/rtv/media/media_files/2026/04/18/delhi-mumbai-joint-raid-foils-toy-car-ied-terror-plot-2026-04-18-18-34-31.jpg)
Delhi–Mumbai joint raid foils toy car IED terror plot
Terror suspects arrested : దేశంలోని పలు సున్నితమైన ప్రాంతాల్లో భారీ పేలుళ్లు జరిపేందుకు సిద్ధపడి రెక్కీలు నిర్వహించడంతో పాటు ఆన్‌లైన్ ఫ్లాట్‌ఫాంల ద్వారా మరికొంతమందిని రిక్రూట్ చేసేందుకు ప్లాన్ చేస్తున్న నలుగురు అనుమానితులను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేయడం సంచలనంగా మారింది.
దేశ రాజధాని ఢిల్లీలో భారీ ఉగ్రవాద కుట్రను పోలీసులు భగ్నం చేశారు. బొమ్మ కార్లలో బాంబులు పెట్టి పేల్చాలని వీరు ప్లాన్ చేశారు. ఢిల్లీ పోలీసుల ప్రత్యేక విభాగం ఈ ఉగ్రవాదులను చాకచక్యంగా పట్టుకుంది. నిందితులు జైషే మహమ్మద్, ఐసిస్ సంస్థలతో సంబంధాలు కలిగి ఉన్నారు. వీరు రద్దీగా ఉండే ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేయాలనుకున్నారు. పోలీసులు వీరి వద్ద నుండి ఎలక్ట్రానిక్ పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. ముంబై పోలీసుల సహకారంతో ఢిల్లీ పోలీసులు ఈ ఆపరేషన్ నిర్వహించారు. నిందితులు ఆన్‌లైన్ ద్వారా తీవ్రవాద భావజాలానికి ఆకర్షితులైనట్లు సమాచారం ఉంది. విచారణలో మరిన్ని షాకింగ్ నిజాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతానికి ఢిల్లీలో భద్రతా దళాలు హై అలర్ట్ ప్రకటించాయి. కాగా నిందితులలో మోసైబ్ అహ్మద్, హహమ్మద్ హమాద్‌లను మహారాష్ట్రలో, షేక్ ఇమ్రాన్ అనే వ్యక్తిని ఒడిశాలో, మహమ్మద్ సోహైల్‌ను బిహార్‌లో పోలీసులు అరెస్టు చేశారు. వీరిలో ఇద్దరిని ఐఈడీ అమర్చిన రిమోట్ కంట్రోల్ బొమ్మ కారు తయారీకి యత్నిస్తుండగా పట్టుకున్నట్లు వెల్లడించారు.
వీరంతా తీవ్రవాద భావజాలంతో ప్రభావితమైనట్టు అధికారులు గుర్తించారు. నిందితులలో ఒకడు ఎర్రకోటను లక్ష్యంగా చేసుకున్నామని తెలిపే సంకేతంతో నల్లజెండాతో కూడిన ఎర్రకోట మార్ఫింగ్ ఫోటోను షేర్ చేసినట్టు పోలీసులు గుర్తించారు. దీనికోసం నిందితుల్లో ఒకడైన షేక్ ఇమ్రాన్ 2025లో ఎర్రకోట, ఇండియా గేట్ సహా కీలక ప్రదేశాల్లో రెక్కీ నిర్వహించినట్టు గుర్తించారు. మోసైబ్ గతంలో గల్ఫ్ దేశాల్లో ఆటో ఎలక్ట్రీషియన్‌గా పనిచేశాడని, ఐఈడీ అమర్చిన రిమోట్ కంట్రోల్ కారు డిజైన్‌కు అవసరమైన సాంకేతిక నైపుణ్యం అతనికి ఉందని గుర్తించినట్లు పోలీసులు వివరించారు. ఈ నలుగురిపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుల నెట్‌వర్క్ ఛేదించేందుకు, ఇతర ముఠాలతో సంబంధాలను గుర్తించేందుకు దర్యాప్తు చేపట్టారు.
ఉగ్రవాదులు తమ దాడుల కోసం వినూత్నమైన పద్ధతులను ఎంచుకుంటున్నారు. తనిఖీల్లో దొరకకుండా ఉండేందుకు రిమోట్ కంట్రోల్ బొమ్మలను వాడుతున్నారు. ఈ పద్ధతి ద్వారా జనసమూహంలోకి బాంబులను పంపడం చాలా సులభం. పోలీసులు నిందితులను రహస్య ప్రాంతంలో ఉంచి విచారణను వేగవంతం చేశారు. వీరి వెనుక ఉన్న ప్రధాన సూత్రధారుల కోసం గాలింపు చేపట్టారు. దేశ సరిహద్దుల అవతల నుండి వీరికి ఆదేశాలు అందుతున్నాయి. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచనలు జారీ చేశారు. అనుమానాస్పద వస్తువులు కనిపిస్తే వెంటనే సమాచారం అందించాలని కోరారు. ఉగ్రవాద వ్యతిరేక దళాలు దిల్లీ వ్యాప్తంగా సోదాలు నిర్వహిస్తున్నాయి. దేశ భద్రత దృష్ట్యా ఈ అరెస్టులు అత్యంత కీలకంగా మారాయి.
Follow Us