/rtv/media/media_files/2025/03/15/XZdOtIUduCyQrI6Cjl8k.jpg)
Ex MLA firing Photograph: (Ex MLA firing)
హోలీ రోజు కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యేపై కాల్పులు కలకలం రేపాయి. కొంతమంది దుండగులు గన్స్‌తో ఇంట్లోకి ప్రవేశించి 12 రౌండ్లు కాల్పులు జరిపారు. నలుగురు వ్యక్తులు ఇంట్లోకి ప్రవేశించడం సీసీటీపీ పుటేజీలో కనిపిస్తోంది. ఈ ఘటన హిమచల్ ప్రదేశ్‌లోని బిలాస్‌పూర్‌లో చోటు చేసుకుంది. కాంగ్రెస్ పార్టీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే బంబర్ ఠాకూర్‌పై గుర్తు తెలియని వ్యక్తులు శుక్రవారం సాయంత్రం బుల్లెట్ల వర్షం కురిపించారు. ఈ కాల్పుల్లో ఠాకూర్ వెంట ఉన్న కార్యకర్తకు తీవ్రంగా గాయాలు అయ్యాయి. బంబర్ ఠాకూర్, అతని పర్సనల్ సెక్యురీటీ ఆఫీసర్ ఇద్దరి వీపు మరియు పొత్తికడుపుపై తుపాకీ గాయాలు అయ్యాయి. దాడి సమయంలో దాదాపు 12 రౌండ్లు కాల్పులు జరిగాయి. మొత్తం నలుగురు దుండగులు ఆయుధాలతో అకస్మాత్తుగా ఇంట్లోకి ప్రవేశించారని ప్రత్యేక్ష సాక్షులు చెబుతున్నారు.
Also read: TDP నాయకుడు దారుణ హత్య.. వేటకొడవళ్లతో నరికి నరికి
Himachal Pradesh: Former Congress MLA from Bilaspur shot at by unidentified people pic.twitter.com/X7piigtSMe
— Raajeev Chopra (@Raajeev_Chopra) March 14, 2025
ఇద్దరు ఇంట్లోకి వెళ్లి కాల్పులు జరపగా.. మరో ఇద్దరు గేటు వద్ద కాపలా ఉన్నారు. ఫైరింగ్ అనంతరం నిందితులు అక్కడి నుంచి పారిపోయారు. గాయపడిన వారిని నేరుగా ఆసుపత్రికి తరలించారు. ఠాకూర్‌ను మొదట సురక్షిత ప్రదేశానికి తరలించారు. తరువాత చికిత్స కోసం ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. కాల్పులకు పాల్పడిన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. మాజీ ఎమ్మెల్యేకు గవర్నమెంట్ కేటాయించిన ఇంట్లో కూర్చున్నప్పుడు ఈ అటాక్ జరిగింది.