AR Rahman: మాజీ అనొద్దు ఫ్లీజ్‌..మేమింకా విడిపోలేదు....సైరాభాను ఆసక్తికర వ్యాఖ్యలు

ప్రముఖ సంగీత దర్శకుడు, ఆస్కార్ విజేత ఏఆర్‌ రెహమాన్ తన భార్య సైరాభానుతో విడాకులు తీసుకుంటున్నాడనే విషయం చర్చనీయంశంగా మారింది. ఇదిలా ఉంటే ఇటీవలె ఆయన అనారోగ్యంతో ఆసుపత్రి పాలయ్యాడు. ఒత్తిడికి గురికావడం వల్లే ఆయన ఆరోగ్యం దెబ్బతిందని సన్నిహితులు చెబుతున్నారు.

New Update
A. R. Rahman

A. R. Rahman

AR Rahman: ప్రముఖ సంగీత దర్శకుడు, ఆస్కార్ విజేత ఏఆర్‌ రెహమాన్ తన భార్య సైరాభానుతో విడాకులు తీసుకుంటున్నాడనే విషయం చర్చనీయంశంగా మారింది. ఇదిలా ఉంటే ఇటీవలె ఆయన గుండెకు సంబంధించిన అనారోగ్యంతో ఆసుపత్రి పాలయ్యాడు. వరుసగా ఒత్తిడికి గురికావడం వల్లే ఆయన ఆరోగ్యం దెబ్బతిందని సన్నిహితులు చెబుతున్నారు. అయితే కొద్ది రోజుల క్రితం తన భార్య సైరా భానుతో విడిపోతున్నట్లు ఏఆర్ రెహ‌మాన్ ప్రకటించిన విషయం తెలిసిందే. 29 ఏళ్ల వైవాహిక జీవితానికి ఇద్దరూ పరస్పర అంగీకారంతో ముగింపు పలికామ‌ని చెప్పుకొచ్చారు. ముగ్గురు పిల్లలకు పెళ్లిళ్లు అయిపోయాక కూడా వీరు విడిపోవడం ఏంట‌ని చాలా మంది ముక్కున వేలేసుకున్నారు. అయితే ఆయ‌న సంగీత బృందంలో బాసిస్ట్ గా ఉన్న మోహిని డే అనే అమ్మాయి వల్లే  త‌న భార్య నుండి రెహ‌మాన్ విడిపోతున్నారనే ప్రచారం సాగుతోంది.

 ఇది కూడా చదవండి: Nagababu: ఇక నాగబాబు కేరాఫ్ పిఠాపురం.. అన్నకు కీలక బాధ్యతలు అప్పగించిన పవన్!

ఇదిలా ఉండగా, విడాకులపై రెహమాన్ భార్య సైరా భాను స్పందించింది.  రెహమాన్ బంగారం లాంటి వ్యక్తి అని, ఆయననేమీ అనొద్దని విజ్ఞప్తి చేశారు. గత కొన్ని నెలలుగా తాను ఆరోగ్యంగా లేనని, అందుకే రెహమాన్ నుంచి విడిపోవాలని నిర్ణయించుకున్నట్టు తెలిపారు. ఇక తాజాగా ఏఆర్ రెహమాన్ అస్వస్థతకు గురి కావ‌డంతో, ఆయ‌న‌ను చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చేరి, చికిత్స అందించారు. ఈ విషయమై ఆయ‌న భార్య సైరా భాను స్టేట్‌మెంట్ విడుద‌ల చేసింది. ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నానని, ఛాతి నొప్పి కారణంగా ఆయన ఆసుపత్రిలో చేరారని తెలిసింది. అల్లా దయతో ఆయన ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నారని తెలిసి సంతోషిస్తున్నాను అని పేర్కొంది.

ఇది కూడా చదవండి: Sharmila Vs Pawan: జనసేన పార్టీకి కొత్త పేరు పెట్టిన షర్మిల.. సంచలన ట్వీట్!

