Bullet Train: ముంబయి-అహ్మదాబాద్‌ బుల్లెట్‌ రైలు ఫస్ట్‌ లుక్..

భారత్‌లో ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న ముంబయి-అహ్మదాబాద్‌ బుల్లెట్‌ రైలును అందుబాటులోకి తీసుకొచ్చేందుకు పనులు వేగంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగానే ఈ హైస్పీడ్ రైలుకు సంబంధించిన తొలి అధికారిక ఫొటోను రైల్వే మంత్రిత్వ శాఖ తాజాగా రిలీజ్ చేసింది.

New Update
First look of India's debut bullet train between Mumbai, Ahmedabad unveiled

First look of India's debut bullet train between Mumbai, Ahmedabad unveiled

భారత్‌లో ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న ముంబయి-అహ్మదాబాద్‌ బుల్లెట్‌ రైలును అందుబాటులోకి తీసుకొచ్చేందుకు పనులు వేగంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగానే ఈ రెండు నగరాల మధ్య హైస్పీడ్ రైలుకు సంబంధించిన తొలి అధికారిక ఫొటోను రైల్వే మంత్రిత్వ శాఖ తాజాగా రిలీజ్ చేసింది. ఢిల్లీలోని రైల్వే శాఖ భవనం వద్ద సోమవారం ఈ బుల్లెట్ రైలు ఫొటోను తీశారు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

Also Read: ముస్లింలు రోడ్లపై నమాజ్ చేయొద్దు.. సీఎం యోగీ ఆదిత్యనాథ్ హెచ్చరిక

గంటకు దాదాపు 300 కిలోమీటర్ల గరిష్ట వేగంతో ప్రయాణించేలా ఈ రైలును రూపొందించారు. ఈ హైస్పీడ్ కారిడార్ పూర్తిగా అందుబాటులోకి వస్తే ముంబయి- అహ్మదాబాద్ నగరాల మధ్య ప్రయాణ సమయం గణనీయంగా తగ్గనుంది. ఈ రెండు పారిశ్రామిక నగరాల మధ్య ప్రయాణించేందుకు రైలు లేదా రోడ్డు మార్గంలో ప్రస్తుతం 7 గంటలకు పైగా సమయం పడుతోంది. బుల్లెట్ రైలు అందుబాటులోకి వస్తే 2 గంటల్లోనే ప్రయాణికులు తమ గమ్యస్థానానికి చేరుకోవచ్చు. ప్రాథమిక నమూనా ప్రకారం ఈ రైలులో 8 అడ్వాన్స్‌డ్ కోచ్‌లు ఉండనున్నాయి.

Also Read: రష్యాపై ఉక్రెయిన్ డ్రోన్ల వర్షం.. S-400 రక్షణ వ్యవస్థలపై భీకర దాడులు

ముంబయి-అహ్మదాబాద్ మధ్య నిర్మిస్తున్న ఈ ప్రత్యేక కారిడార్‌లో మొత్తంగా 12 స్టేషన్లను నిర్మిస్తున్నారు. ఇందులో సబర్మతి, అహ్మదాబాద్, ఆనంద్, వడోదర, భరూచ్, సూరత్, బిలిమోరా, వాపి, బోయిసర్, విరార్, థానే, అలాగే ముంబయి స్టేషన్లు ఉన్నాయి. ఈ భారీ ప్రాజెక్టును దశలవారీగా ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కేంద్రం ప్రణాళికలు సిద్ధం చేసింది. తొలి దశలో భాగంగా గుజరాత్‌లోని సూరత్‌- బిలిమోరా మధ్య ఉన్న మొదటి 100 కిలోమీటర్ల మార్గాన్ని 2027 ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవ కానుకగా ప్రారంభించాలని రైల్వే శాఖ భావిస్తోంది. ఈ ప్రాజెక్టు పూర్తి చేసేందుకు శరవేగంగా పనులు జరుగుతున్నట్లు రైల్వే అధికారులు చెబుతున్నారు. 

Advertisment
తాజా కథనాలు