/rtv/media/media_files/2025/02/11/12bYge2olE1XzpBKJPtH.jpg)
Defense Minister Rajnath Singh
బెంగళూరులో ఏరో ఇండియా 2025 ప్రదర్శన జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటుచేసిన బ్రిడ్జ్ కాన్‌క్లేవ్‌లో రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. అభివృద్ధి చెందుతున్న ప్రపంచ భద్రత, వినూత్న విధానాలు అనేవి బలమైన భాగస్వామ్యాలకు దారి తీస్తాయని అన్నారు. '' ప్రపంచంలో రోజురోజుకి సంఘర్షణలు పెరిగిపోతున్నాయి. భవిష్యత్తులో ఏం జరగనుందో తెలియడం లేదు.
Also Read: డిజిటల్ అరెస్టయిన కుటుంబం.. కోటి రూపాయలు కాజేసిన సైబర్ నేరగాళ్లు
కొత్త ఆయుధీకరణ, అభివృద్ధి చెందిన టెక్నాలజీ ఇలా అనేక అంశాలు ప్రపంచాన్ని బలహీనం చేస్తున్నాయి. ప్రపంచ భద్రత, వినూత్నమైన విధానాలు, బలమైన భాగస్వామ్యాలకు దారి తీస్తుందని నా ప్రగాఢ నమ్మకం. శాంతిని పునరుద్ధరించడం కోసం భారత్ ఎల్లప్పుడూ ప్రయత్నిస్తూనే ఉంటుంది. మనం బలహీనంగా ఉన్నట్లయితే అంతర్జాతీయ క్రమబద్ధత, శాంతి అనేదిసాధ్యం కాదు. అందుకే మనం రక్షణ రంగం సామర్థ్యాలను పెంచుకుంటున్నాం.
Also Read: ఢిల్లీలో 27 ఏళ్ల తరువాత అధికారం.. బీజేపీ ముందున్న పది సవాళ్లు ఇవే!
రాబోయే రోజుల్లో మరిన్ని మార్పులు తీసుకొస్తాం. హిందూ మహాసముద్రం ప్రాంతంలో మేమందరం కూడా సాగర్ (సెక్యూరిటీ అండ్ గ్రోత్ ఫర్ ఆల్ ఇన్ ద రీజియన్) విధానాన్ని పాటిస్తున్నాం. మారిటైం సెక్యూరిటీ,ఆర్థికాభివృద్ధి, బ్లూ ఎకామనీ అంశాలపై ఫోకస్ పెట్టాం. మా నిబద్ధతకు బ్రిడ్జ్ ఒక ఉదాహరణ. ప్రస్తుతం రక్షణ రంగంలో అభివృద్ధి, పరిశోధనలకు భారత్ గ్లోబల్ హబ్‌గా మారింది. మన దేశ సామార్థ్యాలకు ఇది నిదర్శనమని'' రాజ్‌నాథ్ సింగ్ అన్నారు.
Also Read: లంపీ స్కిన్ వ్యాధి - టీకా కనుగొన్న భారత్ బయోటెక్
Also Read: 350 కి.మీ మేర నిలిచిన ట్రాఫిక్...గూగుల్ మ్యాప్ చూసుకుని వెళ్లండంటున్న సీఎం!