/rtv/media/media_files/2025/02/28/b0WAfWH8e75NXeyLEaVc.jpg)
earthquake today in nepal
మరోసారి భూమి కంపించింది. ఎవరూ ఊహించని స్థాయిలో భూమి కదిలింది. దీంతో ఒక్కసారిగా ప్రజలు రోడ్లపైకి పరుగులు తీసారు. ఈ ఘటన శుక్రవారం (ఇవాళ) తెల్లవారుజామున నేపాల్‌లో జరిగింది. హిమాలయ మధ్య ప్రాంతంలోని సింధుపాల్ చౌక్ జిల్లా భైరవకుండ వద్ద భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. దాదాపు 6.1 తీవ్రతతో భూకంపం సంభవించింది.
ఇది కూడా చూడండి: ఒకే వేదికపై తమిళ్ హీరో విజయ్ దళపతి, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్
An earthquake with a magnitude of 5.5 on the Richter Scale hit Nepal at 2.36 IST today.
— ANI (@ANI) February 27, 2025
(Source - National Center for Seismology) pic.twitter.com/OtockGLncO
భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై దాదాపు 6.1గా నమోదు అయింది. అయితే అదే సింధుపల్‌చోక్ జిల్లాలో భూకంప కేంద్రం ఉన్నట్టు అధికారులు వెల్లడించారు. నేపాల్‌లో మాత్రమే కాకుండా భారత్, టిబెట్, చైనా సరిహద్దు ప్రాంతాల్లోనూ భూ ప్రకంపనలు సంభవించాయి.
ఇది కూడా చూడండి: National: సిద్ధాంతాలు తుంగలో తొక్కేసిన కమ్యూనిస్టు పార్టీ.. బీజేపీతో దోస్తీకి సై!
Un sismo de magnitud 5.5 sacudió hoy cerca de Kathmandu, Nepal. El sismo se sintió con fuerza en la India, Bután y Bangladesh. Sin embargo, no se reportan víctima ni daños. #earthquake pic.twitter.com/X49YtPaUrf
— Centinela35 (@Centinela_35) February 28, 2025
దీంతో ఒక్కసారిగా ప్రజలు తమ ఇల్లు, భవనాలోంచి బయటకు పరుగులు తీశారు. ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న భయంతో గజగజ వణికిపోతున్నారు. ఇలా జరగడంతో ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఈ భూకంపం కారణంగా ప్రాణనష్టమేమీ జరగలేదని అధికారులు తెలిపారు.
Also Read: 15 నెలలు.. 4 ప్రాజెక్టులు.. కాంగ్రెస్ అవినీతి చరిత్ర ఇదే: హరీష్ సంచలన ఆరోపణలు!
పాకిస్థాన్‌లో కూడా
ఇదిలా ఉంటే పాకిస్థాన్‌లో కూడా భూకంపం సంభవించింది. అక్కడ రిక్టర్ స్కేలుపై 4.5 తీవ్రత నమోదు అయింది. ఈరోజు 05.14 ISTకి పాకిస్తాన్‌ను తాకింది.
Also Read: వాహనాలకు ప్రభుత్వం కొత్త రూల్స్.. ఇది లేకుంటే కేసు ఫైల్, బండి సీజ్!
An earthquake with a magnitude of 4.5 on the Richter Scale hit Pakistan at 05.14 IST today.
— ANI (@ANI) February 28, 2025
(Source - National Center for Seismology) pic.twitter.com/96rhnMow91
పాట్నా, బీహార్‌లో కూడా
Heart breaking 💔 🥺 Bihar #earthquake I am scared right now 😦 #nepal pic.twitter.com/uP3pGsE1Lx
— Âzmi (@Azzm111) February 27, 2025
మరోవైపు పాట్నా, బీహార్‌లోని ఇతర ప్రాంతాలలో కూడా భారీ ప్రకంపనలు సంభవించాయి. భూకంపం కారణంగా భవనాలు, రోడ్లు వణుకుతున్నట్లు చూపించే వీడియోలను పాట్నాలోని ప్రజలు సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్రస్తుతం వైరల్‌గా మారాయి.