Valparai Tragedy : వాల్పరై ఘాట్ రోడ్డుపై ఘోర ప్రమాదం: తొమ్మిది మంది మృతి

తమిళనాడు రాష్ట్రంలోని కోయంబత్తూరు జిల్లా వాల్పరై ఘాట్ రోడ్డులో ఘోర ప్రమాదం జరిగింది. కేరళకు చెందిన పర్యాటకుల వ్యాన్ లోయలో పడి తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. మృతులలో ఏడుగురు మహిళలు, ఒక బాలుడు కూడా ఉన్నారు.

New Update
FotoJet (16)

Fatal accident on Valparai Ghat road: Nine people killed

Valparai Tragedy : తమిళనాడు రాష్ట్రంలోని కోయంబత్తూరు జిల్లా వాల్పరై ఘాట్ రోడ్డులో ఘోర ప్రమాదం జరిగింది. కేరళకు చెందిన పర్యాటకుల వ్యాన్ లోయలో పడి తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. మృతులలో ఏడుగురు మహిళలు, ఒక బాలుడు కూడా ఉన్నారు. ఈ విషాద ఘటన 13వ హెయిర్ పిన్ బెండ్ వద్ద సంభవించింది. వ్యాన్ డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో వాహనం నేరుగా లోయలోకి దూసుకెళ్లిపోయింది. సుమారు 500 అడుగుల లోతులో ఉన్న 9వ హెయిర్ పిన్ వరకు పడిపోయింది.

బాధిత పర్యాటకులందరూ కేరళ రాష్ట్రంలోని మలప్పురం జిల్లాకు చెందిన వారని తెలిసింది. కేరళలోని మలప్పురం జిల్లా పాంగ్-పల్లిపరంబ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు చెందిన ఉపాధ్యాయులు, సిబ్బందితో కూడిన 13 మంది పర్యటన కోసం తమిళనాడు వెళ్లారు. శుక్రవారం ట్రావెల్‌ టెంపో వాహనంలో వాల్పరై హిల్‌ స్టేషన్‌ను సందర్శించారు.
 పర్యటన ముగించుకుని తిరిగి వెళ్తుండగా ఈ ఘోర ప్రమాదం జరిగింది. ఘటనా స్థలంలోనే ఎనిమిది మంది మరణించగా మరొకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ఈ ప్రమాదంలో మరో ముగ్గురు తీవ్రంగా గాయపడి ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు.13 మందిలో ఒక బాలిక, ఏడుగురు మహిళలు, ఒక పురుషుడితో సహా 9 మంది ఈ ప్రమాదంలో మరణించారు. మృతుల్లో ఏడుగురు ఉపాధ్యాయులు ఉన్నారు.

ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే స్థానిక పోలీసులు,సహాయక సిబ్బంది తరలి వచ్చారు. లోయలో పడిపోయిన క్షతగాత్రులను వెలికి తీయడానికి భారీ ఎత్తున చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని పొల్లాచ్చి , కోయంబత్తూరు ప్రభుత్వ ఆసుపత్రులకు తరలించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ,కేరళ సీఎం విజయన్‌  ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ఆయన తన ప్రగాఢ సానుభూతిని సామాజిక మాధ్యమాల ద్వారా తెలిపారు. మలప్పురం గ్రామంలో ఈ వార్త వినగానే తీవ్ర విషాద ఛాయలు అలముకున్నాయి.

 ఈ ప్రమాదం కారణంగా ఘాట్ రోడ్డులో ట్రాఫిక్ నిలిచిపోయింది. పోలీసులు మరియు రెస్క్యూ టీమ్ సహాయక చర్యలు చేపట్టారు. లోయ నుండి క్షతగాత్రులను బయటకు తీయడం చాలా కష్టమైంది. ఈ విషాద దృశ్యాలు అందరినీ కలిచివేసేలా ఉన్నాయి.

Advertisment
తాజా కథనాలు