BNSL నుంచి ఫ్రీ OTT : 300 ఛానల్స్, మూవీస్, వెబ్ సిరీస్ ఎంజాయ్

BSNL నెట్ వర్క్ Bi TV అనే మొబైల్ యాప్‌ను లాంచ్ చేసింది. దీని ద్వారా 300 ఛానల్స్‌ను ఉచితంగా యాప్ వినియోగదారులకు అందించనుంది. బీఎస్ఎన్ఎల్ BiTV అందుబాటులోకి వస్తే డీటీహెచ్‌లకు రీఛార్జ్ చేసుకునే పని అవసరం లేదు.

New Update
BSNL OTT

BSNL OTT Photograph: (BSNL OTT)

మొబైల్ యూజర్లకు బీఎస్ఎన్ఎల్ గుడ్‌న్యూస్ చెప్పింది. ప్రస్తుతం ఓటీటీలకు ప్రాధాత్యత పెరిగి టీవీలు చూస్తున్నవారి సంఖ్య తగ్గుతోంది. కేంద్ర ప్రభుత్వం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్  ఓ సరికొత్త ఆలోచనతో ముందుకు వచ్చింది. Bi TV అనే మొబైల్ యాప్‌ను లాంచ్ చేసింది. ఇండియా మొబైల్ కాంగ్రెస్ (IMC) 2024 సందర్భంగా ఆవిష్కరించబడిన BSNL ఏడు కొత్త సర్వీస్ల్‌ల్లో BiTV కూడా ఒకటి.  దీని ద్వారా 300 ఛానల్స్‌ను ఉచితంగా యాప్ వినియోగదారులకు అందించనుంది. బీఎస్ఎన్ఎల్ BiTV అందుబాటులోకి వస్తే డీటీహెచ్‌లకు రీఛార్జ్ చేసుకునే పని అవసరం లేదు. ఫ్రీగా 300 టీవీ ఛానల్స్, వెబ్ సిరీస్, మూవీస్ ఎంజాయ్ చేయవచ్చు.

ఇది కూడా చదవండి: Kohli: విరాట్‌ను అవమానించిన ఆసీస్ మీడియా.. ఆ పేరుతో హెడ్ లైన్స్!

సెంట్రల్ గవర్నమెంట్ నెట్‌వర్క్ నుంచి 300 ఛానల్స్‌తో ఫ్రీ ఓటీటీ వస్తోందంటే బీఎస్ఎన్ఎల్ కస్టమర్ల సంఖ్య భారీగా  పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే BiTV సర్వీస్ పుదుచ్చేరిలో ప్రారంభించబడింది. త్వరలోనే దేశ మొత్తం ఈ ఫ్రీ ఓటీటీను తీసుకురానున్నట్లు అఫీషియల్ ఎక్స్ హ్యాండీల్‌లో ప్రకటించింది. టీవీ లైవ్ ఛానల్స్, సినిమాలు, వెబ్ సిరీస్ వంటివి ఫ్రీగా చూడవచ్చు. 300 ఛానల్స్ ఇందులో స్ట్రీమింగ్ అవుతుంటాయి. బీఎస్ఎన్ఎల్ సిమ్ వినియోగిస్తున్నవారు BiTV యాప్‌ను ప్లే స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. డైరెక్ట్ టూ మొబైల్ సర్వీస్ మోడల్‌లో ఈ ఫ్రీ ఓటీటీ ప్రసారం చేయనున్నారు. 
ఈ సర్వీస్‌లో DTH ప్రొవైడర్లకు BSNL గట్టి పోటీ ఇవ్వనుంది.  వీటిలో ఫైబర్ బేసడ్ ఇంట్రానెట్ కూడా ప్రారంభించిన విషయం తెలిసిందే.

ఇది కూడా చదవండి : టెట్ అభ్యర్థులకు అలర్ట్.. పరీక్షపై కీలక అప్‌డేట్!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

ED raids : ఎంపురాన్ చిత్ర నిర్మాతకు షాక్‌...ఈడీచేతికి చిక్కిన రూ.1.5 కోట్లు

ఎంపురాన్‌తో వివాదం నెలకొన్న సమయంలో మరో కీలక పరిణామం చోటు చేసుుంది. ఎంపురాన్ చిత్ర నిర్మాతల్లో ఒకరైన గోకులం గోపాలన్ కార్యాలయంపై ఈడీదాడులు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.తమిళనాడు, కేరళలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) సోదాలు చేపట్టింది.

