/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/WINES-jpg.webp)
Gujarat police Rs. 2 crore Foreign liquor seized
Alcohol: గుజరాత్‌లో(Gujarat) కఠినమైన మద్య నిషేధ చట్టం(Liquor Prohibition Act) అమలులో ఉంది. అయినప్పటికీ అక్రమ మద్యం వ్యాపారం ఆగడం లేదు. రాష్ట్రంలోని చోటా ఉదయపూర్ జిల్లాలో జరిగిన ఒక ప్రధాన ఆపరేషన్‌లో పోలీసులు, ఎక్సైజ్ శాఖ కోట్ల రూపాయల విలువైన అక్రమ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. అదంతా ఫారిన్ సరుకుగా గుర్తించారు.
Also Read: విమానంలో మహిళలతో యువకుడి అసభ్య ప్రవర్తన.. దిగగానే ట్విస్ట్ ఇచ్చిన పోలీసులు!
గుజరాత్‌లో పూర్తి మద్య నిషేధం..
ఈ మేరకు ఉదయపైర్ పోలీసుల సమాచారం ప్రకారం.. చోటా ఉదయపూర్ జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. మొత్తం రూ. 2 కోట్ల 40 లక్షల 34 వేల 461 విలువైన అక్రమ ఫారిన్ సరుకుగా గుర్తించారు. ఈ మద్యాన్ని స్థానిక అధికారులు, పోలీసుల సమక్షంలో ధ్వంసం చేశారు. గుజరాత్‌లో పూర్తి మద్య నిషేధం అమలులో ఉందని, కానీ పొరుగు రాష్ట్రాల నుండి మద్యం అక్రమంగా రవాణా చేయబడి ఇక్కడ సరఫరా చేస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా అక్రమంగా మద్యం తీసుకువచ్చే, విక్రయించే లేదా నిల్వ చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ గుజరాత్‌లో అక్రమ మద్యం వ్యాపారం కొనసాగించడానికి అనుమతించబోమని పోలీసులు వార్నింగ్ ఇచ్చారు.
Also Read: భార్య అలా బెదిరించినా విడాకులు తీసుకోవచ్చు: హైకోర్టు
/rtv/media/media_files/2025/03/28/4W9Vo74qu9jEUh3hr8Vc.jpg)
Also read: BIG BREAKING: అన్నంలో విషం కలిపిపెట్టిన తల్లి.. నిద్రలోనే ముగ్గురు చిన్నారులు మృతి
ఇదిలా ఉంటే.. భార్యను హత్య చేసి, మృతదేహాన్ని సూట్‌కేస్‌లో పెట్టి భర్త పారిపోయాడు. అనంతరం అత్తమామలకు ఫోన్ చేసి జరిగిన విషయాన్ని చెప్పుకొచ్చాడు. ఈ విషాద ఘటన బెంగళూరులో చోటుచేసుకుంది. పూణేకు చెందిన రాకేష్ (32) హిటాచీలో ప్రాజెక్ట్ మేనేజర్‌గా పని చేస్తున్నాడు. భర్య గౌరీ సాంబేకర్ మాస్ మీడియా అండ్ కమ్యూనికేషన్‌లో పని చేస్తోంది. మహారాష్ట్రకు చెందిన ఈ జంట గత 2 నెలలుగా కర్ణాటకలోని హులిమావు పోలీస్ స్టేషన్ పరిధిలో దొడ్డకన్నహళ్లిలో నివసిస్తున్నారు. మార్చి 26న భార్యాభర్తల మధ్య వాగ్వాదం జరిగింది. గొడవ పెద్దదై ఆవేశానికి గురైన రాకేష్.. గౌరి కడుపులో కత్తితో పొడిచాడు. తర్వాత ఆమె గొంతు కోశాడు. భార్య మృతదేహాన్ని సూట్‌కేస్‌లో పెట్టి రాకేష్ పూణేకు పారిపోయాడు.
Also read: AIDS with drugs: కొంపముంచిన డ్రగ్స్ అలవాటు.. ఒకేసారి 10 మంది ఎయిడ్స్
liquor | seized | gujarath | telugu-news | today telugu news