నిరుద్యోగ యువతకు గుడ్‌న్యూస్‌.. ప్రధాన మంత్రి ఇంటర్న్‌షిప్ పథకం ప్రారంభం

దేశంలోని నిరుద్యోగ యువతకు కేంద్రం గుడ్‌న్యూస్ చెప్పింది. ఉపాధి అవకాశాలు పెంచడం, పరిశ్రమల్లో ప్రాక్టికల్ ఎక్స్‌పీరియన్స్‌ అందించే లక్ష్యంతో ''ప్రధాన మంత్రి ఇంటర్న్‌షిప్ పథకం 2026'' ప్రారంభించింది.

New Update
prime minister internship scheme launched

prime minister internship scheme launched

దేశంలోని నిరుద్యోగ యువతకు కేంద్రం గుడ్‌న్యూస్ చెప్పింది. ఉపాధి అవకాశాలు పెంచడం, పరిశ్రమల్లో ప్రాక్టికల్ ఎక్స్‌పీరియన్స్‌ అందించే లక్ష్యంతో ''ప్రధాన మంత్రి ఇంటర్న్‌షిప్ పథకం 2026'' ప్రారంభించింది. కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, యువజన సర్వీసులు, క్రీడల మంత్రిత్వ శాఖ కలిసి ఏప్రిల్ 24న ఈ స్కీమ్‌ను లాంచ్ చేశాయి. వివిధ రంగాలు, వృత్తుల్లో యువతకు ప్రపంచ వ్యాపార వాతావరణంపై అవగాహన కల్పించడమే ఈ పథకం లక్ష్యం. 

అర్హతలు
విద్య: 10వ తరగతి, ఇంటర్, ITI, డిప్లొమాతో పాటు డిగ్రీ లేదా పీజీ పూర్తి చేసిన ఎవరైనా అప్లై చేసుకోవచ్చు.
వయస్సు: 18 నుంచ్ 25 ఏళ్ల మధ్య ఉండాలి
స్థితి: ప్రస్తుతం చదువుకుంటున్న వాళ్లు లేదా ఎక్కడైనా ఉద్యోగం చేస్తున్న వారు దీనికి అనర్హులు.

Also Read: కవిత కొత్త పార్టీపై బీఆర్‌ఎస్‌ ట్రోలింగ్.. 'ఒరిజినల్ ఎప్పటికీ ఒరిజినలే' అంటూ సెటైర్లు

ఆర్థిక ప్రయోజనాలు
ఈ స్కీమ్ కింద ఎంపికైన వాళ్లకి ప్రభుత్వం, సదరు కంపెనీలు కలిసి ఆర్థికంగా అండగా ఉంటాయి.
 ప్రతి నెలా రూ.9,000 స్టైఫండ్ అందుతుంది.
జాయినింగ్ గ్రాంట్: ఇంటర్న్‌షిప్‌లో చేరిన వెంటనే ముందుగా రూ. 6,000 ప్రోత్సాహకంగా అందిస్తారు.
ఈ శిక్షణ 6 నుంచి 9 నెలల పాటు ఉంటుంది.

తెలంగాణలో అవకాశాలు 
తెలంగాణలోని హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి, సంగారెడ్డి, యాదాద్రి, పెద్దపల్లి వంటి జిల్లాల్లో భారీగా అవకాశాలు ఉన్నాయి. ఇక్కడి జిల్లాల్లోని యువత ఈ స్కీమ్ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు. ఆసక్తి గల యువతmybharat.gov.in పోర్టల్‌లో రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. తమ విద్యార్హతకు తగిన 'రోల్', ప్రాంతాన్ని ఎంచుకుని ఆన్‌లైన్‌లోనే దరఖాస్తు చేయాలి. పూర్తి వివరాల కోసంpminternship.mca.gov.inవెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.

Also Read: కవిత కొత్త పార్టీ TRSగా నామకరణం.. అయిదు కీలక హామీలు

Advertisment
తాజా కథనాలు