New Update
ED seizes ₹1.5 crore in raids

ED seizes ₹1.5 crore in raids

ED raids  : ఎంపురాన్‌తో వివాదం నెలకొన్న సమయంలో మరో కీలక పరిణామం చోటు చేసుుంది. ఎంపురాన్ చిత్ర నిర్మాతల్లో ఒకరైన గోకులం గోపాలన్ కార్యాలయంపై ఈడీదాడులు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.తమిళనాడు, కేరళలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) సోదాలు చేపట్టింది. L2-ఎంపురాన్ చిత్ర నిర్మాత గోకులం గోపాలన్ అలియాస్ ఏఎం గోపాలన్ కు చెందిన కంపెనీలో అధికారులు తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో కోటిన్నర రూపాయలను స్వాధీనం చేసుకుంది. ఆయనకు చెందిన  శ్రీ గోపాలన్ చిట్ అండ్ ఫైనాన్స్ కో లిమిటెడ్ (గోకుల్ చిట్ ఫండ్ ఆర్థికఅవకతవలు జరిగాయన్న ఆరోపణలపై.. ఫెమా చట్టం కింద ఈడీ కేసు నమోదు చేసింది.  ఈడీ అధికారులు కేరళ, తమిళనాడులోని గోపాలన్  ఆస్తుల వద్ద రెండు రోజులు తనిఖీలు నిర్వహించారు. 

Also Read: మావోయిస్టు పార్టీకి బిగ్ షాక్....4 నెలల్లో 224 మంది సరెండర్

కార్యాలయాల్లో సోదాలు నిర్వహించిన ఈడీ రూ.1.5 కోట్ల నగదు స్వాధీనం చేసుకుంది. ఈ కంపెనీలకు గోకులం గోపాలన్ అలియాస్ ఏఎం గోపాలన్ యాజమానిగా ఉన్నారు. విదేశీ మారక ద్రవ్య నిర్వహణ చట్టం (FEMA) కింద రూ.1,000 కోట్ల విలువైన స్కాం దర్యాప్తులో భాగంగా ఈ సోదాలు జరుగుతున్నాయి. ఏఎం గోపాలన్ సంస్థ తమిళనాడు, కేరళ, తెలంగాణ, పుదుచ్చేరి, మహారాష్ట్ర, న్యూఢిల్లీ, ఆంధ్రప్రదేశ్, హర్యానాతో సహా అనేక రాష్ట్రాల్లో బ్రాంచెస్ ఉన్నాయి. మరోవైపు, గోకుల్ చిట్స్ లో తనిఖీలు ఇదేం మొదటిసారి కాదు. ఏప్రిల్ 2017లో ఆదాయపు పన్ను శాఖ మూడు రాష్ట్రాల్లోని గోకుల్ చిట్స్ ప్రాంగణంలో సోదాలు చేపట్టింది. పన్ను ఎగవేత కేసులో భాగంగా సోదాలు చేపట్టింది. ఐదేళ్లలో రూ. 1,107 కోట్లను వెల్లడించకపోవడం ద్వారా పెద్ద మొత్తంలో పన్నులు చెల్లించకుండా ఉండవచ్చని ఆ సమయంలో అధికార వర్గాలు తెలిపాయి.

Also Read: జెలెన్‌స్కీ నగరంపై రష్యా దాడి.. 18 మంది మృతి

   అయితే L2 ఎంపురాన్  చిత్రాన్ని తెరకెక్కించడం వల్లే గోపాలన్ పై అక్రమకేసులు పెట్టి కేంద్రం వేధిస్తోందని కేరళ అధికార పార్టీ LDFతో పాటు UDF ఆరోపిస్తున్నాయి. కేరళ సాంస్కృతిక రంగం, కళాత్మక స్వేచ్ఛతో పాటు భావ ప్రకటన స్వేచ్ఛపై బీజేపీ దాడి చేస్తోందని దుయ్యబట్టాయి. కాగా L2 ఎంపురాన్  చిత్రంలో గుజరాత్  అల్లర్లకు సంబంధించిన సన్నివేశాలు ఉండటంపై వివాదాలు చెలరేగాయి. చిత్రంపై బీజేపీ, ఆరెస్సెస్  వంటి సంస్థలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తుండగా చిత్రబృందం ఇప్పటికే క్షమాపణలు చెప్పింది. రాజకీయ వివాదాలకు సంబంధించిన సన్నివేశాలు తొలగిస్తామని స్పష్టం చేసింది. ఐతే కేరళ సీఎం పినరయి విజయన్  సహా చాలామంది విపక్ష నేతలు సినిమాకు మద్దతుగా నిలిచారు.

ఇది కూడా చూడండి: Earthquake: మరోసారి భూకంపం.. బయటకు పరుగులు తీసిన ప్రజలు- ఈసారి ఎక్కడంటే?

Advertisment
Advertisment
Advertisment