/rtv/media/media_files/2026/05/03/ambulance-2026-05-03-18-33-31.jpg)
Good Samaritan from Jaipur has turned his CAR into ambulance, saved many lives
రాజస్థాన్‌లోని జైపుర్‌కు చెందిన టాక్స్ కన్సల్టెంట్ సందీప్ గుప్తా.. రోడ్డు ప్రమాద బాధితులకు అండగా నిలుస్తున్నారు. దాదాపు 22 ఏళ్ల క్రితం కళ్లముందే ఓ వ్యక్తి అంబులెన్స్ రాక ప్రాణాలు కోల్పోవడం చూసి సందీప్ తట్టుకోలేకపోయాడు. దీంతో ఆ చేదు అనుభవమే ఆయన జీవితంలో మార్పును తీసుకొచ్చింది. సరైన సమయంలో వైద్యం అందక ఎవరూ మరణించకూడదని ఆయన భావించారు. అందుకే తన సొంత కారునే ఒక మినీ అంబులెన్సుగా మార్చేశాడు. ప్రమాదంలో ఉన్నవారిని సకాలంలో ఆస్పత్రికి తరలిస్తూ ప్రాణాలు కాపాడుతున్నారు.
సందీప్ గుప్తా తన కారులో ఎల్లప్పుడూ అత్యవసర వైద్య పరికరాలు, ప్రథమ చికిత్స సామగ్రిని రెడీగా ఉంచుతారు. ఎమర్జెన్సీ సమయంలో ట్రాఫిక్‌ను దాటుకుని వెళ్లడం కోసం తన వాహనానికి సైరన్ కూడా ఏర్పాటు చేశారు. ఒకవేళ తాను వెళ్తున్న దారిలో ఏదైనా ప్రమాదం జరిగితే.. ఏమాత్రం ఆలస్యం చేయకుండా బాధితులను తన కారులో ఎక్కించుకుని ఆస్పత్రికి తీసుకెళ్తారు. ఇలా ఇప్పటిదాకా 120 మందికి పైగా క్షతగాత్రులను ప్రాణాల నుంచి కాపాడారు.
Also Read: నేడే 'నీట్-యూజీ 2026'... అభ్యర్థులు ఈ నిబంధనలు పాటించాల్సిందే
సందీప్ గుప్తా చేస్తున్న ఈ మానవత్వ సేవను ట్రాఫిక్ పోలీసులు కూడా గుర్తించారు. ఆయన ప్రయాణానికి వాళ్లు కూడా పూర్తి సహకారం అందిస్తున్నారు. మాజీ రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ లాంటి ప్రముఖులతో పాటు అనేక ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల నుంచి ఆయనకు ప్రశంసలు, పురస్కారాలు అందాయి. అవార్డుల కన్నా కూడా ఆపదలో ఉన్నవాళ్లకు ప్రాణదానం చేయడంలోనే తనకు సంతృప్తి ఉందని సందీప్ గుప్తా చెబుతున్నారు.
Follow Us