Wife Attacks Husband: పోలీసుస్టేషన్‌ లోనే భర్త ముఖం పగలకొట్టిన ఇంటర్నేషనల్‌ బాక్సింగ్‌ ఛాంపియన్!

మాజీ ప్రపంచ ఛాంపియన్ బాక్సర్ సావిటీ బూరా తన భర్త, ప్రముఖ కబడ్డీ ఆటగాడు దీపక్ నివాస్ హూడాపై దాడి చేశారు. వీరిద్దరూ త్వరలోనే విడాకులు తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఆమె ఇలా చేయడంతో పాపం భర్త అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

New Update
boxer

boxer

మాజీ ప్రపంచ ఛాంపియన్ బాక్సర్ సావిటీ బూరా తన భర్త, ప్రముఖ కబడ్డీ ఆటగాడు దీపక్ నివాస్ హూడాపై దాడి చేశారు. విడాకులు తీసుకోబోతున్న ఈ జంట.. పోలీస్ స్టేషన్‌లో అనేక విషయాల గురించి మాట్లాడుకుంటున్నారు. అయితే భర్తపై విపరీతమైన కోపం రాగా వెంటనే వెళ్లి అతడి కాలర్ పట్టుకున్నారు. ఆపై అతడి ముఖంపైనే పిడి గుద్దులు గుద్దారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుండగా.. అంతా తీవ్ర విమర్శలు చేస్తున్నారు. పోలీసుల ముందే ఆమె అతడిపై తన బాక్సింగ్ ప్రతిభను ప్రదర్శించిందంటే.. రోజూ ఇంకెలా హింస పెట్టిందో అంటూ కామెంట్లు చేస్తున్నారు. 

Also Read: Donald Trump: భారతీయ గ్రీన్ కార్డుదారులకు ఇక చుక్కలు చూపించనున్న ట్రంప్ కొత్త పాలసీ విధానం!

ప్రస్తుతం 32 ఏళ్ల వయసు కల్గిన మాజీ ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ సావిటీ బూరా.. ప్రముఖ కబడ్డీ ఆటగాడు దీపక్ నివాస్ హుడాను 2022 జులై 7న పెళ్లి చేసుకున్నారు. రెండేళ్ల పాటు బాగానే సాగిన వీరి కాపురంలో గొడవలు ప్రారంభం కాగా విడాకులు తీసుకోవాలనుకున్నారు. ఈ మేరకే కోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేశారు. కానీ వారి రెండు కుటుంబాల మధ్య చాలా విషయాలు సెటిల్ చేసుకోవాల్సి ఉండగా.. పోలీస్ స్టేషన్‌లోనే సమావేశం పెట్టుకున్నారు. మార్చి 15వ తేదీన సావిటీ బూరా, దీపక్ నివాస్ హుడా సహా ఇరు కుటుంబాల పెద్దలు హర్యానా హిసార్‌లోని పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారు.

Also Read: Indigo Flight: షాకింగ్ ఘటన.. విమానాన్ని ఢీకొట్టి ఇంజిన్‌ లో పడిన పక్షి.. చివరికి ఏమైందంటే..!?

ఈక్రమంలోనే అంతా కూర్చుని తమ సమస్యల గురించి మాట్లాడుకుంటున్నారు. అయితే ఆ సమయంలో దేని గురించి వారు మాట్లాడుకున్నారో తెలియదు కానీ తీవ్ర ఆగ్రహానికి గురైన బాక్సర్ బూరా మాత్రం ఒక్కసారిగా లేచి భర్తపై దాడికి పాల్పడింది. ఓ చేత అతడి కాలర్ పట్టుకుని.. మరో చేత్తో ముఖంపై పంచులు కురిపిస్తూనే ఉంది. దీంతో దీపక్ నివాస్ విపరీతంగా భయపడి వదిలించుకునే ప్రయత్నం చేశాడు. మరోవైపు విషయం గుర్తించిన కుటుంబ సభ్యులు ఆమెను ఆపడానికి  ప్రయత్నించారు. అతడిని అంతా వెనక్కి నెట్టేసి.. ఆమెను ఆపడానికి ట్రై చేశారు. 

ఇది చూసిన ప్రతీ ఒక్కరూ ఒక్కో విధంగా స్పిందిస్తున్నారు. తన బాక్సింగ్ ప్రతిభను భర్తపై చూపించండం ఎందుకని కొందరు.. పోలీస్ స్టేషన్‌లోనే ఇలా దాడి చేసిందంటే ఇంట్లో ఇంకెంత నరకం చూపించి ఉంటుందో పాపం...చెప్పాల్సిన అవసరం లేదంటూ కామెంట్లు పెడుతున్నారు. ఒకవేళ భర్తే ఆమెపై దాడి చేసి కనుక ఉంటే అక్కుడున్న వారంతా అతడిని కొట్టేవారంటూ చెబుతున్నారు. మగ వాళ్లకు ఏమాత్రం రక్షణ లేకుండా పోతుందంటూ చెబుతున్నారు. ఇదిలా ఉండగా.. సావిటీ బూరాపై విడాకుల కోసం భర్త నుంచి కోటి రూపాయల భరణం డిమాండ్ చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.

