హంగ్ తప్పదా..? ఢిల్లీలో అధికారం కోసం ఏ 2 పార్టీలు కలుస్తాయి..!

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ విడుదలైయ్యాయి. 70 అంసెబ్లీ స్థానాల్లో హంగ్ ఏర్పడుతుందని కొన్ని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. టైమ్స్ నౌ, మ్యాట్రెజ్ ఏ పార్టీకీ క్లియర్ మెజార్టీ ఇవ్వలేదు. మ్యాజిక్ ఫిగర్ 36మంది MLAల సపోర్ట్ ఉంటేనే ప్రభుత్వ ఏర్పాటు.

author-image
By K Mohan
New Update
Arvind Kejriwal, Modi, Rahul Gandhi

Arvind Kejriwal, Modi, Rahul Gandhi

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. అధికార పీఠం కోసం హోరాహోరీ పోరు ఉంది. బీజేపీ, ఆమ్ ఆద్మీ మధ్యే పోటాపోటీ  నడుస్తోంది. మ్యాట్రిజ్, టైమ్స్ నౌ ఇచ్చిన ఎగ్జిట్ పోల్స్ ను చూస్తే ఢిల్లీలో హంగ్ తప్పదని అర్థమవుతుంది. మొత్తం 70 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరగగా.. బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీ మధ్య రసవత్తర పోటీ నెలకొంది. 70 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఏ పార్టీకి 36 సీట్లు వస్తే ఆ పార్టీదే ఢిల్లీ పీఠం. ఈ కింది రెండు ఎగ్జిట్ పోల్స్ ఢిల్లీలో ఏ పార్టీకి క్లియర్ మెజార్టీ రాదని చెబుతున్నాయి. ఒకవేళ అలాగే జరుగుతే అధికారం కోసం ఏ రెండు పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయో చూడాలి మరి. హంగ్ వచ్చే పరిస్థితి ఏర్పడితే స్వంతత్ర అభ్యర్థులు ఎవరైనా గెలిస్తే వారికి ఫుల్ డిమాండ్ వస్తుంది. మారి మద్దతు కోసం రెండు పార్టీలు రంగంలోకి దిగుతాయి.

ఢిల్లీలో బీజేపీ అధికారం ఏర్పాటు చేయక 20 ఏళ్లు అవుతుంది. ఇక ఆమ్ ఆద్మీ పార్టీ 2013 నుంచి హవా కొనసాగిస్తూనే వస్తోంది. ఇటీవల మారిన రాజకీయ పరిణామాల కారణంగా ఆప్ అధినేత కేజ్రీవాల్ హవా పడిపోయింది. బీజేపీ మాత్రం ఏ మాత్రం తగ్గకుండా ఆప్ పై పోరు సాగిస్తోనే ఉంది. ఇక కాంగ్రెస్ పార్టీకి ఆప్‌తో వచ్చిన విభేదాల కారణంగా ఇండియా కూటమిలోనే బద్దశత్రువులుగా ప్రవర్తిస్తున్నారు.

టైమ్స్ నౌ, మ్యాట్రెజ్ ఎగ్జిట్ పోల్స్... 

టైమ్స్ నౌ

ఆప్: 27-34
బీజేపీ: 37-43
కాంగ్రెస్: 0-2

మ్యాట్రెజ్

BJP- 35-40
AAP- 32-37,
INC -1

ఈ రెండు ఎగ్జిట్ పోల్స్ సరిగ్గా అటు బీజేపీ గానీ, ఇటు ఆప్‌కు గానీ మ్యాజిక్ ఫిగర్ దాటుతుందని చెప్పట్లేదు. దీంతో కాంగ్రెస్ పార్టీ ఒకవేళ ఎగ్జిట్ పోల్స్ లో ఇచ్చిన దానికంటే ఎక్కువ సీట్లు గెలుచుకుంటే రెండు పార్టీలకు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం దక్కదు. దీంతో ఫలితాల తర్వాత ఎమ్మెల్యేలు జెండా తిప్పడమా.. లేక ఆప్, కాంగ్రెస్ పార్టీ కలిసి బీజేపీకి దెబ్బేస్తాయా అనేది చూడాలి. 

Also Read: పేరుకి గజదొంగ.. ప్రేమలో ఆణిముత్యం: చోరీ సొమ్ముతో ప్రియురాలికి రూ.3కోట్ల ఇల్లు!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు