దారుణం.. 30 మంది బాలికలపై మూడేళ్లుగా అత్యాచారం..

గోవాలో దారుణం జరిగింది. బీజేపీ కార్పొరేటర్ కొడుకు సుమారు 30 బాలికలను మూడేళ్లుగా రేప్ చేయడం కలకలం రేపుతోంది. వీడియోలు రికార్డు చేసి వాళ్లని బ్లాక్‌ చేయడం దుమారం రేపింది.

New Update
Goa Bjp Corporators Son Arrested For Rape Abusing Blackmailing Over 25 Girls

Goa Bjp Corporators Son Arrested For Rape Abusing Blackmailing Over 25 Girls

గోవాలో దారుణం జరిగింది. బీజేపీ కార్పొరేటర్ కొడుకు సుమారు 30 బాలికలను మూడేళ్లుగా రేప్ చేయడం కలకలం రేపుతోంది. వీడియోలు రికార్డు చేసి వాళ్లని బ్లాక్‌ చేయడం దుమారం రేపింది. ఈ విషయం బయటికి రావడంతో స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సమాచారం మేరకు పోలీసులు అతడిని అరెస్టు చేశారు. ఇక వివరాల్లోకి వెళ్తే.. గోవాలో బీజేపీ కార్పొరేటర్ సుశాంత్ నాయక్‌ కొడుకు సోహమ్ (22) సుమారు 30 మంది బాలికలను లైంగికంగా వేధించాడు. 

Also Read: క్లాస్‌రూంలో విద్యార్థినికి 'ఐ లవ్‌ యూ చెప్పిన' ప్రొఫెసర్‌.. చెప్పుతో కొట్టిన స్టూడెంట్

గత మూడేళ్ల నుంచి వాళ్లపై అత్యాచారాలు చేస్తూ వచ్చాడు. ఆ వీడియోలు రికార్డు చేసి వాళ్లను బ్లాక్‌మెయిల్‌ చేశాడు. ఎవరికైనా చెబితే ఆన్‌లైన్‌లో షేర్ చేస్తానంటూ బెదిరించాడు.  అయితే మార్చి 22న ఆదివారం రాత్రి సోహమ్ తన స్నేహితులతో కలిసి మద్యం సేవించాడు. తాను బాలికలతో చేసిన లైంగిక చర్యల వీడియోలను వాళ్లకి చూపించాడు. దీంతో ఈ విషయం బయటపడటంతో స్థానికులు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. 

Also Read: పెట్రోల్, డీజిల్ కొరతపై కేంద్రం సంచలన ప్రకటన

పోలీసులకు ఫిర్యాదు చేశారు. సోహామ్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీంతో పోలీసులు అతడిని అరెస్టు చేశారు. ప్రస్తుతం అతడిపై విచారణ జరుగుతోందని తెలిపారు. నిందితుడిపై చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు. బాధిత బాలికలను గుర్తించి వాంగ్మూలం రికార్డు చేస్తామన్నారు. అలాగే బాధిత బాలికలకు గోప్యత, భద్రత ఉంటుందని తెలిపారు

Advertisment
తాజా కథనాలు