/rtv/media/media_files/2025/01/23/efcAIFLfma5qHE6Ri2VJ.jpg)
Guillain Barre syndrome Photograph: (Guillain Barre syndrome)
Guillain Barre syndrome: మహారాష్ట్రలో గులియన్ బారే సిండ్రోమ్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. తాజాగా రాష్ట్రంలో బుధవారం 5 కొత్త కేసులు నమోదైనట్లు అధికారులు తెలిపారు. దీంతో నిన్నటి వరకూ 167గా ఉన్న జీబీఎస్ కేసులు 172కి పెరిగాయి. మహారాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారుల ప్రకారం.. 172 కేసుల్లో.. పూణే మున్సిపల్ కార్పొరేషన్ (PMC) పరిధిలో 40, ఇతర గ్రామాల నుంచి 92, పింప్రి చించ్వాడ్ మున్సిపల్ కార్పొరేషన్ (PCMC) నుంచి 29, పూణే రూరల్ ఏరియాలో 28, ఇతర జిల్లాల నుంచి 8 కేసులు రికార్డయ్యాయి. ఇప్పటి వకూ 104 మంది రోగులు ఆసుపత్రి నుంచి డిశ్యార్జ్ అయ్యారు. ప్రస్తుతం 50 మంది రోగులు ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో చికిత్స పొందుతున్నారు. ఇంకో 20 మంది వెంటిలేటర్లపై ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఇప్పటి వరకూ 172 కేసులు నిర్ధరణ కాగా.. ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. తాజాగా ఈ వైరస్ కారణంగా మరో మరణం నమోదైంది. దీంతో ఈ వైరస్ కారణంగా మరణించిన వారి సంఖ్య 8కి పెరిగింది.
ఇది కూడా చదవండి: india vs england: భారత్ ఘన విజయం.. ఇంగ్లండ్ చిత్తు చిత్తు
గులియన్ బారే సిండ్రోమ్ కారణంగా ముంబైలో తొలి మరణం నమోదైనట్లు అధికారులు తెలిపారు. వాడాలా ప్రాంతానికి చెందిన 53 ఏళ్ల వ్యక్తి జీబీఎస్ కారణంగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం మరణించారు. అడికి వైరస్ సోకినట్లు జనవరి 23న నిర్ధారణ అయ్యింది. ఆసుపత్రిలో వార్డు బాయ్‌గా పనిచేస్తున్న అతడికి ఐసీయూలో చికిత్స అందించారు. అయితే శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కారణంగా వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందించినట్లు అధికారులు తెలిపారు.
ఇది కూడా చదవండి: BIG BREAKING: తెలంగాణలో మళ్లీ కులగణన.. రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయం
జీబీఎస్ బారినపడిన వ్యక్తిలో ఇమ్యూనిటీ సిస్టమ్ దాడి చేయడంవల్ల నాడీ వ్యవస్థ క్రమంగా నిర్వీర్యం చేస్తుంది. దాంతో కాళ్లు మొదలు ఒంట్లోని ఒక్కో భాగం కదలికలేకుండా పోతుంది. కండరాలు బలహీనమవుతాయి. దాంతో భరించలేని నొప్పి కలుగుతుంది. విపరీతమైన నిస్సత్తువ ఏర్పడుతుంది. ఈ సిండ్రోమ్ పెద్దవాళ్లలో, ముఖ్యంగా పురుషుల్లో ఎక్కువగా సంక్రమిస్తుంది. జీబీఎస్ తాలూకూ అత్యంత ప్రధాన లక్షణం విపరీతమైన నీరసమని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూరోలాజికల్ డిజార్డర్స్ అండ్ స్ట్రోక్స్ వెల్లడించింది. తర్వాతి దశలో శ్వాసప్రక్రియను నియంత్రించే కండరాలు బాగా బలహీనపడతాయి. ఈ లక్షణాలు తలెత్తిన రెండే రెండు వారాల్లో సమస్య బాగా ముదిరి రోగిని కదల్లేని స్థితికి చేరుస్తుంది. నరాలు బాగా దెబ్బ తింటాయి కాబట్టి నరాల వ్యవస్థ నుంచి మెదడుకు అస్తవ్యస్త సంకేతాలు అందుతుంటాయి. దాంతో చర్మంలోపల పురుగులు పాకుతున్నట్టు చెప్పలేని బాధ కలుగుతుంది. దవడలు నొప్పిగా మారుతాయి. మాట్లాడటం, నమలడం, మింగడం ఇబ్బందిగా ఉంటుంది. హృదయ స్పందనలో, రక్తపోటులో తేడాలు వస్తాయి. జీర్ణశక్తి మందగిస్తుంది.