహితురాలికి చెప్పింది. అది విన్న 10వ తరగతి స్టూడెంట్ ఎలాగైనా కొట్టేయాలని ప్లాన్ వేశాడు. ఆన్‌లైన్‌లో ఆ బాలికతో స్నేహం పెంచుకున్నాడు.
Also Read : అమెరికా ఇంక తగ్గేదే లే..యూఎస్ కాంగ్రెస్ లో ట్రంప్ మొదటి ప్రసంగం
తర్వాత ఆ బాలిక అమ్మమ్మ ఖాతాలో ఉన్న డబ్బులు మొత్తం అతడు కాజేశాడు. ఈ విషయం స్కూల్ టీచర్‌కు తెలియడంతో పోలీసులకు తెలిపింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు కేటుగాళ్లను అరెస్టు చేశారు. ఇంతకీ ఏమని చెప్పి డబ్బులు దోచారు?, ఈ విషయం స్కూల్ టీచర్‌కు ఎలా తెలిసింది? అనే పూర్తి విషయానికొస్తే..
Also Read : ఇంద్రా బస్సు బోల్తా.. స్పాట్‌లో 12 మంది..
బామ్మ అకౌంట్లో రూ.80 లక్షలు
గురుగ్రామ్‌కు చెందిన ఓ బాలిక తొమ్మిదో తరగతి చదువుతోంది. ఒకరోజు స్కూల్‌లో తన స్నేహితురాలితో.. తాము భూమిని అమ్మామని.. వాటి ద్వారా రూ.80 లక్షలు వచ్చాయని అని చెప్పింది. అవి తమ బామ్మ ఖాతాలోనే ఉన్నాయని తెలుపగా.. పక్కనే ఉన్న పదవ తరగతి విద్యార్థి విని.. ఎలాగైనా వాటిని కొట్టేయాలని నిర్ణయించుకున్నాడు.
Also Read : మూర్ఛ వ్యాధి ఎందుకు వస్తుంది.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
వెంటనే ఆ విషయాన్ని తన సోదరుడికి చెప్పాడు. వీరు మరికొందరికి ఈ విషయం చెప్పి ఆ వృద్ధురాలి వద్ద ఉన్న డబ్బును కొట్టేయాలని ప్లాన్ వేశారు. ఇందులో భాగంగానే సుమిత్ కటారియా అనే యువకుడు ఆన్‌లైన్‌లో ఆ బాలికతో పరిచయం పెంచుకుని ఫొటోలు రప్పించుకున్నాడు. ఆ తర్వాత వాటిని మార్ఫింగ్ చేసి బెదిరించాడు. దీంతో ఆ బాలిక బయపడి తన అమ్మమ్మకు తెలియకుండా పలుమార్లు వారి అకౌంట్లకు మనీ ట్రాన్సఫర్ చేసింది.
Also Read : చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో వెల్లుల్లి ఎలా పనిచేస్తుంది?
ఇక అక్కడితో ఆగని ఆ యువకులు మళ్లీ మళ్లీ డబ్బులు పంపించాలని ఆ బాలికపై ఒత్తిడి తెచ్చారు. డబ్బులు మరి లేవని.. అయిపోయాయని ఆ బాలిక చెప్పినా వారు వినిపించుకోలేదు. దీంతో ఆ బాలిక నేరుగా వెళ్లి జరిగిన విషయాన్ని తన స్కూల్ టీచర్‌కు చెప్పింది. ఆ టీచర్ సహాయంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆరుగురిని అరెస్టు చేశారు. నిందితుల నుంచి రూ.36 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. ఇంకా దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు పేర్కొన్నారు.