/rtv/media/media_files/2025/04/13/DPYUcLsqa5eFWxLDsAuQ.jpg)
drunk man pulled road roller with his bicycle
మందు బాబులం మేము మందు బాబులం.. మందేస్తే మాకు మేమె మహారాజులం. ఈ సాంగ్ వినగానే మందుబాబుల తఢాకా ఏంటో అర్థం అయిపోతుంది. నిజంగా మందుతాగే వారిని ఆ సమయంలో ఎవ్వరూ ఆపలేరు. తమకు తామే రాజులుగా ఊహించుకుంటారు. ఆ టైంలో భూమ్మిద కాకుండా.. ఆకాశంలో తేలుతున్నట్లు ఫీలౌతుంటారు.
Also Read: సుంకాలు 90 రోజుల విరామం ఎఫెక్ట్.. భారీ లాభాల్లో భారత స్టాక్ మార్కెట్లు..
తమను ఎవరూ ఏమీ చేయలేరని కాలర్ ఎగరేస్తారు. కొండలనైనా పిండిచేసేంత బలం తమకు ఉందని భుజాలు గజాలు చేస్తుంటారు. కొందరైతే నడి రోడ్డుమీదే రచ్చ రచ్చ చేస్తారు. ఎదురుగా వస్తున్న వాహనాలను అడ్డుకుని బాహుబలి రేంజ్ ఎలివేషన్స్ ఇస్తుంటారు. తాగిన మందు దిగేంత వరకు నింగి నేల కానరాదు. తాజాగా అలాంటిదే మరొకటి జరిగింది.
మనోడు వేసిన మందు పేరు కనుక్కోండి జరా... మనం కూడా ట్రై చేద్దాం 😋😋 pic.twitter.com/VYda8xQcoC
— SêëthaRãm (@Trending_Raam) April 13, 2025
Also Read: హెచ్ 1బీ వీసా, గ్రీన్ కార్డ్..నిత్యం ఉంచుకోవాల్సిందే..వలసదారులకు స్ట్రిక్ట్ రూల్స్
మందుబాబు డేరింగ్
ఫుల్‌గా మందేసిన ఓ వ్యక్తి ఏకంగా సైకిల్‌తో పెద్ద ప్రయత్నమే చేశాడు. తన సైకిల్‌కు రోడ్ రోలకు పెద్ద రబ్బరుసూప్ కట్టి దాన్ని లాగడం స్టార్ట్ చేశాడు. ముందుగా ఆ మందుబాబు సైకిల్ ఎక్కి తొక్కడం ప్రారంభించాడు. వెనుకున్న రోడ్ రోలర్ ఎప్పటికీ ముందుకు రాకపోవడంతో మరింత గట్టిగానే ప్రయత్నించాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఆ వీడియోపై నెటిజన్లు రకరకాలు స్పందిస్తున్నారు. మనోడు వేసిన మందు పేరు కనుక్కోండిరా జర.. మనం కూడా ట్రై చేద్దాం అంటూ కామెంట్లు పెడుతున్నారు.
(viral-news | viral-video | latest-telugu-news | telugu-news)