దేశంలో ఉగ్రవాదులకు పాస్ పోర్టులు, ఆధార్‌లు.. వెలుగులోకి సంచలన నిజాలు

దేశంలో మరో భారీ ఉగ్ర నెట్‌వర్క్‌ బట్టబయలైంది. టెర్రరిస్టులకు పాస్‌పార్టులు, ఆధార్‌, ఓటరు, పాన్‌ కార్డు తదితర ఫేక్ గుర్తింపు కార్డులును అందిస్తున్న ముఠాను జమ్మూకశ్మీర్‌ పోలీసులు ఛేదించారు.

New Update
From fake PAN cards to forged passports Jammu and kashmir police unravels LeT’s pan-India logistical web

From fake PAN cards to forged passports Jammu and kashmir police unravels LeT’s pan-India logistical web

దేశంలో మరో భారీ ఉగ్ర నెట్‌వర్క్‌ బట్టబయలైంది. టెర్రరిస్టులకు పాస్‌పార్టులు, ఆధార్‌, ఓటరు, పాన్‌ కార్డు తదితర ఫేక్ గుర్తింపు కార్డులను అందిస్తున్న ముఠా గుట్టును జమ్మూకశ్మీర్‌ పోలీసులు రట్టు చేశారు. ఉగ్ర సంస్థ అయిన లష్కరే తయ్యిబాతో లింక్స్‌ ఉన్న ఈ ముఠా కార్యకలాపాలు వివిధ రాష్ట్రాల్లో ఉన్నాయని అధికారులు వెల్లడించారు. ఏప్రిల్ 31 నుంచి కేంద్ర నిఘా సంస్థలు, జమ్మూకశ్మీర్‌ పోలీసులు కలిసి నిర్వహించిన ఈ ఆపరేషన్‌లో హర్యానా, రాజస్థాన్‌లో అయిదుగురిని అరెస్టు చేశారు. 

Also read: మాజీ జవాన్ చదువుల యుద్ధం.. 138 డిగ్రీలతో ప్రపంచ రికార్డులు!

2012 తర్వాత భారత్‌లోకి వచ్చిన పాక్ ఉగ్రవాది ఉమర్ అలియాస్ ఖర్గోగ్‌ 2024లో రాజస్థాన్‌లో జైపూర్‌లోని ఫేక్ పాస్‌పార్టు పొందినట్లు అధికారులు వెల్లడించారు. ఈ పాస్‌పోర్టుతో ఇండోనేషియాకు పారిపోయి అక్కడి నుంచి మరో ఫేక్ గుర్తింపు కార్డుతో గల్ఫ్ దేశాలకు పారిపోయినట్లు తెలిపారు. అయితే 16 ఏళ్ల పాటు పరారీలో ఉన్న పాకిస్థాన్ ఉగ్రవాది అబ్దుల్లా, మరో పాకిస్థాన్ జాతీయుడు ఉస్మాన్ అలియాస్ ఖుబైబ్‌ను పోలీసులు అరెస్టు చేశారు.  

Also Read: బిహార్ భవిష్యత్ CM తేలనుంది ఆరోజే.. కొత్త ముఖ్యమంత్రిగా ఆయన పేరు!

వీళ్లను విచారించగా ఈ ఉగ్రవాద నెట్‌వర్క్‌ గురించి తెలుసినట్లు పోలీసులు తెలిపారు. శ్రీనగర్‌కు చెందిన మహమ్మద్ నఖీబ్ భట్‌, అదిల్ రషీద్‌ భట్‌, గులాం మహమ్మద్‌లు అరెస్టయిన వాళ్లలో ఉన్నట్లు తెలిపారు. వీళ్లు విదేశీ ఉగ్రవాదులకు ఆహారం, ఆశ్రయం, సాయం అందించినట్లు పేర్కొన్నారు. అయితే ఈ ఆపరేషన్‌లో ఉగ్ర స్థావరాల నుంచి మూడు ఏకే 47 తుపాకులతో పాటు వివిధ ఆయుధాలని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు స్పష్టం చేశారు.   

Advertisment
తాజా కథనాలు