/rtv/media/media_files/2026/03/31/first-phase-of-census-to-begin-on-april-1-2026-03-31-07-49-08.jpg)
First phase of Census to begin on April 1
దేశవ్యాప్తంగా బుధవారం నుంచి జనగణన(Census 2027) ప్రారంభం కానుంది. దీనికి సంబంధించిన వివరాలను రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా, సెన్సస్ కమిషనర్ మృత్యంజయ్‌కుమార్ నారాయణ్ వెల్లడించారు. దేశ చరిత్రలో 1872 లో తొలిసారిగా జనగణన మొదలైంది. దీంతో కలుపుకుంటే ఇప్పుడు చేపట్టేది 16వది కానుంది. స్వతంత్ర భారత్‌లో 8వది కానుంది. అయితే ఈసారి డిజిటల్ రూపంలో వివరాలు సేకరించనున్నారు. జనగణలో భాగంగా సేకరించే వ్యక్తి డేటాను సీక్రెట్‌గా ఉంచనునన్నారు. ఏ ప్రభుత్వం, ప్రభుత్వేతర సంస్థతో కేంద్రం వివరాలు పంచుకోదు. దీనివల్ల ఆధారంగా విచారణలు, దర్యాప్తు చేపట్టేందుకు పర్మిషన్ అనేదే ఉండదు.
Also Read: హిస్టరీలో ఫస్ట్ టైం.. రూపాయి భారీ పతనం: 95 మార్క్ దాటిన మారకం విలువ
దీనికి సంబంధించిన వివరాలను సమాచారహక్కు చట్టం (RTI) కింద ఇవ్వరు. అంతేకాదు కోర్టుల్లో సాక్ష్యాలుగా వినియోగించేదుకు వీలు ఉండదు. మొదటిదశలో జనగణన కార్యక్రమం ఏప్రిల్ 1 నుంచి సెప్టెంబర్ 30 వరకు దేశంలో దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో నెలరోజుల పాటు జరగనుంది. ఇందులో భాగంగా 33 ప్రశ్నలు అడగనున్నారు. ప్రజల ఇంటి స్థితిగతులు, వాళ్లకు అందుబాటులో ఉన్న సౌకర్యాలు, చరాస్తుల వివరాలు అడిగి నమోదు చేస్తారు.
Also Read: నక్సల్బరీలో ఎగిసి...తెలంగాణలో ముగిసి
జనగణన కార్యక్రమం ఏపీలో మే 1 నుంచి 30 వరకు జరగనుంది. అలాగే తెలంగాణలో మే 11 నుంచి జూన్ 9 వరకు జరగనుంది. దీనికోసం 15 రోజుల ముందుగానే సెల్ఫ్ ఎన్యూమరేటర్ పోర్టల్‌లో ప్రజలు తమ ఇంటికి సంబంధించిన వివరాలు ముందుగానే నమోదు చేసుకోవచ్చు. భారత ప్రభుత్వం ఆధ్వర్యంలో సీడాక్ అభివృద్ధి చేసిన మొబైల్ యాప్ ద్వారా 16 భారతీయ భాషల్లో వివరాలు నమోదు చేసే కార్యక్రమం నిర్వహించనున్నారు.
అధికారులు అడిగే కీలక వివరాలు ఇవే
ఇంట్లో ఉండే సభ్యుల సంఖ్య
వాళ్ల పేర్లు, లింగం, కుటుంబ యజమాని వివరాలు
ఇంట్లో గదుల సంఖ్య, పెళ్లైన జంటల సంఖ్య
ఇంట్లో ఉన్న సౌకర్యాలు, ఆస్తులు, ఆదాయ వనరుల వివరాలు.
రేడియో, టీవీ, ఇంటర్నెట్, ల్యాప్‌టాప్/కంప్యూటర్/స్మార్ట్‌ఫోన్, వాహనాలు, ఇతర వస్తువుల వివరాలు
ఇంటి యజమాని ఫోన్ నంబరు
Follow Us