Also Read:Ap minister Nara lokesh: నిరుద్యోగులకు మంత్రి లోకేష్ శుభవార్త.. 50 వేల మందికి ఫ్రీ ట్రైనింగ్!

Also Read:Canada-Bharat: మా ఎన్నికల్లో జోక్యానికి భారత్‌ ప్రయత్నిస్తుందంటూ...కెనడా గూఢచారి సంస్థ సంచలన ఆరోపణలు!

 

latest-news | telugu-news | latest-telugu-news | latest telugu news updates

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Turtle Viral Video: తాబేలు ఎంత పని చేసింది భయ్యా.. బికినీ పాపకు చుక్కలు చూపించిందిగా!

నీటిలో స్నానం చేస్తున్న ఓ యువతికి తాబేలు చుక్కలు చూపించింది. హాయిగా ఎంజాయ్ చేస్తున్న ఓ యువతి వద్దకు వెళ్లిన తాబేలు ఆమె పడుకున్న గాలి బెలూన్‌ను కొరికేసింది. దీంతో ఆ యువతి ఒక్కసారిగా నీటిలోకి దూకి వేరొక గాలి బెలూన్‌పైకి వెళ్లింది. ఆ వీడియో వైరలవుతోంది.

New Update
Turtle Attacks Girl In Bikini

Turtle Attacks Girl In Bikini

సోషల్ మీడియా వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. ప్రపంచం నలుమూలల్లో ఏ చిన్న సంఘటన జరిగినా ఇట్టే కళ్ల ముందు కనిపించేస్తుంది. వింతలు, ఆశ్చర్యకరమైన సంఘటనలు, ఊహకందని విషయాలు, రెప్పపాటులో వణికించే విశేషాలు ఇలా ఎన్నో సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాయి. 

Also Read: డీఎంకే ప్రభుత్వంపై మోదీ ఫైర్.. వాళ్లు తమిళంలో సంతకం చేయాలన్న ప్రధాని

అందులో ఎక్కువ మంది ఎంటర్‌ట్రైన్‌మెంట్ కంటెంట్‌పైనే ఆసక్తి చూపిస్తున్నారు. అయితే మరి మీరు కూడా అలాంటి కంటెంట్‌నే చూడాలనుకుంటే.. తాజాగా ఓ వీడియో సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతోంది. ఓ తాబేలు చేసిన పనికి నెటిజన్లు పొట్ట చెక్కలయ్యేలా నవ్వుకుంటున్నారు. దెబ్బకు బికినీ పాపకు చుక్కలు చూపించిన తాబేలు అంటూ కామెంట్లు పెడుతున్నారు. 

Also Read: అగ్నివీరులకు గుడ్‌న్యూస్‌.. పోలీస్ నియామకాల్లో 20 శాతం రిజర్వేషన్లు

ఆడుతూ.. ఆడుతూ ఆ తాబేలు ఏం చేసిందో అనే విషయానికొస్తే.. కొందరు యువతులు బికినీ వేసుకుని నీటిలో ఎంజాయ్ చేస్తున్నారు. గాలి బెలూన్లపై పడుకుని నీటిలో సేద తీరుతున్నారు. ప్రకృతి అందాలను ఆశ్వాదిస్తూ సందడి సందడి చేస్తున్నారు. సరిగ్గా అదే సమయంలో ఒక తాబేలు వారి వద్దకు వచ్చింది. దీంతో ఆ తాబేలును చూసిన ఓ యువతి గాలి బెలూన్‌పై పడుకుని దానితో సరదాగా ఆడింది. 

Also Read: మణిపూర్‌లో ఉగ్రవాదులు అరెస్ట్.. భారీగా ఆయుధాలు స్వాధీనం

కానీ ఆ తాబేలు మాత్రం ఆడుతూ ఆడుతూ చుక్కలు చూపించింది. తిన్నగా వెళ్లి ఆ యువతి పడుకున్న బెలూన్‌ను కొరికేసింది. ఆ తర్వాత మరో రెండు తాబేళ్లు అక్కడకు చేరుకున్నాయి. అంతలోపే ఆ యువతి పడుకున్న బెలూన్ ఒక్కసారిగా గాలి వదిలేసింది. దీంతో కిందికి దిగి ఆ యువతి పరుగులు తీసింది. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో వైలర్‌గా మారింది. .

(Turtle videos | latest-telugu-news | telugu-news | viral-videos)

Advertisment
Advertisment
Advertisment