అయితే కొంద‌రు న‌న్ను రెహమాన్ మాజీ భార్య అంటున్నారు. అలా పిలవొద్దని సైరా బాను కోరారు. రెహమాన్, తాను ఇంకా విడిపోలేదని, భార్యాభర్తలుగానే ఉన్నామని వెల్లడించారు. తాము అధికారికంగా విడాకులు తీసుకోలేదు. ఇప్పటికీ భార్యాభర్తలుగానే కొనసాగుతున్నాము. గత రెండు సంవత్సరాలుగా తాను అనారోగ్యంతో బాధపడుతున్నందున ఆయనకు ఎక్కువ ఒత్తిడి కలిగించకూడదనే ఉద్దేశంతో దూరంగా ఉన్నట్టు చెప్పుకొచ్చింది. త‌న ప్రార్థనలు ఎప్పుడు రెహ‌మాన్‌తో ఉంటాయి. ఆయ‌న కుటుంబ స‌భ్యులు రెహ‌మాన్‌ని మంచిగా చూసుకోవాల‌ని సైరా కోరింది. 

Also Read: ప్రేమను పెద్దలు అంగీకరించరేమోనని..వారిద్దరూ ఏం చేశారంటే?

 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Agniveers: అగ్నివీరులకు గుడ్‌న్యూస్‌.. పోలీస్ నియామకాల్లో 20 శాతం రిజర్వేషన్లు

హర్యానా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తమ రాష్ట్రంలో అగ్నివీరులకు పోలీసు నియామకాల్లో 20 శాతం రిజర్వేషన్లు కల్పించనున్నామని ప్రకటన చేసింది. ముఖ్యమంత్రి నాయబ్ సింగ్ సైనీ ఈ విషయాన్ని వెల్లడించారు. అగ్నివీరుల కోసం ప్రత్యేకంగా ఓ పోర్టల్‌ను అందుబాటులోకి తీసుకొస్తామన్నారు.

New Update
Agniveers

Agniveers

హర్యానా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తమ రాష్ట్రంలో అగ్నివీరులకు పోలీసు నియామకాల్లో 20 శాతం రిజర్వేషన్లు కల్పించనున్నామని ప్రకటన చేసింది. ముఖ్యమంత్రి నాయబ్ సింగ్ సైనీ ఈ విషయాన్ని వెల్లడించారు. అగ్నివీరుల కోసం ప్రత్యేకంగా ఓ పోర్టల్‌ను కూడా అందుబాటులోకి తీసుకొస్తామని పేర్కొన్నారు. ఆదివారం నాయబ్ సింగ్‌ నేతృత్వంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడారు. 

Also Read: 131 రోజుల నిరాహార దీక్ష విరమించిన రైతు ఉద్యమ నాయకుడు

'' హర్యానా నుంచి 2022-23లో 2,227 మంది, 2023-24లో 2893 మంది ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌ల్లో చేరారు. త్రివిధ దళాల్లో తమ సర్వీసులు పూర్తి చేసుకున్న అగ్నివీరుల భవిష్యత్తు కాపాడేందుకు మా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అగ్నివీరులకు పోలీసు నియామకాల్లో 20 శాతం రిజర్వేషన్లు కల్పిస్తాం. దేశంలో ఇలాంటి నిర్ణయం తీసుకున్న మొదటి రాష్ట్రంగా హర్యానా నిలిచిందని'' నాయబ్ సింగ్ సైనీ అన్నారు. 

Also Read: డీఎంకే ప్రభుత్వంపై మోదీ ఫైర్.. వాళ్లు తమిళంలో సంతకం చేయాలన్న ప్రధాని

ఇదిలాఉండగా హర్యానాలో చేపట్టే కానిస్టేబుళ్లు, ఫారెస్టు గార్డు, జైల్‌ వార్డెన్ల నియామకాల్లో అగ్నివీరులకు 10 శాతం రిజర్వేషన్లు ఇస్తామని గతేడాది అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ హామీ ఇచ్చింది. అధికారంలోకి వచ్చాక ఆ దిశగా చర్యలు మొదలుపెట్టింది. ఈ మేరకు హర్యానా అగ్నివీర్ పాలసీ 2024ను తీసుకొచ్చింది. ఈ క్రమంలోనే తాజాగా అగ్నివీరులకు పోలీస్ నియామకాల్లో 20 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని ప్రకటించింది. వీటితో పాటు స్వయం ఉపాధిని ఎంచుకునే వాళ్లకి కూడా అవసరమైన సబ్సిడీలు అందిస్తామని పేర్కొంది. 

Also Read: మణిపూర్‌లో ఉగ్రవాదులు అరెస్ట్.. భారీగా ఆయుధాలు స్వాధీనం

Also Read: అమెరికాలో అగ్నిప్రమాదం...పది మంది తెలుగు విద్యార్థులు..

 telugu-news | rtv-news | haryana | agniveer | agniveer-jobs

Advertisment
Advertisment
Advertisment