HMPV వైరస్ ఎఫెక్ట్.. ఆ రాష్ట్రంలో ఐసోలేషన్ సెంటర్లు ఓపెన్

గుజరాత్ లో సోమవారం hmpv కేసు నమోదు కాగా.. ఆ రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. గాంధీనగర్, అహ్మదాబాద్, రాజ్‌కోట్ ఆసుపత్రుల్లో ఐసోలేషన్ వార్డులను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. మొత్తం 45 బెడ్లు ఏర్పాటు చేసినట్లు ఆరోగ్య శాఖ ప్రకటనలో తెలిపింది.

New Update
isolation center

isolation center Photograph: (isolation center)

చైనాలో కలకలం సృష్టిస్తున్న హ్యూమన్​ మెటా న్యుమో వైరస్​ భారత్​ లోకి విస్తరించింది. సోమవారం ఏకంగా 2 రోజుల వ్యవధిలోనే 7 కేసులు నమోదైయ్యాయి. గుజరాత్‌లో 1, కర్ణాటక, మహారాష్ట్ర నాగ్‌పూర్, తమిళనాడుల్లో రెండేసి హెచ్​ఎంపీవీ టెస్టుల్లో పాజిటీవ్ వచ్చింది. దీంతో గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. గాంధీనగర్, అహ్మదాబాద్, రాజ్‌కోట్ ఆసుపత్రుల్లో ఐసోలేషన్ వార్డులను ఏర్పాటు చేసినట్లు అధికారులు మంగళవారం తెలిపారు.

Also Read :  రోడ్డు ప్రమాద బాధితులకు కొత్త పథకం–నితిన్ గడ్కరీ

రెండు వారాల క్రితం అహ్మదాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరిన 2 నెలల బాబుకు HMPV అని సోమవారం తేలింది. గుజరాత్ ఆరోగ్య శాఖ HMPV కేసులను ఎదుర్కోవడానికి సిద్దమవుతోంది. 3 ప్రధాన ఆసుపత్రుల్లో ఐసోలేషన్ వార్డులను ఏర్పాటు చేశారు. ఒక్కో హాస్పిటల్లో 15 బెడ్లుతో మొత్తం 45 ఐసోలేషన్ సెంటర్లును ఏర్పాటు చేసినట్లు ఆరోగ్య శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.

Also Read: America: భీక‌ర‌ మంచు తుఫాన్ తో వణుకుతున్న అమెరికా..7 రాష్ట్రాల్లో ఎమర్జెన్సీ!

హెచ్‌ఎంపీ వైరస్‌ను త్వరగా గుర్తించేందుకు ఈ ఆసుపత్రులకు అదనపు టెస్టింగ్ కిట్‌లను సేకరించి, పంపిణీ చేయనున్నట్లు ఆ శాఖ తెలిపింది. ఆరోగ్య శాఖ మంత్రి రుషికేష్ పటేల్ సోమవారం మాట్లాడుతూ.. జనవరి 4న సమావేశం ఏర్పాటు చేసి వైరస్‌కు సంబంధించిన విషయాలపై ఫుల్ అలర్ట్ గా ఉండాలని జిల్లా ఆరోగ్య అధికారులు, సివిల్ సర్జన్లు, ఉప జిల్లా ఆసుపత్రుల సూపరింటెండెంట్‌లను ఆదేశించారు. సోమవారం ఆరోగ్య శాఖ అన్ని ప్రభుత్వ ఆసుపత్రులలో HMPV కేసులకు ట్రీట్మెంట్ చేయడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ ఒక సర్క్యులర్ జారీ చేసింది. 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు