Ramadan Festival: దుబాయ్ లో 30న, ఇండియాలో 31 ఈద్..

సౌదీ అరేబియాలో చంద్రుడు ఈరోజే దర్శనమిచ్చాడు. దీంతో అక్కడ రేపే ఈద్ ఉత్ ఫితర్ జరుపుకోనున్నారు. ఆ లెక్క ప్రకారం ఇండియాలో మార్చి 31న అంటే సోమవారం రంజాన్ పండుగ సెలబ్రేట్ చేసుకోనున్నారు. 

New Update
dubai

Ramadan

రంజాన్ ఎప్పుడు జరుపుకోవాలనే సంశయం తీరి పోయింది. సౌదీ అరేబియాలో చంద్రుడు కనిపించిన దాని బట్టి అక్కడ ఈద్ ను ఎప్పుడు జరుపుకోవాలో నిర్ణయిస్తారు. ఆ లెక్క ప్రకారం సౌదీలో ఈరోజు చంద్రుడు కనిపించారు. అంటే అక్కడ మార్చి 30న అంటే రేపే ఈద్ ఉల్ ఫితర్ జరుపుకోనున్నారు. ఉదయం 6.30 గంటలకు సౌదీ మసీద్ అల్ హరామ్ లో ఈద్ ప్రార్ధనలు జరుగుతాయి. ఆ తర్వాతి రోజు అంటే మార్చి 31న ఇండియాలో రంజాన్ పండుగ సెలబ్రేట్ చేసుకోనున్నారు. 

సాగత్ ఈ మోదీ..

రంజాన్ పండుగ సందర్భంగా బీజేపీ కీలక నిర్ణయం తీసుకుంది. 'సాగత్ ఈ మోదీ' పేరుతో దేశవ్యాప్తంగా 32 లక్షల మంది పేద ముస్లింలకు పండగ కిట్లు అందించనుంది. అర్హులైన వారికి వీటిని రంజాన్ రోజున ఈ కిట్లు చేరేందుకు 32 వేల మంది బీజేపీ మోర్చా కార్యకర్తలు మసీదులతో సమన్వయం కానున్నారు. వీళ్లందరూ పేద ముస్లింలకు కిట్లు చేరవేసే బాధ్యత తీసుకోనున్నారు. బుధవారం ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కిట్ల పంపిణీని ప్రారంభించనున్నారు. 
ఈ కిట్‌లో స్త్రీ, పురుషులకు వస్త్రాలు ఉంటాయి. అలాగే సేమియా, ఖర్జూర, ఎండు ఫలాలు, చక్కెర ఇతర వస్తువులు కూడా ఉంటాయి. మార్చి 31న రంజాన్‌ పండగ జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే మోదీ సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది. బీజేపీ మైనార్టీ వింగ్‌ నాయకత్వంతో దేశవ్యాప్తంగా ఈ కీట్లు పంపిణీ చేసే కార్యక్రమం ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా బీజేపీ మైనార్డీ వింగ్ జాతీయ అధ్యక్షుడు జమల్ సిద్దిఖీ మాట్లాడారు.  

today-latest-news-in-telugu | ramadan | festival 

Also Read: MI VS GT: మళ్ళీ హిట్ మ్యాన్ సింగిల్ డిజిట్ కే అవుట్

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు