/rtv/media/media_files/2025/03/19/oBE9EUMtISKe9FYk4TMH.jpeg)
nagpur violence 123 Photograph: (nagpur violence 123)
నాగ్‌పూర్ అల్లర్ల కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. రెండు రోజుల క్రితం మహారాష్ట్ర నాగ్‌పూర్‌లో చెలరేగిన హింస, మతఘర్షణలపై పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. అల్లర్లకు కారణమైన వ్యక్తి స్థానిక రాజకీయ నాయకుడని పోలీసులు తెలుసుకున్నారు. రెండు వర్గాల మధ్య గొడవకు కారణమైన ప్రధాన నింధితుడు ఫహీమ్ ఖాన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయన్ని శుక్రవారం వరకు కస్టడీలోనే ఉంచనున్నారు. ఫహీమ్ ఖాన్ మైనారిటీ డెమోక్రటిక్ పార్టీకి చెందిన లోకల్ లీడర్.
Also read: SC classification: తెలంగాణలో సుప్రీం కోర్టు తీర్పును అమలు చేశాం: సీఎం రేవంత్ రెడ్డి
ఔరంగజేబు సమాధిని తవ్వాలని విశ్వహిందు పరిషత్ ర్యాలీ చేసినప్పుడు ఫహీమ్ ఖాన్ అక్కడున్న వారిని రెచ్చగొట్టాడని ఆరోపణలు ఉన్నాయి. నాగ్‌పూర్ అల్లర్ల కేసులో ఇప్పటివరకు 60 మందిని అరెస్టు చేశారు. ఆరు కేసులు నమోదు చేసి 1,200 మందిపై ఫిర్యాదులు చేశారు. వీరిలో ఇప్పటివరకు 200 కంటే తక్కువ మంది పేర్లు నమోదు చేయబడ్డాయి. మిగిలిన వారిని పట్టుకునే పనిలో ఉన్నారు. సెంట్రల్ నాగ్‌పూర్‌లోని మహల్ ప్రాంతంతోపాటు సమస్యాత్మక ప్రదేశాల్లో పోలీసుల కర్ఫ్యూ విధించారు.
Desh ka Musalman during Hindu festival: Let's do some rioting and vandalism.
— राजपूत सवित सिंह (@Savit12) March 18, 2025
Desh ka Musalman during their festival: Let's do some rioting and vandalism.#NagpurRiots#NagpurViolence#Nagpur #aurangzebtomb #Aurangzeb #Banwaqfboard pic.twitter.com/5QyQFf1zEE
Also read : బిల్‌గేట్స్‌తో సీఎం చంద్రబాబు భేటీ.. కీలక ఒప్పందాలు!
రెండు వర్గాల ఘర్షణలో దాదాపు 50 మంది పోలీసులు గాయపడ్డారు. ఒక పోలీసుపై గొడ్డలితో దాడి జరిగిందని ముఖ్యమంత్రి చెప్పారు. అల్లర్ల సమయంలో డ్యూటీలో ఉన్న మహిళా కానిస్టేబుల్‌తో అల్లరిమూకలు అసభ్య ప్రవర్తించారు. ఆందోళనల మసుగులో మహిళా కానిస్టేబుల్‌పై అఘాయిత్యం చేసేందుకు యత్నించారని సమాచారం. దీనికి సంబంధించి గణేష్‌పేట పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.