ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ మరోసారి కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు సిద్ధమయ్యారు. 2019 నుంచి ఇప్పటివరకు ఈమె ఏడు బడ్జెట్ లను ప్రవేశపెట్టారు. ఇప్పుడు ఈరోజు ఎనిమిదవది. దీంతో నిర్మలా మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ రికార్డను సమం చేయడమే కాక..దేశంలో అత్యధిక బడ్జెట్ లను ప్రవేశపెట్టిన వారిలో మూడవ స్థానంలోకి చేరుతారు.
2025 బడ్జెట్..
ఈరోజు పార్లమెంటులో ఉదయం 11 గంటలకు బడ్జెట్ ను చదవనున్నారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. ఇది సామాన్యుల బడ్జెట్ అని చెబుతున్నారు. దీంతో ధరలకు కళ్ళెం పడుతుందని..ఆర్ధిక భారతం తగ్గించే దిశగా సంస్కరణలు చేపడతారని ఆశిస్తున్నారు. అలాగే వేతన జీవుల ట్యాక్స్ భారం కూడా తగ్గాలని కోరుకుంటున్నారు. ఈ బడ్జెట్ లో సామాన్యలు ట్యాక్స్ ను తగ్గించొచ్చని అంటున్నారు. చాలా కాలంగా ట్యాక్స్ రిలాక్షేషన్ కోసం అదరూ ఎదురు చూస్తున్నారు. ఈసారి బడ్జెట్ లో అయినా ట్యాక్స్ మినహాయింపు 3 లక్సల నుంచి 5 లక్షలు చేయాలని కోరుకుంటున్నారు. ఇక ఉద్యోగ కల్పన, నైపుణ్యాభివృద్ధి మధ్యతరగతి ప్రజలకు నిరుద్యోగం ప్రధాన ఆందోళనగా మిగిలిపోయింది. మౌలిక సదుపాయాలు, తయారీ, సాంకేతిక రంగాల్లో పెట్టుబడులు పెట్టడం ద్వారా ఉద్యోగాల కల్పనపై ప్రభుత్వం దృష్టి సారిస్తుందని భావిస్తున్నారు.
ఇది కూడా చూడండి: Maha Kumbh Mela: రైల్వేశాఖకు పెద్ద షాకిచ్చిన భక్తుడు.. కుంభమేళాకు వెళ్లలేకపోయినందుకు 50 లక్షల నష్ట పరిహారం కట్టాల్సిందే!
2026 ఆర్థిక సంవత్సరానికి భారత జీడీపీ వృద్ధి రేటు 6.3 నుంచి 6.8 శాతం వరకూ ఉంటుందని ఆర్థిక సర్వే అంచనా వేసింది. జూలై..సెప్టెంబర్ త్రైమాసికంలో కూడా వృద్ధి రేటు అంతగా ఏమీ లేదు. కేవలం 5.4 మాత్రమే నమోదైంది. ఆర్బీఐ వృద్ధి రేటును 7 శాతంగా అంచనా వేసింది. దానిని అందుకోలేదు. అయితే ప్రస్తుత ఆర్ధిక సంవత్సరం చివరకి వచ్చేసరికి ఆహార ద్రవ్యోల్బణం తగ్గొచ్చని ఆర్థిక సర్వే తెలిపింది. సీజనల్ వెజిటబుల్ ధరలు తగ్గడం, ఖరీఫ్ పంట రావడం కారణమని తెలిపింది. దీంతో 2026 మొదట్లో కూడా ఆహార ధరలు అదుపులో ఉంటాయని అంచనా వేసింది. మరోవైపు పారిశ్రామిక రంగం సైతం కరోనా మహమ్మారికి ముందున్న పరిస్థితిని అధిగమించి పురోగమిస్తోందని తెలిపింది.
ఇది కూడా చూడండి: Cricket: హమ్మయ్యా...సీరీస్ కొట్టేశారు..నాలుగో టీ20లో భారత్ ఘన విజయం