/rtv/media/media_files/2025/02/16/6uvteTUuHgGFZjBeBLT8.jpg)
Elon Musk with trump Photograph: (Elon Musk with trump)
అమెరికా భారత్‌కు అందించే విదేశీ సాయంలో కోత విధించింది. ఎలన్ మస్క్ అధ్యక్షతన అమెరికాలో కొత్తగా ఏర్పాటు చేసిన డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎఫీషియన్సీ తయారు చేసిన బడ్జెట్ ప్రణాళికలో విదేశీ సహయ నిధుల్లో 723 మిలియన్ డాలర్లను తగ్గించాలని నిర్ణయించుకుంది. దీంతో భారత్‌కు రావాల్సిన 21 మిలియన్ డాలర్లను కూడా అమెరికా రద్దు చేసింది. ఇండియాలో ఎలక్షన్లలో ఓటర్ల అవగాహన, ఓట్ల లెక్కింపు వంటి కార్యక్రమాలకు ప్రతి ఏటా అమెరికా ఈ ఆర్థిక సాయం అందిస్తోంది. దీన్ని రద్దు చేయాలని ఎలన్ మస్క్ ట్రంప్‌కు సూచించారు.
US taxpayer dollars were going to be spent on the following items, all which have been cancelled:
— Department of Government Efficiency (@DOGE) February 15, 2025
- $10M for "Mozambique voluntary medical male circumcision"
- $9.7M for UC Berkeley to develop "a cohort of Cambodian youth with enterprise driven skills"
- $2.3M for "strengthening…
అమెరికాతోపాటు బంగ్లాదేశ్‌కు ఇచ్చే 29 మిలియన్ డాలర్లలను రద్దు చేయాలని డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎఫీషియన్సీ విభాగం తయారు చేసిన బడ్జెట్‌లో ఎలన్ మస్క్ ప్రకటించారు. ఇండియాలో ఓటర్ల సంఖ్య పెంచడం, బంగ్లాదేశ్‌లో రాజకీయ స్థిరత్వం కోసం అమెరికా ఈ ఆర్థిక సాయం చేస్తూవచ్చింది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలోని కొత్త ప్రభుత్వం బడ్జెట్ కోత విధించడంతో భారతదేశం, బంగ్లాదేశ్ సహా అనేక దేశాలకు మిలియన్ల డాలర్ల నిధులను అమెరికా రద్దు చేసింది. భారతదేశానికి కేటాయించిన $21 మిలియన్లు ప్రత్యేకంగా దేశ ఎన్నికలలో ఓటర్ల భాగస్వామ్యాన్ని పెంచడం లక్ష్యంగా పెట్టుకున్నాయి. అయితే, ఈ నిధులు ఇకపై అందుబాటులో ఉండవని DOGE సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ Xలో ప్రకటించింది.
Also Read : Gold Prices: ఎట్టకేలకు దిగొచ్చిన బంగారం ధర.. ఇదే గోల్డెన్ ఛాన్స్!
ఇతర దేశాలకు సాయం చేస్తూ అమెరికా దివాలా తీస్తోందని మస్క్ పలు మార్లు అన్నారు. అయితే ట్రంప్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎఫీషియన్సీ అనే విభాగానికి మస్క్‌ను హెడ్‌గా నియమించాడు. ఈ శాఖ ప్రభుత్వ పాలనా విభాగాలను, సామర్థ్యాన్ని అంచానా వేస్తోంది. డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎఫీషియన్సీ తరుపున ఎలన్ ఆదివారం అమెరికా సమగ్ర ప్రణాళిక బడ్జెట్ రూపొందించింది. ఇందులో విదేశీ సాయం కింద అమెరికా ఖర్చు చేస్తున్న 723 మిలియన్ డాలర్లలో కోత విధించాలని తెలిపింది. ఇందులో భాగంగానే బంగ్లాదేశ్ 29 మిలియన్ డాలర్లు, ఇండియాకు 21 డాలర్ల నిధులు క్యాన్సల్ చేయనుంది అమెరికా. మోదీ రెండు రోజుల క్రితమే అమెరికా పర్యటనలో మస్క్, ట్రంప్‌లను కలిసి వచ్చారు. మోదీ బేటీ తరవాత ఇలా జరగడం చర్చనీయాంశంగా మారింది.
Also read : Aashiqui 3: బ్లాక్ బస్టర్ ఫ్రాంచైజీతో శ్రీలీల బాలీవుడ్ ఎంట్రీ.. టీజర్ అదిరింది! చూశారా