Congress: కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల.. అమరుల కుటుంబాలకు రూ.2 కోట్లు! హర్యానాలో కాంగ్రెస్ మరో మేనిఫెస్టోను విడుదల చేసింది.అమరవీరుల కుటుంబాలకు రూ.2 కోట్లు అందిస్తామంది. రైతు చట్టాల రద్దు కోసం పోరాడి అమరులైన 736 మంది రైతులకు అమరవీరుల హోదా కల్పిస్తామని, బాధిత కుటుంబాల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తామని హామీ ఇచ్చింది. By B Aravind 28 Sep 2024 in నేషనల్ Latest News In Telugu New Update షేర్ చేయండి హర్యానాలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గరకొస్తున్నాయి. అధికారం సాధించేందుకు బీజేపీ, కాంగ్రెస్‌లు పోటాపోటీగా తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ఓటర్లను ఆకర్షించేలా తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇటీవల ఏడు గ్యారెంటీలతో మేనిఫెస్టోను విడుదల చేసిన కాంగ్రెస్.. తాజాగా మరికొన్ని హమీలతో మరో మేనిఫెస్టోను విడుదల చేసింది. రైతుల సంక్షేమం, అమరవీరుల కుటుంబాలను ఆకట్టుకునేలా దీన్ని రూపొందించింది. హర్యానా మాజీ సీఎం భూపిందర్ సింగ్ హుడా, రాజస్థాన్ మాజీ సీఎం అశోక్ గహ్లోత్ ఈ మేనిఫెస్టోను విడుదల చేశారు. రైతుల సంక్షేమం కోసం ఓ కమిషన్‌ను ఏర్పాటు చేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. హర్యానా నుంచి సైన్యంలో పనిచేస్తూ దేశం కోసం ప్రాణాలిచ్చిన అమరవీరులకు రూ.2 కోట్లు అందిస్తామని ప్రకటన చేసింది. Also Read: టెన్త్, ఇంటర్ పరీక్షలపై CBSE సంచలన నిర్ణయం! అలాగే మూడు రైతు చట్టాల రద్దు కోసం జరిగిన పోరాటంలో అమరులైన రైతులకు స్మారక చిహ్నం ఏర్పాటు చేస్తామని.. అలాగే 736 మంది రైతులకు అమరవీరుల హోదా కల్పిస్తామని హామీ ఇచ్చింది. బాధిత కుటుంబాలకు చెందిన ఒక్కొక్కరికీ ప్రభుత్వ ఉద్యోగం కల్పించడంతో పాటు వారి పిల్లల చదువుకు ఆర్థిక సాయం చేస్తామని చెప్పింది. రైతుల అభివృద్ధి కోసం సబ్సిడీపై డీజిల్ అందిస్తామని.. దీనికోసం డీజిల్ కార్డులను కూడా జారీ చేస్తామని తెలిపింది. పరువు హత్యలు, ఇతర నేరాలను అరికట్టేందుకు కఠినంగా చట్టాలు తయారుచేస్తామని.. హర్యానాను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మార్చేందుకు కృషి చేస్తామని ప్రకటించింది. ఇందుకోసం డీ-అడిషన్ కమిషన్ ఏర్పాటు చేస్తామని తెలిపింది. అలాగే కాంట్రాక్టు ఉద్యోగాల కోసం బీజేపీ ఏర్పాటు చేసిన 'హర్యానా కుశాల్ రోజ్‌గార్ నిగమ్' ను రద్దు చేస్తామని పేర్కొంది. పేపర్ లీక్ సమస్యలను పరిష్కరించేందుకు ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేస్తామంది. అంతేకాదు రూ. 500లకే వంట గ్యాస్ సిలిండర్ల పంపిణీ, ప్రతి కుటుంబం నుంచి 18 నుంచి 60 ఏళ్ల లోపు మహిళలకు రూ.2 వేల ఆర్థిక సాయం అందిస్తామని హామీ ఇచ్చింది. వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు ప్రతీ నెల రూ.6 వెల పెన్షన్ ఇస్తామని ప్రకటించింది. అలాగే పేద కుటుంబాలకు ప్రతీ నెల 300 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తామని పేర్కొంది.అలాగే హర్యానాలో 2 లక్షల శాశ్వత ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పింది. ఇక అక్టోబర్ 5న హర్యానాలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. 8న ఫలితాలు విడుదల కానున్నాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ మధ్య గట్టి పోటీ నెలకొంది. ఈసారి ఎవరు అధికారంలోకి వస్తారో అనేదానిపై ఆసక్తి నెలకొంది. Also Read: హైడ్రా అంటే భయం కాదు.. భరోసా: రంగనాథ్ సంచలన ప్రెస్‌మీట్ #telugu-news #congress #national-news #haryana మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి